‘ఆది’ప‌ర్వం

బీబీసీ.. అంటే బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేష‌న్. బ్రిట‌న్ కి చెందిన ఒకానొక మీడియా సంస్థ‌. ప్ర‌పంచంలోనే ఎన్నో మీడియాటిక్ టెక్నిక్స్ కి ఆద్య‌మైన వ్య‌వ‌స్థ‌. ఎంద‌రో ప్ర‌పంచ వ్యాప్త జ‌ర్న‌లిస్టుల‌కు ఆరాధ్య‌మైన వ్య‌వ‌స్థ‌. అలాంటి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత వార్తా సంస్థ‌.. ఈ విశ్వ‌మంతా త‌న‌దే అన్న‌ట్టుగా చెప్పుకొస్తుంది. ఈ ప్ర‌పంచాన్ని అర్ధం చేసుకోవాలంటే.. బీబీసీ ప్ర‌పంచం చూడాలంటూ.. ట‌ముకేసుకుంటుంది. ఒక్క బీబీసీ చూస్తే ప్ర‌పంచంలోని ప్ర‌తి అంశంపై అవ‌గాహ‌న వ‌చ్చేస్తుంద‌ని డ‌బ్బాలు కొడుతుంది. ఇక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ.. బీబీసీ త‌నదైన వార్తా వ్య‌వ‌స్థ ద్వారా చేసే చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ‌ల‌కు ఒక అంతంటూ ఉండ‌దు.

బీబీసీ కీ మ‌న బ్ర‌హ్మానందం మాట‌ల‌కూ పెద్ద‌గా తేడా ఏముండ‌దు.. చ‌రిత్ర‌దేముందిరా చింపేస్తే చిరిగిపోతుంద‌నే టైపు. దానికి ఏది తోస్తే అదే చ‌రిత్ర‌. అది ఏం రాస్తే అదే.. వాస్త‌వం. అంత‌గా ఈ ప్ర‌పంచ స‌మాచార వ్య‌వ‌స్థ‌పై క‌మాండ్ సాధించింది బీబీసీ.

నిజంగా బీబీసీకి చిత్త శుద్ధి ఉంటే.. ఇంగ్లండ్ స్కాట్ లాండ్ తో క‌ల‌సి గ్రేట్ బ్రిట‌న్ గా ఎలా మారింది? ఆ త‌ర్వాత ఎన్ని యుద్ధాలు చేసింది.. వాటి ద్వారా ఎంత మంది రాజుల‌ను హ‌త‌మార్చింది? ఎన్ని దేశాల ఎల్ల‌ల‌ను చెరిపేసింది? ఎంద‌రు సైనికుల‌ప్రాణాల‌ను హ‌రించింది? ఈ విష‌యాల‌న్నిటి మీద బీబీసీ ఎందుక‌ని డాక్యుమెంట‌రీల‌ను తీయ‌దు.

ఎంద‌రో సైనికుల‌తో పాటు సామాన్యుల ప్రాణాల‌ను సైతం హరించి నిర్మించిన ఈ బ్రిట‌న్ సామ్రాజ్యం గురించి డాక్యుమెంట‌రీల‌ను ఎందుకు త‌యారు చేయ‌దు?

ఇదే బ్రిట‌న్ ర‌వి అస్త‌మించ‌ని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భార‌త్ లో ఏర్ప‌రిచి.. ఇక్క‌డ విభ‌జించు- పాలించు అనే సిద్ధాంతీక‌ర‌ణతో భార‌తీయ ఆత్మ‌ను క‌కావిక‌లం చేసి.. ఎంద‌ర్ని హ‌త‌మార్చింది? ఎంద‌రేసి మంగ‌ళ్ పాండేలు, ఎంద‌రేసి జాన్సీ ల‌క్ష్మీభాయిలు, ఎంద‌రేసి ఛ‌త్ర‌ప‌తులు.. భ‌గ‌త్ సింగ్ ల ప్రాణాల‌ను బ‌లి తీసుకుందో.. వారందరి త్యాగాల‌కు చిత్ర‌ణ ప‌ట్ట‌దు ఎందుక‌ని?

ఇదే బ్రిట‌న్ భార‌త్ నుంచి దోచుకెళ్లిన సంప‌ద ఎంత మొత్త‌మో లెక్క‌లేసి మ‌రీ బ్రిట‌న్ నుంచి తిరిగి ఇప్పించే య‌త్నం చేయ‌దు ఎందుక‌ని?

ఈ రోజు ఇంగ్లండ్ రాచ‌రికాన్ని దానికున్న గొప్ప‌ద‌నాన్ని ప్ర‌పంచ‌పు నెత్తికేసి రుద్దే బీబీసీ.. నిజంగా నిష్పాక్షిక రిపోర్టింగ్ చేస్తే.. ఈ రాచ‌రికం వెనక దాగిన ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను ఎందుకు ఎండ‌గ‌ట్ట‌దు?
గోద్రాలో పోయిన ప్రాణాలకు కొన్ని వంద‌ల వేల రెట్లు ఎక్కువైన బ్రిట‌న్ నేరాలు ఘోరాల‌పై డాక్యుమెంట‌రీ తీయాల‌ని ఎందుక‌నిపించ‌దు?

మొన్న రాణి చ‌నిపోయిన‌పుడు.. ఇలాంటి క‌థ‌నాల‌ను ఎందుకు ప్ర‌చురించ‌లేదు. బ్రిటీష్ రాజ‌వంశం, దాని అధికార దాహం మీద డాక్యుమెంట‌రీ నిర్మాణాలు ఎందుకు చేయ‌దు?

అత్యంత సార‌వంత‌మైన భార‌త సామ్రాజ్యంలో ఈస్టిండియా కంపెనీతో మొద‌లైన‌ బ్రిట‌న్ పాల‌న పుణ్య‌మాని? ఏకంగా ఆనాడే మూడు కోట్ల మంది భార‌తీయుల ప్రాణాలు కోల్పోతే.. దానిపై బీబీసీ చ‌ర్చ చేయ‌దు ఎందుక‌ని?

టైమ్స్ ఆఫ్ ఇండియా 1943 క‌థ‌నాన్ని అనుస‌రించి చెబితే.. భార‌త‌దేశంపై దండెత్తిన క‌ర‌వు కాట‌కాల‌కు ప్ర‌ధాన కార‌ణం దారుణ‌మైన దోపిడీ అని రాసిందంటే.. బ్రిట‌న్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవ‌చ్చు. వీట‌న్నిటి మీదా బీబీసీకి ఎనాక్ట్ మూవీస్ చేయాల‌ని ఎందుక‌నిపించ‌దు?

భార‌త‌దేశ భావి చ‌రిత్ర‌నే త‌ల‌కిందులు చేసిన పోర్చుగీసు, డ‌చ్ వారు చేసిన యుద్ధాలు.. వాటి ద్వారా పోయిన ప్రాణాలపై బీబీసీ క‌న్నీళ్లు కార్చ‌దె ఎందుక‌ని?

మోస‌పూరిత‌మైన దౌత్య సంబంధాల‌తో ఈస్టిండియా కంపెనీ స్థాపించి.. వాటి ద్వారా ఆయా తీర ప్రాంతాల్లో ఫ్యాక్ట‌రీలు స్థాపించి.. నాడు ఇక్క‌డి నుంచి దోచుకెళ్లిన మ‌సాల దినుసుల విలువ ఎంతో లెక్క క‌ట్ట‌రు ఎందుక‌ని?

భార‌త్ లో కంపెనీల నుంచి ఫ్యాక్ట‌రీలు ఫ్యాక్ట‌రీల నుంచి కంటోన్మెంట్లుగా విస్త‌రించి.. స్థానిక రాజ్యాధికారంలో త‌ల‌దూర్చి.. అవ‌స‌ర‌మైతే.. చాటు మాటుగా రాజుల పీక‌ల‌నే క‌త్తిరించిన బ్రిటీష‌ర్ల ర‌క్త దాహం గురించి సినిమాలు తీయ‌దు ఎందుక‌ని?

సిరాజుద్దౌలా వంటి రాజులు త‌రాల త‌ర‌బ‌డి కూడ‌బెట్టిన‌.. ప‌డ‌వ‌ల కొద్దీ సంప‌ద‌ను లండ‌న్ చేర్చిన లార్డ్ క్లైవ్ రాయ‌ల్ వంటి వారి మోస‌పూరిత చ‌ర్య‌ల గురించి ఎందుకు రాయ‌దు ఈ బ్రిట‌న్ మీడియా?

ఆ రోజుల్లో ఈ మొత్తం సంప‌ద విలువను మూడు కోట్ల డాల‌ర్లుగా లెక్కిస్తే.. ఆ విలువ భార‌త క‌రెన్సీలోకి గుణిస్తే.. ఆ న‌ష్టం ఎంతుంటుందో బీబీసీ ఎందుకు ఊహించ‌దు?

ఈ సంప‌ద దోచుకెళ్లిన లార్డ్ క్లైవ్ త‌ర్వాతి కాలంలో లండ‌న్లో.. భ‌వ‌నాలు నిర్మించి, పార్ల‌మెంటులో సీట్ల‌ను కొనుగోలు చేసి, త‌ర్వాత స‌ర్ బిరుదును కూడా పొందిన‌పుడు.. ఈ కుట్ర‌ల వెన‌క దాగిన న‌గ్న స‌త్యాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌దు బీబీసీ ఎందుక‌ని?

బీబీసీ మోదీపై వ్య‌తిరేక‌ డాక్యుమెంట‌రీ తీసింద‌హో అని చంక‌లు గుద్దుకుంటున్న వ్య‌తిరేకులు.. ఆనాడు మొఘ‌లాయిలు స‌ర్వ‌నాశ‌నం కావ‌డానికి కార‌ణం ఇదే బ్రిటీష‌ర్ల‌ని తెలిసేలా ఈ బ్రిటీష్ సంస్థ‌.. డాక్యుమెంట‌రీల‌ను ఎందుకు తీయ‌దు?

భార‌త దేశ సంప‌ద ఇంత పెద్దఎత్తున ఆవిరి చేసిన ఈస్టిండియా కంపెనీ లండన్ లోని ఒక చిన్న గ‌దిలో కూర్చుని ఇంత‌టి విధ్వంస ర‌చ‌న చేసింద‌న్న‌ వాక్ త్రూలు బీబీసీ ఎందుకు చేయ‌దు?

అవ‌స‌ర‌మైతే.. న‌ల్ల‌మందుతో ప‌డేయ‌టం. లేకుంటే ఫిరంగుల‌ను పేల్చ‌డం.. త‌మ ర‌క్త దాహం తీర్చుకోడానికి ఎంత‌కైనా తెగించే బ్రిట‌న్ ఆగ‌డాల‌పై అది ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ దేశం చేసిన ఆకృత్యాల‌పై బీబీసీ యనాక్ట్ డాక్యుమెంట‌రీలు తీయాల‌ని కోరుకుందాం. అప్పుడు బీబీసీ మోదీ డాక్యుమెంట‌రీని మ‌న రెండు క‌ళ్ల‌తో స్వ‌చ్ఛందంగా చూద్దాం.. గ్రేట్ బ్రిట‌న్ మాత్ర‌మే కాదు.. గ్రేట్ గ్రేట‌ర్ గ్రేటెస్ట్ బీబీసీ అని కొనియాడుదాం.. ఏమంటారు???

-‘ఆది’ప‌ర్వం

 

బీబీసీ మీద జ‌రుగుతున్న చ‌ర్చ మీద మీ అభిప్రాయాలు, విశ్లేష‌ణ‌లు తెల‌పండి.
మీరు రాసిన ఆర్టిక‌ల్స్ పంపించాల్సిన మెయిల్ [email protected]
– ఎడిట‌ర్

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin