🔹 57 ఎస్సీ ఉపకులాల ‘ఆత్మ‌గౌర‌వ స‌భ’
🔹 ముఖ్య అతిథిగా ప్ర‌కాశ్ అంబేద్క‌ర్
🔹 సికింద్రాబాద్ దోబీఘాట్ గ్రౌండ్‌లో భారీ బ‌హిరంగ స‌భ
🔹 ద‌ళిత ఉప‌కులాల ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టిన‌ బైరి వెంకటేశం

హైద‌రాబాద్:
దళిత ఉపకులాలు క‌లిసి క‌ట్టుగా నిల‌బ‌డి త‌మ హ‌క్కులు సాధించుకోవాల‌ని డా. బీఆర్ అంబేద్కర్ మ‌న‌వ‌డు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. దారిద్ర రేఖ దిగువన ఉన్న ప్రజలకు ప‌థ‌కాలు చేర‌డం లేద‌న్నారు. త‌మ స‌త్తా చాటేందుకు ప్ర‌తి ఒక్క‌రు నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేయాల‌న్నారు. 57 ద‌ళిత ఉప కులాల ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్‌లోని దోబీఘాట్ గ్రౌండ్‌లో భారీ బ‌హిరంగ స‌భ జ‌రిగింది. 70 ఏళ్లుగా దళితుల జీవనం మెరుగపడక పోవడం చాలా బాధాకరమని అన్నారు. త‌మ స‌త్తా చాటేందుకు ప్ర‌తి ఒక్క‌రు నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేయాల‌న్నారు. 57 ద‌ళిత ఉప కులాల ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్‌లోని దోబీఘాట్ గ్రౌండ్‌లో భారీ బ‌హిరంగ స‌భ జ‌రిగింది. ఈ స‌భ‌లో ముఖ్య అతిథిగా ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ పాల్గొన్నారు.

త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారమే ల‌క్ష్యంగా ‘ఆత్మ‌గౌర‌వ స‌భ’ నిర్వ‌హించిన‌ట్టు ‘ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి తెలిపారు. ఈ స‌భ‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ డా. బీఆర్ అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ద‌ళితుల్లో మాల‌, మాదిగ కులాలు కాకుండా అత్యంత వెనుక‌బ‌డిన 57 ఉప కులాలు అట్ట‌డుగుస్థాయిలో ఉండి అభివృద్ధికి, అధికారానికి దూర‌మై ఎలా కొట్టుమిట్టాడుతున్నాయో ఈ స‌భ‌లో త‌మ ఆవేద‌న‌ను బైరి వెంకటేశం వివ‌రించారు. 75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌త దేశంలో ఇంకా కూడు, గుడ్డ, నీడ లేని అట్ట‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల జీవ‌న విధానాన్ని ప్ర‌భుత్వాల‌కు ఈ స‌భ‌లో తెలిపారు. అంబేద్క‌ర్ ఆశ‌యాల దిశ‌గా ప్ర‌భుత్వాలు కృషి చేయాలంటూ ఎస్సీ ఉప కులాల సంక్షేమం కోసం ప‌లు డిమాండ్లు పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డ కూడా ఎస్సీ ఉప‌కులాల‌కు ద‌ళిత‌బంధు అంద‌లేద‌ని, ద‌ళితబంధులో ఉప కులాల‌కు 40 శాతం కేటాయించాల‌ని, ఎస్సీ ఉప కులాల‌కు ప్ర‌త్యేకంగా ఫైనాన్స్ కార్పోరేష‌న్ ఏర్పాటు చేసి వెంట‌నే రూ. 2 వేల కోట్ల నిధుల‌ను కేటాయించాల‌ని, నామినేటెడ్ ప‌ద‌వుల్లో రెండు ఎమ్మెల్సీ, ఒక‌ రాజ్యస‌భ స్థానాన్ని ప్ర‌క‌టించాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీల‌న్నీ త‌మ సామాజిక వ‌ర్గాల‌కు 6 స్థానాలు కేటాయించి న్యాయం చేయాల‌ని, త‌మ కుల ధృవీవ‌ర‌ణ ప‌త్రాలు ఆర్డీవో ద్వారా కాకుండా ఎమ్మార్వో ద్వారా కేటాయించాల‌ని బైరి వెంక‌టేశం డిమాండ్ చేశారు.

తెలంగాణ‌లో 22 ల‌క్ష‌ల జ‌నాభా క‌లిగి, ద‌ళితుల‌లో 34 శాతం ఉన్న ద‌ళిత ఉప‌కులాలు విద్యా, ఉద్యోగ‌, ఉపాధి, రాజ‌కీయ అవ‌కాశాల‌లోనూ అత్యంత వెనుక‌బ‌డి ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంచార జీవ‌నానికి, క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న‌కు, చేతివృత్తుల‌తో పూట గ‌డ‌వ‌డమే గ‌గ‌నం అన్న‌ట్టు జీవిస్తున్నార‌ని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజ‌కీయంగా అత్యంత వెనుక‌బ‌డి ఉండి, క‌నీస గుర్తింపుకు నోచుకోవ‌డం లేద‌న్నారు. ఇప్ప‌టికీ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు స‌కాలంలో అందుకోలేని ప‌రిస్థితి ఉంద‌న్నారు. ఎస్సీ ఉపకులాల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో త్వరలోనే ఎస్సీ ఉపకులాల యుద్దాభేరి మహాసభను నిర్వహించి మా సత్తా చాటుతామన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో నేషనల్ ట్రైకార్ మాజీ చైర్మన్ టీఆర్ రామప్ప, చాగంటి సంజయ్ ఐ. ఆర్. ఎస్ , కత్తి మల్లయ్య, గవ్వల శ్రీకాంత్,ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి నాయ‌కులు నిర‌గొండ బుచ్చ‌న్న గోసంగి, రాయల లక్ష్మినారాయణ చిందు, తుల‌సిదాస్ గైక్వాడ్ మాంగ్, బ్యాగ‌ర కేశ‌వులు, క‌ర్నే రామారావు డ‌క్క‌లి, దొంబ‌ర దివాకర్, టీఎన్ స్వామి మిత అయ్యాల్వర్, కురువ విజయ్ కుమార్ మదాసి కురువ, బుద్ధుల గంగనర్సయ్య మాష్టిన్, నాగిళ్ళ కిష్టయ్య,మల్లు ప్రసాద్ మాల దాస‌రి,మటపతి నాగయ్య స్వామి బేడజంగం, గడ్డం సమ్మయ్య చిందు, సిరిపాటి వేణు బుడగ జంగం, పురం శివశంకర్ మాల‌జంగం, కొండ‌య్య హోళియ‌దాస‌రి, బచ్చలి బాబు బైండ్ల, రాజారామ్ డక్కలి, గడ్డం చిరంజీవి, పోలేంటి సాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గంటా రామకృష్ణ పైడి, సుంకన్న, దుపం సత్యం బేడజంగం, దిబ్బనకంటి రంగన్న మదారి కురువ, శివయ్య, లక్ష్మణ్ మోచి, నరేంద్రనాథ్ మాదిగదాసు, యెషపోగు బాబు డక్కలి, కర్నె శ్రీనివాస్,పెద్దయ్య మదాసి కురువ, పద్మావతి దొంబర, వివిధ జిల్లాల నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

HYSTAR - TALENT HUB

  • HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

By admin