- మునుగోడు ప్రజానీకమా… సరైన సమయం అసన్నమైంది…!
- తీర్పు చెప్పే సమయం వచ్చేసింది..!
- రా… కదలిరా..! నీ పౌరుషమెంటో చూపు..!!
- ఆత్మగౌరవ బావుటా ఎగరవేసే ఆయుధం చేతికి వచ్చే సమయం వచ్చింది!!
- వైరల్‌గా మారిన అభిమాని లేఖ!
తెలంగాణ సాయుధ రైతాంగ భూ పోరాటానికి సరికొత్త బాటలు వేసినా.. రాచకొండ విప్లవ ఉద్యమాలకు ఊపిరిలుదినా… ఫ్లోరైడ్ రక్కసిపై సమరశంఖం పూరించినా.. బహుజన ఉద్యమమైనా, తెలంగాణ పోరైనా… ‘మునుగోడు’ గడ్డ ముందుంది. బరిగీసి బస్తీమే సవాల్ అంది. సామాజిక, రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు ఇక్కడి నేల..! ధర్మభిక్షం, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి పోరాట యోధులకు అండగా నిలవటమే కాదు.. ఏ సందర్భమైనా తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తూనే ఉంది. మరీ అలాంటి గొప్ప నేపథ్యం ఉన్న గడ్డపై దిగజారిన రాజకీయాలకు తెరలేచింది. ఒకరేమో కాంట్రాక్ట్ ల కోసం ధర్మయుద్ధం అంటూ నీచ రాజకీయాలకు తెరలేపితే…! మరో పార్టీ మునుగోడు అభివృద్ధిని పక్కనబెట్టి… మళ్లీ ప్రజల దగ్గరికి వచ్చేందుకు నక్క జిత్తులు వేస్తోంది. కానీ ఒకే వ్యక్తి ఈ ప్రాంత గోడు, గోస తీర్చేందుకు అంత:కరణ శుద్ధితో పని చేస్తూనే ఉన్నాడు.. చేస్తూనే ఉంటాడు..! అతనే పల్లె రవి కుమార్. చిన్న మూరుమూల పల్లె నుంచి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టుకోలేదు. ప్రజా సమస్యలపై దశాబ్దాల కాలం పాటు తన కలం గన్నుతో నిత్యం యుద్ధం చేస్తూనే వచ్చాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఆంధ్రా సరిహద్దు ఖమ్మం నుంచి కర్ణాటక సరిహద్దు జహీరాబాద్ వరకు తిరగని పల్లె లేదు… రాయని రాత లేదు.. చూడని కష్టం లేదు..! ఫ్లోరైడ్ రక్కసి నుంచి తన ప్రాంతాన్ని విముక్తి చేసేందుకు చేయని ప్రయత్నామంటూ లేదు. తాను ఎంత ఉన్నతస్థితికి ఎదిగినప్పటికీ అంబేడ్కర్, పూలే వాదమే తన వాదమంటూ అనేక బహుజన ఉదమ్యాలకు బాసటగా నిలుస్తూనే వచ్చాడు. అన్యాయం ఎక్కడ ఉంటే… అక్కడ నిలబడ్డాడు. ప్రజల తరపున తన గొంతుకను వినిపించాడు. కుల, మత భేదాలకు ఆస్కారం లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ భరోసాగా ఉన్నాడు. ఏనాడు పదవుల కోసం ఆశపడలేదు. ఆయన నమ్ముకుంది ఒక్కటే…వాళ్లే ప్రజలు..! ప్రజల కోసమే తన పోరాటం, ప్రజల బాగు కోసమే తన ఆరాటం. చివరి శ్వాస వరకు ఇదే నినాదంతో ముందుకెళ్తున్నాడు. అలాంటి వ్యక్తి మీ తీర్పు కోసం వస్తున్నాడు. రాబోయే మునుగోడు ఉప ఎన్నికలో.. ఈ ప్రాంత మట్టిబిడ్డగా, మునుగోడు ముద్దుబిడ్డగా బరిలో నిలవబోతున్నాడు. మరి ప్రజలే జీవితం అనుకొని బ్రతుకుతున్న పల్లె రవి కావాలా..? అవినీతి, అక్రమాలతో కోట్ల రూపాయల కోసం ప్రజలను మోసం చేసే వ్యక్తులు కావాలా..?అనేది ఆలోచించండి…! తన నిశ్చ్వాస, ఉశ్చ్వాస కూడా మునుగోడే అనుకునే మట్టిబిడ్డ కోసం ముందుకు రండి… ప్రజల మనిషికి అండగా ఉండండి.. ప్రజాగొంతుకకు బాసటగా నిలవండి.. బహుజన చైతన్యాన్ని బలపరచండి..! అసెంబ్లీ సాక్షిగా మును’గోడు’ను వినిపించే అవకాశం ఇవ్వండి.
– పల్లె రవి కుమార్ అభిమాని