Cast & Crew
రాజ్ తరుణ్ (Hero)
హాసిని సుధీర్ (Heroine)
బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీశర్మ,విరాన్ ముత్తంశెట్టి తదితరులు (Cast)
రామ్ భీమన (Director)
ప్రకాష్ తేజావత్, రమేష్ తేజావత్ (Producer)
గోపీ సుందర్ (Music)
పి జి విందా (Cinematography)
ఇటీవల హాట్ టాపిక్‌గా కొనసాగుతున్న హీరో రాజ్ తరుణ్. ఇదే తరుణంలో తాజాగా రాజ్ తరుణ్ నటించిన ‘పురుషోత్తముడు’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్.. వంటివి సినిమాపై అందరి దృష్టి పడేలా చేశాయి. ఇంతకీ ‘పురుషోత్తముడు’ ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం,
కథ: లండన్లో చదువుకుని హైదరాబాద్ కి వస్తాడు రచిత్ రామ్ (రాజ్ తరుణ్). తండ్రి(మురళీశర్మ) అతన్ని తన పరశురామయ్య ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీకి CEOని చేయాలని అనుకుంటాడు. అయితే కంపెనీ బైలాస్ ప్రకారం.. సీఈవో అవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లిపోయి, తమ పలుకుబడి ఎక్కడా వాడకుండా సామాన్య జీవితం గడపాలి. వంద రోజుల పాటు తమకు సంబంధించిన వివరాలు గురించి ఎక్కడ ఎవరికీ చెప్పకూడదు. లేదు అంటే వారికి సీఈఓ అయ్యే అర్హత ఉండదు అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది వసు(రమ్యకృష్ణ). రచిత్ రామ్ కనుక ఆ షరతును ఉల్లంఘిస్తే తన కొడుకు(విరాన్ ముత్తంశెట్టి) సీఈఓ అవుతాడు అనేది ఆమె అత్యాశ. ఈ క్రమంలో రచిత్ రామ్.. ఆ షరతులకు లోబడి కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తాడు. ఈ క్రమంలో అసలు కథ మొదలవుతుంది. తాను వెళ్లిన ఊరిలో అన్యాయానికి గురవుతున్న రైతులకు సపోర్టుగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? తర్వాత ఆ ఊర్లో పూల తోటలు పెంచుతున్న అమ్ములు(హాసిని సుధీర్)కి ఎందుకు దగ్గర కావాల్సి వచ్చింది? ఫైనల్‌గా రచిత్ రామ్ సీఈవో అయ్యాడా? లేదా? వంటివి తెలుసుకోవాలంటే సినిమా థియేటర్‌కు వెళ్లాల్సిందే!
నటీనటుల ప్రతిభ:
గత సినిమాల కంటే రాజ్ తరుణ్ ఇందులో కాస్తా గ్లామర్‌గానే కనిపిస్తాడు. ‘శ్రీమంతుడు’లో మహేష్ బాబు చేసినటువంటి రోల్ రాజ్ తరుణ్ చేశాడు. తన నటనతో తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ తన అందంతో ఆకట్టుకుంది. యాక్టింగ్‌లో ఇంకాస్త పరిణితి పొందాలి. రమ్యకృష్ణ తన పాత్రలో హుందాగా నటించి సత్తా చూపింది. ఆమె కొడుకుగా అల్లు అర్జున్ కి బావమరిది వరస అయ్యే విరాన్ ముత్తంశెట్టి నటించి పరవాలేదనిపించాడు. మురళీ శర్మ తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూపించాడు. ప్రవీణ్ కామెడీ మాస్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉంది. ప్రకాష్ రాజ్..ది అతిథి పాత్రలా అనిపించినప్పటికీ.. చివర్లో ఆ పాత్రతో చెప్పించిన డైలాగులు బాగా పేలాయి. మిగిలిన నటీనటులు పర్వాలేదు అనిపించారు.
సాంకేతిక విభాగం:
టెక్నికల్ క్వాలిటీ పరంగా సినిమాకు ఫుల్ మార్కులు వేయవచ్చు. ఫోటోగ్రఫీ బాగుంది. గోపీసుందర్ సంగీతం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. మాటలు కూడా బాగున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు సరైన బడ్జెట్ పెట్టినట్టు అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ పెద్ద హీరో సినిమాల్లో చూసినట్లు రిచ్ గా అనిపిస్తుంది. రన్ టైం కూడా 2 గంటలే ఉండటం మరో ప్లస్ పాయింట్ గా చెప్పాలి.
విశ్లేషణ :
డైరెక్టర్ తాను అనుకున్న కథను స్పష్టంగా తెరపైకి ఎక్కించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. స్క్రీన్ ప్లే పరంగా మంచి మార్కులు వేయొచ్చు. B, C సెంటర్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. వాళ్లకి లాజిక్స్ తో సంబంధం ఏమీ ఉండదు. పడాల్సిన చోట ఫైట్లు, కామెడీ ఉంటే.. వాళ్ళు టైం పాస్ చేసేస్తారు. కాబట్టి వాళ్లకు ఈ సినిమాని నచ్చే విధంగానే తీర్చిదిద్దాడు దర్శకుడు. కథ, పాటలు, ఫైటింగ్‌లు సరైన పాళ్లలో ఉన్న ఈ ‘పురుషోత్తముడు’ ఈ వీకెండ్‌లో చూడవచ్చు.
రేటింగ్ : 3.25 / 5
- BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking Now APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKING NOW TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
…