శ్రీ చండీ పరమేశ్వరి పీఠాధిపతి డాక్టర్ అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతి జన్మదిన వేడుకలను జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా వర్గల్ వేద పాఠశాలలో 100 మంది విద్యార్థులకు వస్త్రాలు అందించారు. సరస్వతి అమ్మవారి దర్శనం, అన్న ప్రసాదం అందించారు. దేవాలయ అర్చకులతో అమ్మవారి శేష వస్త్రములు, పూలమాల తీర్థ ప్రసాదం పొందడం జరిగింది. దేవరుప్పులలోని ప్రాథమిక పాఠశాలకు సకుటుంబంగా విచ్చేసి ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలకు కావలసిన విద్య వాలంటీర్ కి అవసరమయ్యే సంవత్సరం పాటు ప్రతినెల జీతాన్ని అలాగే పాఠశాలలో సౌకర్యాలు, పిల్లలకు డిజిటల్ విద్యాబోధన కోసం ఎల్ఈడి టీవీ, డిజిటల్, వికీపీడియా అలాగే మరెన్నో ప్రాథమిక అంశాలతో కూడినటువంటి డిజిటల్ పుస్తకాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి అంజయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల మధ్యలో అందించారు.

పిల్లలందరికీ కావలసిన మంచి మార్గ నిర్దేశికత్వం చేస్తూ వారికి కావలసినటువంటి చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ కూడా అందించి ఇప్పటికే స్కూల్ కి కావాల్సిన కంప్యూటర్ ఇవ్వడం, పుస్తకాలు, బ్యాగులు ఇవ్వడం.. ఇలా ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు. ఇంకా అవ‌స‌ర‌మైన‌ సౌక‌ర్యాలు కూడా అందిస్తామ‌న్నారు. ఇలా ఎన్నో పాఠశాలలకు సాయం చేస్తున్న‌ మహోన్నత వ్యక్తిగా వారి అడుగుజాడలు మనందరికీ అనుసరణీయమని అంబటి అంజయ్య ఈ సందర్భంగా కొనియాడారు. పాఠశాల తరఫున కృతజ్ఞతగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాళ్లు ఉమారాని, ఉషారాణి ,సంధ్య తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *