న్యూజెర్సీ (Media Boss Network): శ్రీ విష్ణు ఎడ్యూకేష‌న‌ల్ సొసైటీ (SVES) ఆధ్వ‌ర్యంలోదాని అనుబంధ కాలేజీల పూర్వ విద్యార్థుల‌ ‘యూఎస్ఏ అలుమ్నీ మీట్ 2023’ (USA Alumni Meet 2023) శ‌నివారం ఉత్సాహంగా జ‌రిగింది. సెప్టెంబ‌ర్ 30న ఉద‌యం 11 గంట‌ల‌కు జ్యోతి ప్రజ్వలన జరిపి, అనంతరం పద్మశ్రీ డాక్టర్ B.V రాజు గారిని ఒకసారి స్మరించుకోని కార్యక్రమాన్ని కొనసాగించారు. న్యూజెర్సీ ఫోర్డ్స్‌లో గ‌ల‌ రాయ‌ల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న శ్రీ విష్ణు ఎడ్యూకేష‌న‌ల్ సొసైటీ గ్రూప్ కాలేజీల్లో చదివిన పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. 26 ఏళ్ల క్రితం ప్రారంభించిన SVES న‌ర్స‌పూర్‌కు చెందిన పూర్వ విద్యార్థులతో కూడా పెద్ద‌ అలుమ్ని అసోసియేషన్ అమెరికాలో కొన‌సాగుతోంది. ఫ‌స్ట్ బ్యాచ్ నుంచి 2021 వ‌ర‌కు పూర్వ విద్యార్థులంతా ఈ కార్య‌క్ర‌మంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ విద్యా సంస్థల స్థాపన, ఎదుగుదల మరియు ఫిలోసోఫీ గురించి శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ కె.వి విష్ణు రాజు గారు వివరించారు.

ఇందులో పాల్గొన్న కాలేజీల పూర్వ విద్యార్థులు ఆనాటి తమ పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు.

SVES దాని అనుబంధ కాలేజీల పూర్వ విద్యార్థుల ‘యూఎస్ఏ అలుమ్నీ మీట్ 2023` అమెరికాలో మూడు చోట్ల ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా న్యూజెర్సీలో సెప్టెంబ‌ర్ 30 శ‌నివారం ఘ‌నంగా ముగిసింది. అక్టోబ‌ర్ 7 శ‌నివారం ఫ్లోరిడా(ఓర్లాండో)లో నిర్వ‌హించ‌బోతున్నారు. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 8 ఆదివారం డల్లాస్‌(టెక్సాస్‌)లో నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ కె.వి విష్ణు రాజు గారు, వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ గారు, సెక్రటరీ కె. ఆదిత్య విస్సం గారు, విష్ణు డెంటల్ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ M.A.K.V రాజు గారు త‌దిత‌రులు పాల్గొన్నారు.

BV Raju ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – నర్సాపూర్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ – నర్సాపూర్, BVRIT హైదరాబాద్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ – భీమవరం, శ్రీ విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – భీమవరం, బి.వి రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ – భీమవరం, శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ – భీమవరం, విష్ణు డెంటల్ కళాశాల – భీమవరంకు చెందిన పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ‌ స‌భ్యులు పాల్గొన్నారు.

 

 

***

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

 

By admin