న్యూజెర్సీ: వినాయ‌క న‌వ‌రాత్రులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు ప్ర‌వాసులు. న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రోత్సవాలను వైభవంగా నిర్వహించారు. అమెరికాలో భారతీయ సాంప్రదాయలకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో స్వామివారి లడ్డూ ప్రసాదంలకు వేలంపాట నిర్వహించారు. ఎన్నారైలు ఆలయానికి వచ్చి గణనాథుడిని కొలిచి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుక‌లో తెలుగువారు అధిక సంఖ్య‌లో పాల్గొని సందడి చేశారు. న‌వ‌రాత్రుల్లో ప్రతీ రోజు ఒక సంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

తొమ్మిది రోజుల పాటు పూజ‌లు అందుకున్న అనంత‌రం నిమ‌జ్జ‌నం రోజు గణేశ్ లడ్డూను వేలం వేశారు. గ‌ణేషుడి ల‌డ్డూకు 7299 డాల‌ర్లు అంటే.. 606367 రూపాయ‌లతో వేలంలో గెలుచుకున్నారు ప్రవాసులు. హైదరాబాద్ లోని బాలాపూర్ గణపతి లడ్డూలో మాదిరిగానే సాయిదత్త పాఠంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డూలో కూడా 10 ఔన్స్ విలువైన సిల్వర్ (వెండి) కాయిన్ పెట్టారు. ఈ కాయిన్ ను తాకినా, దర్శించుకున్న పుణ్యం కలుగుతుందని నిర్వ‌హ‌కులు శ్రీ‌ రఘు శంకరమంచి తెలిపారు.

నిమజ్జనానికి దాదాపు 1000 మందికి పైగా వచ్చారు. నిమజ్జన కార్యక్రమంలో పూజలు, డప్పు వాయిద్యాలు ఊరేగింపు నిర్వహించారు. భక్తులందరూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. చిన్నాపెద్దలు కలిసి జెల్లోష్ గుజరాతీ బ్యాండ్ లో సంప్రదాయబద్దంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ కమీషనర్ ఎమిరిటస్ ఉపేంద్రా చివుకుల ఘంటసాల సంగీత ఇంటర్నేషనల్ కళాశాల మధుకు, అయన చేస్తున్న సేవలకు గాను ప్రశంసా పత్రాన్ని అందించి స‌త్క‌రించారు.

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin