తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితలుగా పరుచూరి బద్రర్స్ ఎంత సుప్రసిద్ధులో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి పరుచూరి సుదర్శన్ (పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు)హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ‘సిద్ధాపూర్ అగ్రహారం’ అనే టైటిల్ ఖరారు చేసుకున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వాసు తిరుమల, ఉష శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శ్రీపాద దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ప్రముఖ దర్శకులు బి. గోపాల్ క్లాప్ ఇవ్వగా, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందజేశారు. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. ఇతర ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య , వీరూ పొట్ల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఏ రైతైనా తన కొడుకు చేతికి నాగలి ఇవ్వాలనుకుంటాడు. మా నాన్నగారు అలానే అనుకున్నారు కానీ మేం కలం పట్టుకున్నాం. నా కొడుకు రవీంద్రనాథ్ కూడా కలంపట్టుకున్నాడు. కానీ మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా క్లాప్ కొట్టించుకున్నాడు. సుదర్శన్ హీరోగాపరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత గొప్ప విద్యావంతుడికైనా వినయం లేకపోతే అతని విద్య శోభించదు. అలాగే గర్వం మనల్ని వెనక్కి లాగుతుంది. í‘Üద్ధాపూర్ అగ్రహారం’ టైటిల్లోనే సిద్ధా అని ఉంది. సిద్ధ అంటే సిద్ధం అని అర్థం. సిద్ధాపూర్ అగ్రహారం చిత్రం సుదర్శన్‌కు యాక్టర్‌గా మంచి జీవితాన్ని ప్రసాదించాలి. అలాగే సుదర్శన్ ఇండస్ట్రీలో అద్భుతమైన కథానాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ పెద్దలు, ప్రేక్షకులు సుదర్శన్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.ఈ సినిమా విడుదల తర్వాత చిత్రయూనిట్‌లోని ప్రతి ఒక్కరిపేరు ప్రేక్షకులందరకీ తెలిసేలా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘ప్రతిధ్వని’ చిత్రంలో నేను రాజకీయం గురించి ఓ డైలాగ్ చెప్పాను. ఇప్పుడు సుదర్శన్ ఆ డైలాగ్ చెబుతుంటే నాకు ఒళ్లు పులకరించి పోతుంది. అన్నగారి ఎత్తు (ఎన్టీఆర్), సుదర్శన్ ఎత్తు ఒకటే. ఆయన అంత స్థాయికి ఎదిగే ప్రయత్నం సుదర్శన్ చేయాలని, చాలా కష్టపడాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
అతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ – ‘‘పరుచూరి బ్రదర్స్ నాకు దర్శకుడిగా లైఫ్ ఇచ్చారు. రవీంద్రనాథ్ కూడా మంచి అబ్బాయి. నా బిడ్డలాంటివాడు(సుదర్శన్‌ను ఉద్దేశిస్తూ..) హీరో అవుతు న్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా టైటిల్‌నే పవర్ ఉంది. సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు.
అతిథిగా పాల్గొన్న మరో ప్రముఖ దర్శకుడు వీరూ పొట్ల మాట్లాడుతూ – ‘‘పరుచూరి బ్రదర్స్గారి దగ్గరపనితో పాటు వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో అన్ని రకాలుగా సుదర్శన్‌కు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో సుదర్శన్ మాట్లాడుతూ – ‘‘నేను హీరో అవుదామని అనుకోలేదు. కానీ దర్శకుడు కథ చెప్పిన విధా నం నాకు బాగా నచ్చింది. యాక్టర్‌గా మంచి సినిమాలు తీయాలని అనుకుంటు న్నాను.‘సిద్ధాపూర్ అగ్ర హారం’ మంచి సినిమా అవుతుందనీ, ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.
దర్శకుడు రాకేష్ మాట్లాడుతూ– ‘‘పరుచూరి బ్రదర్స్ నాకు ఎంతో స్ఫూర్తి. సిద్ధాపూర్ అగ్రహారం సినిమా హిట్ సాధిస్తుంది. ప్రీ రిలీజ్, విజయోత్సవంలో మరిన్ని విషయాలను మాట్లాడతాను’’ అన్నారు.
నిర్మాతలు వాసు తిరుమల, ఉష శివకుమార్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో రూపొందుతోన్న రెండో సినిమా ఇది. సుదర్శన్‌ను మా బ్యానర్లో హీరోగా పరిచయం చేస్తున్నందుకు లక్కీగా ఫీల్ అవుతున్నాం. దర్శకుడు రాకేష్ గారు చాలా కష్టపడ్డారు. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనీష్ రాజ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ– ‘‘దాదాపు రెండున్నర సంవత్సరాలుగా దర్శకుడు రాకేష్ ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాడు. పరుచూరి బ్రదర్స్గార్లు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో రైటర్ వై. అనుదీప్, కెమెరామేన్ శివారెడ్డి సవనమ్ మాట్లాడారు