కుక్కల వల్ల ఒక బాలుడు మృతి
దీంతో కుక్కుల మీద పెద్ద చర్చే నడుస్తోంది
మేయర్ ని కుక్కల మధ్య వేయించమంటూ
రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్లతో
కాక మరింత పెరిగింది
ఇంతకీ ఈ కుక్కలను ఏం చేద్దాం..?
– ‘ఆది’పర్వం
——————————————-
నగరంలో సుమారు 5 లక్షల కుక్కలు
ఇవన్నీ కలసి సమాజ రక్షణలో అంతో ఇంతో భాగస్వామ్యులు అవుతున్నాయ్..
నిజానికి ఈ భూమి కేవలం నరమానవులది మాత్రమేకాదు..
సర్వత్రా జీవిస్తున్న సమస్త జంతు జాలానిది కూడా..
బేసిగ్గా మనిషి అనేవాడికి
ఈ భూమిని తనకు అనువుగా వాడుకునే శక్తి యుక్తులు అధికంగా ఉండటం వల్ల
సర్వాంతర్యామిగా మారి.. అన్నింటా తానే దూరిపోయాడు..
ఈ మధ్య కాలంలో ఊళ్లలోకి చిరుత ఇతర క్రూర మృగాలు వచ్చేస్తున్నాయంటే..
అందుకు కారణం.. మొదట అవి ఉండే చోట్లకు మనం నానాటికి విస్తరించుకుని వెళ్లి పోతున్నాం..
ఇప్పుడు మిగిలింది.. కొంత అడవే..
ఇప్పటికే మనమంతా నరుక్కుంటూ వెళ్లడం వల్ల అదిప్పుడు జీవావాసంగా లేని దుస్థితి..
కనీసం దప్పిక తీర్చుకోడానికి అంత నీరు కూడా అందని వనాల మధ్య ఈ జీవరాశులంతా బతకాల్సిన అత్యయికస్థితి..
ఇదిలా ఉంచితే..
ఇప్పుడు మనం కుక్క అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం..
కుక్క వల్ల ఈ సమాజానికి ఉపయోగమేమి?
అంటే కుక్క మనిషికి అత్యంత సన్నిహితమైన జీవి ఇది పాయింట్ నెంబర్ వన్.. కాగా..
కుక్కున్న మరో మంచి గుణమేమిటంటే..
ఒక కుక్కను మనం చేరదీసి అంత అన్నం ముద్ద పడేస్తే..
అది మన జీవితం మొత్తం విస్తరించిందని మనం భావించినా భావించకున్నా..
అది మాత్రం తనకంత ఎంగిలి మెతుకులు విసిరిన వారే..
తన జీవిత సర్వస్వం అనుకుంటుంది..
కుక్కకున్న విశ్వాసం ఎంతటిదంటే..
సిండికేట్ బ్యాంక్(ఒకప్పటి బ్యాంక్) ఈ బ్యాంకు గుర్తు కుక్కే
హెచ్ఎంవీ అనే ఆడియో కంపెనీ ఎంబ్లంలోనూ కుక్కు గుర్తు ఉండటం చూసే ఉంటాం..
హెచ్ఎంవీ అంటే మరేదో కాదు హిజ్ మాస్టర్స్ వాయిస్..
ఇక హచ్ కో అనే ఒక కుక్క పై ఏకంగా
ఒక సినిమా తీశారంటే కుక్క అంటే ఎంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం గలదో తెలసుకోవచ్చు,,,
(ఈ సినిమా టామీ పేరిట రాజేంద్ర ప్రసాద్ ప్రధాన తారాగణంగా వచ్చింది కూడా)
అదంతా అలా ఉంచండీ కుక్క వల్ల..
మా వీధిలో.. మా వాడలో.. వచ్చే లాభమేంటో చెప్పండీ అని మీరంటారు కావచ్చు..
మళ్లీ మీకింకో ఇన్ కన్వియన్స్….
చిన్న బ్రేక్ తీసుకుంటున్నా..
ఈరోజు మనమంతా ఒక బాలుడి ప్రాణం తీసిన కుక్క జాతి మొత్తం నశించాలన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం.. కదా..
నిజానికి ఆ బాలుడి కుటుంబానికి అది తీరని లోటే కాదనడం లేదు..
ఇక్కడ ఆ కుటుంబం పట్ల జాలి దయ చూపొద్దనడం లేదు..
మద్దతు ఇవ్వొద్దనీ చెప్పడం లేదు..
జీహెచ్ఎంసీ తన నిర్లక్ష్యానికి డాగ్ మేనేజ్మెంట్లో ఫెయిలైనందుకు..
సాటి శునక ప్రేమికురాలిగా.. మేయర్ విజయలక్ష్మి.. ఆ బాలుడి కుటుంబానికి భారీ ఎత్తున ఎక్స్ గ్రేషియా ఇవ్వమనే అంటున్నాం….
ఇక్కడ పాయింట్ ఏంటంటే..
కుక్కలు కేవలం మనుషుల ప్రాణాలనే తీయవు..
ఎన్నో యుద్ధాల్లో మెడల్స్ సాధించిన కుక్కలున్నాయి..
లక్ష వాసనల్లో ఒక నిందితుడి వాసన పసిగట్టడం కుక్క ప్రధాన సుగుణాల్లో..
అంతటి వాసనా పటిమ దాని సొంతం.. దీంతో నేరస్తులను ఇట్టే పసిగట్టి పోలీసులకు పట్టించడం.. చాలా ఏళ్లుగా డిపార్ట్ మెంట్లో కొనసాగుతోన్న ఒకానొక శునకాచారం..
కుక్కలుండు చోట..
చోరులు.. జారులుండరయా
శునకమనగా అది
ధనమాన ప్రాణముల పరిరక్షణకే
కనకము వంటిదిగదరా…..
విశ్వదాభిరామ వినురవేమ అంటారు
మన పెద్దలు..
అలాంటి పెద్దల మాటను మనం బొత్తిగా మరచి పోయి..
వీధి కుక్కలు.. వీధి కుక్కలంటూ.. నీచాతీ నీచంగా తిట్టి పోస్తున్నాం..
నిజంగా ఒక ఇంటిలో ఒక కుక్క ఉందని తెలిస్తే..
ఆ ఇంటికి మొదట కుక్క ఇల్లు అనే పేరొస్తుంది..
ఆ పేరు వలన.. ఆ వీధిలో ఆ ఇంటికి వెళ్లడానికి ఏ దొంగ కూడా ఇష్టపడడు..
ఆ ఇంటిని తన చిట్టాలో ఇంటూ కొట్టేస్తాడు..
అంటే ఈ ఇంటికి నేను వెళ్తే నా పని ఖాళీ అని
వాడంతట వాడు ఆ ఇంటిని అవాయిడ్ చేసేసుకుంటాడు..
దీంతో మొదట చోరుల భయం ఆ ఇంట ఉండనే ఉండదు
రెండోది.. జారుల భయం..
అంటే ఇంట్లో ఆడ పిల్లలు ఉన్న వాళ్లు..
వారిపై ఏ నీచుడైనా లైంగిక దాడికి పాల్పడాలన్న
దురాలోచన చేస్తే.. వాడి మర్మాంగాలను కూడా పీక్కు తినేస్తుందా శునకరాజం..
ఒక ఇంట్లో కుక్క ఉంటే..
అక్కడ డీ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టే
(డీ ప్లస్ సెక్యూరిటీ అంటే డాగ్ ప్లస్ సెక్యూరిటీ అని అర్ధం.. ఇది జెడ్ ప్లస్ సెక్యూరిటీకన్నా శ్రేష్టమైనది)
మన దేశానికి హిమాలయ పర్వతాలు.. శతృసైనికుల బారీ నుంచి ఎంతటి రక్షణనిస్తాయో..
మనింట్లో ఒక కుక్క ఉన్నా.. అంతేలాంటి భద్రతను అందిస్తాయనడంలో ఎలాంటి సందేశం లేదు..
ఇక జీహెచ్ఎంసీ వాళ్లు..
తాము ఎన్నటి నుంచో చేస్తామని చెబుతున్న..
పెట్ కల్చర్ ని తక్షణమే మొదలు పెట్టాలి..
కుక్కల దాడి వల్ల గతించిన చిన్నారి ప్రదీప్ పేరిట.. అయినా
ఈ కల్చర్ ను ఇక నుంచైనా స్టార్ట్ చేయాలి…
పాపం ఆ చిన్నారి ఆత్మకు ఇలాగైనా శాంతి చేకూర్చేలా ఈ అధికార గణం యత్నించాలి..
అప్పుడే వీధి కుక్కలను ఇలా ప్రాణాంతకంగా మారకుండా కాపాడగలం
ఇక కుక్కలపై వర్మ కామెంట్స్ గురించి మాట్లాడితే..
ఓ నాలుగు కుక్కలు ఒక చిన్నారి ప్రాణాలను తీశాయని..
ప్రాణాలను కాపాడ్డంలోనే సిద్ధహస్తమైన జాతి గురించి అంత నీచంగా మాట్లాడ్డం తప్పు..
ఏ మిలటరీ వాడిని అడిగినా చెబుతారు..
తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ కుక్కలు ఎంతగా తమకు ప్రాణ దానం చేశాయో..
ఏ పోలీసు అధికారిని అడిగినా చెబుతారు..
తమ విద్యుక్తధర్మంలో కుక్కల సాయం ఎంత మేరకు ఉంటుందో..
ఏదైన ఘటన జరిగినపుడు..
మొదట అక్కడికొచ్చి వాలేది డాగ్ స్క్వాడే..
అలాంటి కుక్కలను హీనంగా మాట్లాడుతూ..
ఆ కుక్కల మధ్య మేయర్ ను వేయాలంటూ వెకిలి కామెంట్లు చేయడం సరైన పని కాదు..
వర్మ మీన్స్ రాజులు..
క్షత్రియ వంశజుల్లో కుక్కలకు అపారమైన విలువ ఉంటుంది..
గతంలో క్షత్రియులు వేటకు వెళ్లేటపుడు వేటకుక్కలను తీసుకెళ్లడం ఒక ఆనవాయితీ..
ఇక ముగ్గురు మరాఠీలు అనే చిత్రంలో..
ఆ క్షత్రి రాజకుమారుల ప్రాణాలను కుక్కలు కాపాడ్డం అతి పెద్ద సన్నివేశం..
ఇలా కుక్కల గురించి చెబుతూ పోతే..
ఈ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ యోక్క సుగుణాలను రాస్తూ.. పోతే..
చాలా పెద్ద చరిత్రే తవ్వి పోయావ్వాల్సి వస్తుంది..
నిజానికి ఈ మానవ సమాజం
ఆటవికం నుంచి నాగరికం వైపు మళ్లడంలో.. కుక్కల పాత్ర మరువలేనిది..
జంతు జాలంలో మనిషి తొలి మిత్రుడు కుక్కే..
కుక్కే లేకుంటే ఆనాటి ఆటవిక జీవితంలో మనిషి భయాన్ని పోగొట్టడం అంత సాధ్యమయ్యే పనే కాదు..
కుక్కలు తోడు ఉండటం వల్లే మనిషి.. ఎన్నో భయాందోళనలను జయించాడు..
తనకు అంత ముద్ద పడేసిన పాపానికి.. జీవితాంతం కాపు కాయడం కుక్కలకున్న అతి ప్రధాన గుణం..
కాబట్టి
కుక్క
కుక్క
కుక్క అంటూ వాటిని ఆడిపోసుకోవడం మానండి
మీ వీధిలో కుక్క పిల్లలు కనిపిస్తే..
వాటిని అక్కున చేర్చుకుని.. మీ ఇంట్లో ఒక భాగస్వామిగా మార్చుకోండి..
అది మిమ్మల్ని జీవితాంతం వెన్నంటే ఉంటుంది..
అర్జెంటుగా మీరు 777 చార్లీ అనే సినిమా చూడండి..
కుక్క విలువ ఏమిటో తెలుస్తుంది..
అది మన కోసం ఎంతగా పరితపిస్తుందో
ప్రాణమిస్తుందో తెలుస్తుంది..
అందుకే చాలా మంది డాగ్ లవర్స్
ఓమై గాడ్ అనడానికి బదులు
ఓ మై డాగ్ అంటారని తెలుసుకోండి..
సర్వే శునకే జన సుఖినోభవంతు
ఎవరైతే కుక్కలను పెంచుతారో వారంతా
సుఖవంతమైన జీవనాన్ని పొందుతారని ఉవాచ!
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews