• ఘనంగా “పాగల్ వర్సెస్ కాదల్” ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్

విజయ్ శంకర్, విషిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “పాగల్ వర్సెస్ కాదల్”. ఈ చిత్రాన్ని శివత్రి ఫిలింస్ బ్యానర్ పై పడ్డాన మన్మథరావు నిర్మిస్తున్నారు. రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “పాగల్ వర్సెస్ కాదల్” సినిమా ఈ నెల 9న గ్రాండ్‌గా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో నిర్వహించారు.

ఈ వేడుక‌లో హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ… ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాలో నేను కార్తీక్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. కార్తీక్ ఇన్నోసెంట్ అబ్బాయి. తన ప్రేయసి ప్రియతో ఇబ్బందులు పడుతుంటాడు. పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ప్రేమలో ఉన్న ప్రతి లవర్ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ప్రియ పాత్రలో విషిక అద్భుతంగా నటించింది. ఈ నెల 9న థియేటర్స్ లోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.. అని అన్నారు.

హీరోయిన్ విషిక మాట్లాడుతూ… పాగల్ వర్సెస్ కాదల్ సినిమాలో నేను ప్రియ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్ ను తను తన అనుమానంతో ఇబ్బందులు పెడుతుంటుంది. నా క్యారెక్టర్ చూసిన అమ్మాయిలు మాత్రం మేము మా బాయ్ ఫ్రెండ్స్ ను ఇంతగా ఇబ్బంది పెట్టం అని అనుకుంటారు. నేను నటించిన కమిటీ కుర్రాళ్లు సినిమాతో పాటు పాగల్ వర్సెస్ కాదల్ కుడా ఒకే డేట్ కు ఈ నెల 9న రిలీజ్ అవుతున్నాయి. నా కెరీర్ లో మర్చిపోలేని సందర్భం ఇది. మా పాగల్ వర్సెస్ కాదల్ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అని చెప్పారు.

నటీనటులు – విజయ్ శంకర్, విషిక, బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి, ఆద్విక్ బండారు తదితరులు.

టెక్నికల్ టీమ్:
ఎడిటింగ్, డీఐ – శ్యామ్ కుమార్.పి.
సినిమాటోగ్రఫీ – నవధీర్
మ్యూజిక్ – ప్రవీణ్ సంగడాల
బ్యానర్ – శివత్రి ఫిలింస్
పీఆర్ఓ – కడలి రాంబాబు, దయ్యాల అశోక్,
నిర్మాత – పడ్డాన మన్మథరావు
రచన, దర్శకత్వం – రాజేశ్ ముదునూరి

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

By admin