కాంగ్రెస్‌లో సోనియా శ‌కం ముగిసింది
మ‌రి భ‌విష్య‌త్ ఏంటి?
కాంగ్రెస్ ఇక కోలుకునే అవ‌కాశ‌ముందా?
కాంగ్రెస్ సిట్యువేష‌నేంటి?
మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే వంటి వారి ద్వారా
ఇది సాధ్య‌మేనా?
రాహుల్ లాంటి యువ‌నాయ‌క‌త్వం
వ‌ల్ల తిరిగి అధికార పీఠం చేప‌ట్ట‌గ‌ల‌దా?
ఇంత‌కీ రిటైర్డ్ సోనియా గొప్ప‌ద‌న‌మేంటి?

– ‘ఆది’ ప‌ర్వం

సోనియా గాంధీ..
భ‌ర్త గ‌తించినా స‌రే..
ప్ర‌పంచ ప్ర‌భావవంత‌మ‌హిళ‌గారాణించిన‌
మ‌హా మ‌హిళా నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం
త‌న సొంత గ‌డ్డ కాదు..
త‌న సొంత మ‌నుషులు కారు..
త‌న సొంత భాష కూడా కాదు..
విదేశీ.. విదేశీ.. విదేశీ..

వాజ్ పేయి లాంటి ఉదాత్త‌మైన వారు కూడా
ఆమె పొడ గిట్ట‌క వ్య‌వ‌హ‌రించే ఒకానొక దైన్యం..
అలాంటి దైన్య‌మైన స్థితిగ‌తుల్లో
ఒక్కొక్క‌రి నుంచి ఒక్కో స‌ల‌హా సూచ‌న‌
వాట‌న్నిటి ద్వారా కాంగ్రెస్ కి పున‌రుజ్జీవం పోసిన‌
మ‌హా మ‌హిళా నాయ‌క‌త్వ స‌ర‌ళి
నిజానికి సోనియా గాంధీ తీసుకున్న ఫ‌స్ట్ రీఫార్మ్ డెసిష‌న్ ఏంటంటే..
మాటి మాటికీ కాంగ్రెస్ పాలిత‌ రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రులను మార్చొద్ద‌ని..
నాటి స‌ల‌హాదారు శ్యామ్ పిట్రోడా ఇచ్చిన స‌ల‌హా ఇది..
ఈ స‌ల‌హాను అక్ష‌రాలా పాటించిన సోనియాగాంధీ
మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో డిగ్గీరాజాను మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేశారు
ఇక్క‌డ వైయ‌స్ఆర్ కు సైతం ఈ నిర్ణ‌య‌మే వ‌ర‌మైంది..

అంతేకాదు
సోనియాగాంధీ నూట‌పాతికేళ్ల‌కు పైగా కాంగ్రెస్ కి
మ‌న త‌రం చూసిన అస‌మాన సార‌ధ్యం
నిజంగా.. మ‌న‌కు నెహ్రూ ఇందిరల నాయ‌క‌త్వం గురించి తెలీదు
రాజీవ్ గాంధీ సంగ‌తి స‌రే స‌రి.. అది చాలా చాలా స్వ‌ల్వ వ్య‌వ‌ధిలో ముగిసిన ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన వ్య‌వ‌హారం..
పీవీ హ‌యాం అంటే అదో అంతులేని అగాథం. లోతు తెలియ‌ని న‌ర్మ‌గ‌ర్భం
సోనియా గాంధీ కాంగ్రెస్ నాయ‌క‌త్వాన్నే నేటి త‌రం చూసిన అస‌లు సిస‌లు కాంగ్రెస్ మార్క్ నాయ‌క‌త్వం
నిజానికి సోనియా గాంధీ..
ల‌క్కీ ఎలిమెంట్ టు ద ఓల్డెస్ట్ కాంగ్రెస్ పార్టీ
ఆమె త‌ర్వాత ఖ‌ర్గేలాంటి ద‌ళిత‌బ‌హుజ‌నుల సార‌ధ్యం చేప‌ట్టినా
ద‌క్షిణాది మూలాలున్న‌..
ఈ వ్య‌క్తికి అంత సామ‌ర్ధ్యం ఉంటుందా? అంటే అనుమాన‌మే..
ఇక మిగిలింది రాహుల్, ప్రియాంక‌కు
ఉన్న శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం..
వీరిద్ద‌రికున్న రాజ‌కీయ మేధ‌స్సుకు
ఒక మోదీ అమిత్ షాలా.. అధికారాన్ని సాధించి పెట్టేంత సామ‌ర్ధ్యం లేదు
ఉంటే అది ఈ పాటికి నిరూపిత‌మ‌య్యేది..
నిజానికి ఒక నాయ‌కుడు.. త‌న‌కీ ప‌గ్గాలు చేప‌ట్ట‌డం చేత కాదంటూ.. వాటిని నిలువ‌నా వ‌దిలేయ‌డం.. అంటే.. అది కూడా ఎదుట మోదీలాంటి మోనార్క్ ముందు ఇలా చేయ‌డం అంటే.. అదంత తేలికైన త‌ప్పు కాదు..

త‌ప్పొ ఒప్పో.. మొండికి తెగించి ముందుకెళ్లాలి కానీ..
నాకొద్దీ సార‌ధ్య‌మంటూ అస్త్ర స‌న్యాసం చేయ‌డం ఉత్త‌ర‌కుమార చ‌ర్య‌గా మిగిలిపోయింది..
ఎన్నేసి జోడోయాత్ర‌లు చేసినా..
ఇపుడా ముద్ర తిరిగి చెరిగే ప్ర‌స‌క్తే లేదు
ఇక పోతే ప్రియాంక‌.. ఇందిర‌ ముఖ క‌వ‌ళిక‌లున్న‌ట్టుగా ప్ర‌చార‌మున్న‌ ప్రియాంక ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన ప్ర‌చారాలేవీ ఫ‌లించ‌లేదు స‌రిక‌దా?
త‌న భ‌ర్త వాద్రా చుట్టూ అల్లుకున్న అవినీతి మ‌కిలిని తొలిగించుకోవ‌డంలోనే ఆమెకు స‌రిపోతోంది
రాహుల్- ప్రింయ‌ల‌ద్ద‌రూ…
కాంగ్రెస్ కు విజ‌య‌వంత‌మైన సార‌ధ్యం వ‌హిస్తార‌న్న గ్యారంటీ క‌నుచూపు మేర క‌నిపించ‌డం లేదు
మిగిలింది ఖ‌ర్గే.
ద‌క్షిణాదీయుడైన ఖ‌ర్గేకు ఉత్తరాదీయుల‌ను ఒడిసి ప‌ట్ట‌డం అంత తేలికైన ప‌నేం కాదు
ఖ‌ర్గేక‌న్నా బీజేపీయేత‌ర నాయ‌కుల్లో కేసీఆరే కాస్తంత బ‌లంగా క‌నిపిస్తున్నారు.. ద‌క్షిణాది నుంచి
ఖ‌ర్గే చేతిలో పార్టీ పెట్టాం..
2024 ఎన్నిక‌లు ఇటు కాంగ్రెస్ కే కాదు దేశానికే ప‌రీక్ష అంటూ సోనియా గాంధీ వాపోవ‌డంలోనూ ఒక అర్ధ‌ముంది..

పాపం ఆమె మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు?
వ‌య‌సు మీద ప‌డుతోంది ఒక ప‌క్క‌
ఇప్ప‌టి వ‌ర‌కూ చేయాల్సిందంతా చేశారు
కొడుకును కంటాం కానీ వాడి సామ‌ర్ధ్యాన్ని క‌న‌లేం క‌దా?
అయినా అత‌డు కూడా త‌ల్లిని చూసి నేర్చుకోవాలి
త‌ల్లిలోని మొండిప‌ట్టుద‌ల ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కుని నిల‌బ‌డే సామ‌ర్ధ్యం ఒంట‌బ‌ట్టించుకోవాలి..
కానీ ఎక్క‌డో బెడ‌సి కొడుతోంది
ఇంకా ఆ ప‌రిప‌క్వ‌త రాలేదు స‌రిక‌దా?
నానాటికీ మ‌రింత తీసిక‌ట్టుగా మారిన దుస్థితి
ఏదీ క‌ల‌సి రావ‌డం లేదు..
ఎంత చేసినా కాంగ్రెస్ నుముందుకు తీసుకురాగ‌లిగే దారైతే ఈ ద‌రిదాపుల్లో క‌నిపించ‌డం లేదు
త‌న‌కెలాగూ రాజ‌కీయ మాన‌సిక స్థైర్యం లేద‌ని తేలిపోయింది..
క‌నీసం శారీర‌క ప‌టుత్వ‌మైనా ఉంద‌న్న సంకేతాలివ్వాల‌న్న త‌లంపు కొద్దీ
జోడో యాత్ర‌ను ఎట్ట‌కేల‌కు పూర్తి చేసి..
బాడీ ఫిట్ నెస్ ను అయితే నిరూపించుకోగ‌లిగారు రాహుల్
మ‌రి స్ట్రాట‌జిక‌ల్ ఫిట్ నెస్ ప‌రిస్థితి ఏంటి?
ఇక్క‌డ మ‌రో కోణం కూడా ఉంది..
అదే అదృష్ట‌కోణం..
ఈ మ‌ధ్య కాలంలో కాంగ్రెస్ అదృష్ట నామం సోనియా గాంధీనే
ఆమె కూడా త‌ప్పుకున్నాక‌..
ఇన్నేసి ప‌రాజ‌యాల ఎదురు దెబ్బ‌లు తిన్న రాహుల్ ఆయ‌నకున్న బొటాబొటీరాజ‌కీయ అదృష్ట సామ‌ర్ధ్యాలు
కాగ‌ల కార్యం న‌రెర‌వేర్చ‌గ‌ల‌దా? అన్న‌దొక చ‌ర్చ‌నీయాంశం
మ‌రి చూడాలి
భ‌విష్య‌త్ ద‌శా దిశా నిర్దేశ‌క‌త్వం
కాంగ్రెస్ కు ఏ క‌మ‌లం లుక‌లుక‌ల ద్వారా కాలం క‌ల‌సి వ‌స్తుందో..
అలాగ‌ని అదంత తేలిగ్గా సాధ్య‌ప‌డేలా క‌నిపించ‌డం లేదు
బీజేపీ నానాటికీ మ‌త‌ప‌రంగా.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ..
త‌న‌కున్న అనుకూల హిందుత్వ ఓటు బ్యాంకును పెంచి పెద్ద‌ది చేస్తూ వెళ్తోంది..
మోదీ కాకుంటే యోగిలాంటి వారిద్వారానైనా మేం మా పార్టీని అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా న‌డ‌ప‌గ‌లం
అన్న గ‌ట్టి సంకేతాల‌నైతే ఇస్తూ పోతోంది..
అప్ప‌టికీ రాహుల్, అత‌డి కాంగ్రెస్ ప‌రివార్.. హిందుత్వ ఓటు బ్యాంకును ఆక‌ట్టుకోవ‌డంలో అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది..
మ‌రీ రాహుల్ అయితే గోత్ర‌నామాల‌తో స‌హా త‌న ర‌క్త‌పు మూలాల్లో దాగిన హిందుత్వ జాడ‌ల‌ను
తిర‌గ‌దోడుతున్నారు..
ఇవేవీ స‌రిపోవ‌డం లేదు
ఒక‌నాకొక స‌మ‌యంలో.. ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోసం మైనార్టీల‌కు కొమ్ము కాసిన కాంగ్రెస్ కు ఇప్పుడు స‌డెన్ గా యూ ట‌ర్న్ తీస్కోవ‌డం నైతికంగా ఏమీ క‌లిసి వ‌స్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు..
ఈ స‌మ‌యంలో త‌మ‌కున్న ఏకైన అదృష్ట ఆయుధం సోనియా కూడా ఆయుధాన్ని విడువ‌డం.. చాలా చాలా పెద్ద కోలుకోలేని దెబ్బ‌…

ఈ కండీష‌న్లో
ఆమె పుత్ర‌ర‌త్నాలు
ఆమె న‌మ్మిన బంట్లు
కాంగ్రెస్ కాడిని గ‌ట్టు దాటించ‌గ‌ల‌రా?
తేలాల్సి ఉంది..

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin