▪️వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే.
▪️వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతి కాదు.
▪️ఆర్టికల్ 21 ప్రకారం వారికి జీవించే హక్కు ఉంది.
▪️వ్యభిచారం చేయడం ఒక వృత్తి అని, వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతి కాదని పోలీసులకు, మీడియా వారికి సుప్రీం కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి వ్యభిచారం చేస్తూ పట్టుపడిన సెక్స్ వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని పోలీసులకు తెలిపింది.
▪️తాజాగా సెక్స్ వర్కర్ల పై కేసు నమోదు చేయడం విషయమై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది.” సెక్స్ వర్కర్లను మేము సమర్ధించం.. అలా అని వారిని అగౌర పరుస్తుంటే చూస్తూ ఉండలేము.. వారిలా పనిచేయడం ఎవరివలన కాదు. ఎవ్వరు స్వచ్చందంగా వ్యభిచారంలోకి దిగాలి అనుకోరు.. ఎవరి బాధలు వారికి ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో కథ. అలాంటివారి విషయంలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఉన్న సమస్యను ఉన్నట్లుగా చర్చించింది లేదు. ఇక వీటి విషయంలో పట్టించుకొనేవారు వారిని ఇంకా వేధించడానికి చూస్తూ ఉంటారు. వ్యభిచార గృహంలో పట్టుబడడం ఆలస్యం పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టడం, మీడియా వారి ఫోటోలను క్లిక్ చేసి అందరికి చూపించి వారి పరువును బయటపెట్టడం. ఇక నుంచి ఇలాంటివాటికి చెక్ పెట్టినట్లే.. సెక్స్ వర్కర్లను ఇక నుంచి వేధించకూడదు. వారి ఫోటోలను మీడియా క్లిక్ చేయడం కానీ, పబ్లిష్ చేయడం కానీ చేయకూడదు. వారికి కూడా సమాజంలో ఒక గౌరవం ఇవ్వాలి. వారిపై భౌతికంగా కానీ మాటలతో కానీ ఎలాంటి దాడి చేయకూడదని పోలీసులు ఆదేశించింది. వారి విషయంలో మర్యాద పాటించాలని పేర్కొంది. ఒకవేళ తమ ఆదేశాలను కాదని మీడియా వారి ఫోటోలను ప్రచురిస్తే వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాల్సి ఉంటుందని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చింది.
▪️ అంతేకాకుండా మరికొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది న్యాయస్థానం..
వ్యభిచారం చేయడం తప్పు.. కానీ స్వచ్ఛందంగా వ్యభిచారం చేయడం నేరం కాదు.
బలవంతంగా మహిళలను వ్యభిచారం కూపంలోకి తీసుకెళ్లినవారిపై క్రిమినల్ కేసులు పెట్టండి.. వారి వద్ద నుంచి మహిళలను కాపాడి నిర్దిష్ట గడువు లోపు వారిని విడిపించటానికి చర్యలు తీసుకోవాలి.
గృహాలపై దాడులు నిర్వహించినప్పుడు స్వచ్ఛందంగా ఉంటున్న సెక్సు వర్కర్లను అరెస్టు చేయకూడదు. వారిని శిక్షించటం.. వేధించటం కానీ చేయకూడదు
సెక్సు వర్కర్ల పట్ల పోలీసులు అతి క్రూరంగా ప్రవరిస్తున్నారు.. ఇకనుంచి అలాంటివి మానుకోవాలి.. సున్నితంగా వ్యవహరించాలి.
సెక్స్ ట్రేడ్‌లో ఉన్నారనే కారణంతో సెక్స్ వర్కర్ యొక్క బిడ్డను తల్లి నుండి వేరు చేయకూదు. మానవ మర్యాద మరియు గౌరవానికి సంబంధించిన ప్రాథమిక రక్షణ సెక్స్ వర్కర్లు మరియు వారి పిల్లలకు వర్తిస్తుంది.
సెక్సు వర్కర్ల ఫోటోలు.. వారి వివరాలు వెల్లడించకుండా మీడియా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు.. నిందితుల ఫోటోల్ని ప్రసారం చేయటం..ఫోటోల్ని ప్రచురించటం చేయకూడదు.
అన్నిటికన్నా ముఖ్యంగా వారిని కూడా సమాజంలో మనుషులుగా చూడాలి.. అది వారి వృత్తి అని నమ్మాలి.