తెలంగాణ మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు సౌత్ ఆఫ్రికాలో ఘనంగా జ‌రిగాయి. టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు అధ్వ‌ర్యములో సౌత్ ఆఫ్రికాలో కేక్ కట్ చేసి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమ భాగంగా భద్రాచలం (పర్ణశాల గ్రామం)లో 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణి చేశారు. టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ కోర్ కమిటీ సభ్యులు నరేష్ తేజ యాదారి గుండా జై విష్ణు ఆధ్వ‌ర్యంలో ఈ స‌హాయం అందించారు. ఈ కార్యక్రమములో టీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి మేడసాని, హరీష్ రంగ, గుండా జై విష్ణు, అరవింద్ చీకోటి, వెంకట్ రావు, శ్రీనివాస్ రేపాల, నరేష్ తేజ యాదారి, కాశీనాథ్ (ఒంగోలు వాస్తవ్యులు) పాల్గొన్నారు.

ఎలాంటి విప‌త్తు వ‌చ్చినా ముందుంటుంది టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ. గ‌తంలో కేరళ, వరంగల్, హైదరాబాద్, తిరుపతి.. వంటి ప్రాంతాల్లో పలు సాయం అందించింది.

By admin