హనుమకొండ: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో (KMC) PG విద్యార్థిని ధారావత్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం సృష్టించింది. ప్రీతి అనస్థీషియా ఇంజక్షన్‌ తీసుకొని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స కోసం వెంటనే ఎం జీఎం ఎమర్జెన్సీవార్డులో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. PG సెకండ్ ఇయ‌ర్ (అనస్థీషియా) చదువుతున్న సైఫ్ అనే స్టూడెంట్ నుంచి వేధింపులు తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సైఫ్‌ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ప్రీతి కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో విసిగిపోయిన ప్రీతి చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వారు చెబుతున్నారు. ఈ ఘటనతో MGMలో తీవ్ర ఉద్రికత్తతకు దారి తీసింది.

ప్రీతి MGM ఆపరేషన్‌ థియేటర్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలియగానే ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ మృగాన్ని బహిరంగంగా ఉరితీయాలి: నునావత్ రాజు

మ‌ల్లాపూర్: ఈ ఘ‌ట‌న‌కు కారకుడైన సీనియర్‌ PG విద్యార్థిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ లు స‌ర్వ‌త్రా పెరిగిపోతున్నాయి. ప్రీతిని ర్యాగింగ్ చేసిన సైఫ్ ను బహిరంగంగా ఉరితీయాల‌ని జగో బంజారా మరో నంగారా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నునావత్ రాజు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం దీనిపైన చాలా కఠినమైన చట్టాలు, శిక్షలు అమ‌లు చేయాల‌ని కార‌కుల‌ను వెంటనే శిక్షించి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నునావ‌త్ రాజు కోరారు. ర్యాగింగ్ పేద వర్గాలకు చెందిన బిడ్డలనే క‌బ‌లిస్తోంద‌ని, దీనికి ప్రధాన కారణం కాలేజీ యాజమాన్యాల లోపమేన‌ని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin