#GameChanzer  

Nizamabad

తెలంగాణలోని కీలకమైన ఉమ్మడి జిల్లా నిజామాబాద్ రాజకీయం గరంగరంగా మారింది. అన్ని పార్టీలూ.. ఎన్నికలకు అప్పుడే సిద్ధమైపోయాయి. రాష్ట్ర జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా జిల్లాలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు అప్ర మత్తమవుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికివారే తమ క్యాడర్ బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీ చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల్లో భారీ ప్రచారాలను నిర్వహిస్తూనే జంప్జిలానీలపై దృష్టిపెడుతున్నారు. వారిని పార్టీల్లో చేర్చుకుంటూనే బలమైన నేతలను బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టీఆర్ ఎస్ పార్టీ మినహా ప్రతిపక్ష పార్టీల నేతలు సామాజిక సమీకరణలకు అనుగుణంగా బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. అధికార పార్టీకి అభ్యర్థుల ఇబ్బందులు లేకపోవడంతో సిట్టింగ్లుగా ఉన్న ఎమ్మెల్యేలు మరింత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నియోజకవర్గాల్లోనే తిరుగుతూ ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నారు. ఈ దఫా ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా సీట్ల కేటాయింపు ఉండడంతో తమకు అనుకూలంగా వచ్చేందుకు పథకాల అమలుతో పాటు సమస్యల పరిష్కారం కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పెండింగ్ పనులకు శంకుస్థాపనలు చేస్తూ కొత్త పనులకు అనుమతులు తీసుకువస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మంత్రి ప్రశాంత్రెడ్డి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్గుప్తా షకీల్ అమిర్ ఆశన్నగారి జీవన్రెడ్డి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఈ దఫా గట్టిపోటీ ఇవ్వనుండడంతో పాటు వీలైనన్ని స్థానాలను గెలుచుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జీలుగా ఉన్న నేతలతో పాటు సామాజిక వర్గాల ఆధారంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఈ దఫా పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా ఉండడంతో ముందస్తుగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం అయ్యేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం కావడం బహిరంగ సభకు భారీగా జనం రావడంతో అదే రీతిలో నియోజకవర్గాల్లో బలం పెంచుకునే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారు. బోధన్ నియోజకవర్గంలో 8 రోజుల పాటు ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట బైక్ యాత్రను నిర్వహించారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు సీనియర్ నేతలు యాత్రలో పాల్గొన్నారు.

ఇప్పటి వరకు ఉన్న ఇన్చార్జీలతో పాటు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ అర్వింద్ నేతృత్వంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య నియోజకవర్గ ఇన్చార్జీలు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటూ బలం పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు.

జిల్లాలో పీసీసీ కోశాధికారి మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొత్తగా బీఎస్పీ వైఎస్ఆర్టీపీ ఆమ్ఆద్మీ పార్టీల నుంచి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీల నేతలను ఈ పార్టీల సీనియర్ నేతలు ఆహ్వానిస్తూనే ఉద్యోగ సంఘాలు కుల సంఘాలు ఇతర సంఘాల నేతలను చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలు జిల్లాలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతుండడంతో నిజామాబాద్ రాజకీయం వేడెక్కింది.

 #GameChanzer  

By admin