ChatGPT – Google Bard
——————————————

విద్యార్థుల సందేహాల‌ను తీరుస్తూ టీచ‌ర్ పాత్ర‌ను పోషిస్తుంది.. ఫిల్మ్ స్క్రిప్టులో హెల్ప్ చేస్తూ సినిమా రైట‌ర్‌గానూ మారుతుంది.. మార్కెట్ స్ట్రాట‌జీ చెబుతుంది.. సంక్లిష్ట అంశాల‌ను సులువుగా వివ‌రిస్తుంది. క‌థ‌లు రాస్తుంది.. క‌విత‌లు అల్లుతుంది.. మ‌నిషి కాదుగానీ మన‌సుతో రాసిన‌ట్టే అనిపిస్తుంది. అడ‌గాలే కానీ.. ఎలాంటి విష‌యాన్నైనా సుత్తిలేకుండా సూటిగా స‌మాధానమిస్తుంది. కృత్రిమ‌మేథస్సు నింపుకుని మ‌న లైఫ్‌స్టైల్ మార్చ‌డానికి వ‌స్తోన్న‌ న‌యా టెక్నాల‌జీపై స్టోరీ.

ఓ త‌ల్లి అడుగుతుంది.. “మా పాప ఫ‌స్ట్ బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి క్రియేటివ్ ఐడియాలు ఏమైనా ఉంటే చెప్పు?”
సాప్టువేర్ స్టూడెంట్ ప్ర‌శ్న‌.. “జావాస్క్రిప్ట్‌లో హెచ్‌టీపీపీ అభ్యర్థనను ఎలా చేయాలి?”
ఓ యువ‌కుడి రిక్వెస్ట్.. “నా గ‌ర్ల్ ఫ్రెండ్‌కు ఓ ల‌వ్ లెట‌ర్ రాసిపెట్ట‌కూడ‌దూ..!”
ఒక రైట‌ర్.. “నాకు స్క్రిప్టులో హెల్ప్ చేసి పెట్టవా..”
బిజినెస్ ప‌ర్స‌న్.. “నా బోటిక్ కు ఉప‌యోగ‌ప‌డే కొత్త ట్రెండ్ ఏంటో చెప్ప‌గ‌ల‌వా?”
ఎవ‌రు ఏమి అడిగినా.. క్ష‌ణాల్లో ప‌ని చేసి పెడితే దానిని ఏమ‌నాలి! మ‌నుషుల‌తో మ‌చ్చిక చేసుకుంటూ కృత్రిమమేధ “సందేహ‌మా? స‌మాధానమిదిగో..” అంటూ మ‌న ముందుకు దూసుకు వ‌స్తున్నాయి. మ‌న లైఫ్ స్టైల్‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లే ప‌ని పెట్టుకున్నాయి.

పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే శ్మశానంలోని చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు “రాజా.. శ్ర‌మ తెలియ‌కుండా విను…” అంటూ కథ చెపుతాడు. క‌థ చివ‌ర‌లో ప్ర‌శ్నలు అడిగి “సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వ‌క్కలవుతుంది” అంటాడు భేతాళుడు. తప్పని పరిస్థితులలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నల‌కు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు విక్ర‌మార్కుడు. ఆయ‌న చెప్పే స‌మాధానాలు.. అటు భేతాళుడిని, ఇటు పాఠ‌కుల‌ను మెప్పించేవి. అది ‘చంద‌మామ’ కాలం. ఈ డిజిట‌ల్ యుగంలో భేతాళుడి త‌ర‌హాలో క‌థ‌లు అల్లుతూ, విక్ర‌మార్కుడిలా సందేహాల‌కు స‌మాధానాలిస్తూ నేటిజ‌నాల‌తో దోస్తీ క‌ట్టేందుకు క్యూ క‌ట్టాయి ‘చాట్ జీపీటీ’, ‘గూగుల్ బార్డ్’.

‘చాట్ జీపీటీ’ అంటే..?
విప్లవాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ చాట్‌జీపీటీ. అధునాతన మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో చాట్‍ జీపీటీ పని చేస్తుంది. చాట్‌జీపీటీ మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు, ప్రసంగాలు, కవితలు, మార్కెటింగ్ కోప్, వార్తా కథనాలు, వ్యాసాలను రాసి ఇస్తుంది. మీరు ఈ చాట్ జీపీటీని ఏ ప్రశ్న అయినా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు. ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ సమాధానాన్ని అత్యంత వేగంగా, వివరంగా ఇస్తుంది. ఎందుకంటే ఈ చాట్ జీపీటీలో అపారమైన డేటా బేస్ ఉంటుంది. డేటా బేస్ సాయంతో ఏ ప్రశ్నకైనా ఇది ఆన్సర్ చెప్పేస్తోంది. చాట్ జీపీటీ ఏ విషయంపై అయినా సమాధానాల‌ను టెక్ట్స్ రూపంలో ఇస్తుంది. హిస్టరీ, సైన్స్, టెక్నాలజీ, కోడింగ్, మ్యాథమాటిక్స్, జనరల్ నాలెడ్జ్, పోగ్రామింగ్ లాంగ్వెజెస్, భాషలు, సాంస్కృతిక విషయాలు, ఆరోగ్యం, వంటకాలు, లైఫ్‍స్టైల్.. ఇలా ఒక్కేటేమిటి ఏ విషయాన్నైనా టెక్స్ట్ రూపంలో చాట్ జీపీటీని అడగవచ్చు. ఎలాంటి సందేహ‌మైనా తీర్చుకోవ‌చ్చు. సంబంధిత సమాచారం ఫీడ్‌ అయి ఉంటే చాలు క్ష‌ణ‌ల్లో టెక్ట్స్ మ‌న ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అంటే ఎవ‌రో మ‌న కోసం రాసిపెట్టినంత సులువుగా అన్న‌మాట‌.

ఎక్క‌డి నుంచి మొద‌లైంది?
చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ తీసుకొచ్చింది. అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఎన్‌‍జీవో ఇది. సామ్ ఆల్ట్‌మన్ 2015లో దీన్ని స్థాపించాడు. స్టాండ్‍ఫోర్డ్ యూనివర్సిటీ డ్రాప్‍అవుట్ అయిన ఆయన.. లూప్ట్ అనే సోషన్ నెట్‍వర్కింగ్ యాప్‍ను సృష్టించి, విక్రయించారు. ఆ తర్వాత 2015లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలు చేసేందుకు ఈ ఓపెన్ ఏఐను స్థాపించారు. ఈ క్రమంలోనే చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ సృష్టించింది. ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్, టెస్లా, లింక్‍డిన్ ప్రధాన ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. అయితే ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా తప్పుకుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్.. ఓపెన్ ఏఐకు ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది. 2020లో చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ… లాంచ్ చేసింది. అయితే ఓపెన్ఏఐ 3.2 వెర్షన్‍ను గ‌త ఏడాది నవంబర్ నుంచి అందరికీ అందుబాటులోకి తెచ్చింది.

ఎలా వాడాలి..?
ప్రస్తుతం చాట్ జీపీటీని https://chat.openai.com/chat వెబ్‍సైట్‍లో రిజిస్టర్ అయి చాట్ జీపీటీని వాడవచ్చు. రిజిస్టర్ అయ్యాక చాటింగ్ త‌ర‌హాలో ప్రశ్నలను టెక్ట్స్ బాక్స్ లో ఎంటర్ చేయాలి. సమాధానాలు కొన్ని క్ష‌ణాల్లోనే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. ప్రస్తుతం ఇది ఉచితం. అయితే సబ్‍స్క్రిప్షన్‍తో చాట్ జీపీటీ ప్రొఫెషనల్ వెర్షన్‍ను త్వరలో ఓపెన్ ఏఐ తీసుకురానుంది. మీరు ఈ చాట్‍ జీపీటీతో టెక్స్ట్ రూపంలో ముచ్చటించవచ్చు. గ్రామర్ తప్పులను కూడా ఇది సరిదిద్దుతుంది. ఏదైనా అంశంపై కథనాలను కూడా రాసిపెడుతుంది. సెంటెన్స్ లను మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది. తాజా పరిణామాలు ఇంకా డేటా బేస్‍లో లేవు. త్వరలోనే అప్‍డేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీని డేటా బేస్‍లో చాలా సమాచారం ఉంటుంది కాబట్టి.. చాలా వ‌ర‌కు వివరాలను అందించగలదు.

గూగుల్ సెర్చ్‌కు చాట్ జీపీటీ తేడా ఉంది. మీరు గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో ఏదైనా వెతికితే మీకు ఇంటర్నెట్ పేజీల రూపంలో మిలియన్ల కొద్దీ వివిధ ప్లాట్‌ఫాంల లింకుల రూపంలో సమాధానాలు లభిస్తాయి. కానీ, చాట్‌బాట్ మీ సెర్చ్‌కు కచ్చితమైన సమాధానాన్ని సేక‌రించి ఒకేచోట ఆర్టిక‌ల్ రాసిన‌ట్టుగా ఇస్తుంది. వెయ్యి పేజీలు ఇచ్చి కావాల్సింది ఎంపిక చేసుకోమని మ‌న‌కు ప‌ని అప్ప‌గించ‌దు. ప్రస్తుతం దాదాపు వంద భాషల్లో చాట్ జీపీటీ అందుబాటులో ఉంది. అయితే, మిగ‌తా భాషాలతో పోల్చితే ఇంగ్లిష్‌లో దీని కచ్చితత్వం చాలా ఎక్కువ. తెలుగులో అడిగితే మాత్రం అర్థంలేని ప‌దాలు, వాక్య‌నిర్మాణ‌లు వ‌స్తున్నాయి. మున్ముందు ఇలాంటివి మెరుగుప‌రుస్తార‌నుకోవ‌చ్చు.

అత్యంత వేగంగా..
నవంబర్‌లో లేటెస్ట్ చాట్ జీపీటీ-3 అందుబాటులోకి వచ్చింది. లాంచ్ అయిన రెండు నెలల్లోనే ప్రపంచమంతా పాపులర్ అయింది. ఇందుకు ముఖ్య కారణం అడిగిన ప్రశ్నకు ఇది ఒకే సమాధానాన్ని పూర్తి సమాచారంతో సమగ్రంగా ఇస్తుంది. ఒకవేళ దేని గురించి అయినా గూగుల్‍లో సెర్చ్ చేస్తే చాలా లింక్స్ కనిపిస్తాయి. దాంట్లో సమాచారాన్ని అంతా క్రోడీకరించుకోవాల్సి వస్తుంది. అదే చాట్ జీపీటీ అయితే ఒకే ఆన్సర్ ఇస్తుంది. అది కూడా సింపుల్, కాన్వర్జేషన్ లాంగ్వేజ్‍లో వివరంగా సమాధానం చెప్పేస్తుంది. అందుకే చాట్ జీపీటీ అత్యంత వేగంగా పాపులర్ అయింది. కోట్లాది మంది దీన్ని ఇష్టపడుతున్నారు. ప్ర‌పంచ ప్ర‌జ‌లంద‌రికి చేరువ‌య్యే క్ర‌మంలో చాట్ జీపీటీ ఊహించ‌ని సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ లకు సాధ్యం కాని ప్రపంచ రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో పని చేసే చాట్ జీపీటీకి లక్షల మంది యూజర్లు ఆకర్షితులవుతున్నారు. ఎంతగా అంటే.. ప్రారంభించిన 2 నెలల్లోనే 100 మిలియన్ల (10 కోట్లు) మంది యూజర్లను చేరుకునేంత!!

100 మిలియన్ యూజర్లతో చాట్ జీపీటీ యాప్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ‘సిమిలర్‌వెబ్’ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది యూజర్లను ఈ యాప్ సంపాదించుకుంది. ఇలా ఇన్‌స్టాగ్రామ్ (2.5 ఏళ్లు పట్టింది), టిక్ టాక్ (9 నెలలు పట్టింది) సహా మహా మహా సంస్థలకు సాధ్యం కాని రీతిలో చాట్ జీపీటీ కేవలం 2 నెలల్లోనే 100 మిలియన్ల ఘనతను అందుకుంది. చాట్‍ జీపీటీ వాడడం ప్రారంభించిన దగ్గరి నుంచి నేను దానికి కొంత బానిసనయ్యా” అని ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ అన్నాడంటే దాని ప్ర‌భావం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇందులో కమ్యూనికేషన్‌ సంభాషణ పద్ధతిలో ఉంటుంది. డైనమిక్‌గా రెస్పాన్స్‌ ఉంటుంది. దాదాపుగా అన్ని రకాల రాతలకు స్పందిస్తుంది. థియరిటికల్‌ ఎస్సేలు, మేథమెటికల్‌ సొల్యూషన్స్‌, స్టోరీలకు రెస్పాండ్‌ అవుతుంది. జీపీటీ-3.5 లాంగ్వేజ్‌ టెక్నాలజీని ఈ చాట్‌ జీపీటీ ఉపయోగిస్తోంది. ఈ సొఫెస్టికేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ మోడల్‌ వివిధ వనరుల నుంచి వచ్చిన రిసోర్సులను అవసరమైన విధంగా ఉపయోగించుకునేలా శిక్షణ పొందింది. క్లిష్టమైన పైథాన్‌ కోడ్‌ని సైతం నిర్మించే సామర్థ్యం ఉండటం విశేషం. అలాగే కాలేజీ స్థాయి వ్యాసాలను అవసరానుగుణంగా రూపొందించగలుగుతోంది. విద్యార్థుల సందేహాలు తీరుస్తూ వారికి ద‌గ్గ‌ర‌వుతోంది.

గూగుల్ సైతం…
రెండేళ్లలోపే గూగుల్‌ను దెబ్బతీసే సత్తా చాట్ జీపీటీకి ఉందని ఇటీవల జీమెయిల్ ఫౌండర్ పాల్ బచీట్ అన్నారు. ఈ క్ర‌మంలో గూగుల్‌ను త‌ల‌ద‌న్నే టెక్నాల‌జీ వ‌చ్చింద‌ని చ‌ర్చ మొద‌లైంది. అప్‌డేట్ అవ్వ‌క‌పోతే నిల‌బ‌డ‌లేమ‌ని భావించిన గూగుల్.. చాట్ జీపీటీతో పోటీకి సై అంటోంది. చార్ట్‌బాట్ ‘చాట్ జీపీటీ’కి పోటీగా గూగుల్ కొత్త ఆవిష్కరణ చేసింది. గత ఆరేళ్లుగా ఏఐపై కృషి చేస్తున్న ఈ కంపెనీ ఎట్టకేలకు ‘బార్డ్‌’ను (Bard) ప్రవేశపెడుతోంది. బార్డ్ అనేది ఒక ప్రయోగాత్మక సంభాషణపరమైన ఏఐ సర్వీసని, కంపెనీ ఎల్ఏఎండీఏ (లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్) ఆధారంగా పనిచేస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. తొలుత తేలిక‌పాటి న‌మూనాగా విడుద‌ల చేస్తూ, త‌క్కువ కంప్యూట‌ర్ సామ‌ర్థ్యంతో ఎక్కువ మంది వినియోగ‌దార్ల‌కు, ఎక్కువ స్పంద‌న‌లు అందించేలా చేస్తామ‌న్నారు. ప్రస్తుతానికి దీనిని కొంతమందికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చామని, పరిశీలిన తర్వాత ఏడాదిలోపే విస్తృతంగా అందుబాటులో తీసుకొస్తామన్నారు. తాము బార్డ్‌ని నిర్భయమైన, బాధ్యతాయుతమైన సర్వీస్‌గా మార్చాలనుకుంటున్నామని గూగుల్ చెబుతోంది. మైక్రోసాఫ్ట్ తమ సెర్చ్ ఇంజిన్ బింగ్‌తో పనిచేసే ఏఐ చాట్‌బాట్‌ను కూడా తీసుకువస్తోందని వార్తలు వస్తున్న తరుణంలో గూగుల్ బార్డ్ ప్రకటన వచ్చింది.

‘ ‘బార్డ్‌’.. నాణ్య‌త‌, భ‌ద్ర‌త’’
– సుందర్ పిచాయ్, సీఈవో, గూగుల్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ లోతైన టెక్నాలజీ బార్డ్ ను ప్ర‌వేశ‌పెడుతున్నాం. వైద్యులు తొందరగా వ్యాధులను నిర్ధారించడం నుంచి ప్రజలకు వారి సొంత భాషలో సమాచారాన్ని అందించడం వరకు దీని ద్వారా సాధ్యపడుతోంది. గత రెండేళ్లుగా లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ (ఎల్ఏఎండీఏ) ద్వారా కొత్త ఆర్టిఫిషియల్ సర్వీస్‌పై పని చేస్తున్నాం. మేం ఈ కొత్త ఏఐ టెక్నాలజీని బార్డ్ అని పిలుస్తున్నాం. ఈ రోజు మేం ఈ దిశలో మరో అడుగు వేశాం. మేం దానిని పబ్లిక్ చేసే ముందు టెస్టులకు పంపిస్తున్నాం. వాస్త‌వ ప్ర‌పంచంలోని స‌మాచారానికి స‌రిపోయేలా నాణ్య‌త‌, భ‌ద్ర‌త విష‌యంలో అత్యున్న‌త ప్ర‌మాణాల‌ను చేరేలా బార్డ్ ప‌నితీరు ఉండేలా అంత‌ర్గ‌త ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే అందరికీ అందుబాటులో ఉంటుంది.

విభిన్న వ‌ర్గాల వారు త‌మ‌కు తెలియ‌ని ప్ర‌శ్న‌ల‌కు ‘బార్డ్‌’ ఇట్టే స‌మాధానం చెప్పేస్తుంది. విజ్ఞానానికి తెలివి, సృజ‌నాత్మ‌క‌త జోడించి ప‌లు భాష‌ల్లో స‌మాచారం అందించ‌గ‌లుగుతుంది. వికీపీడియా, దేశ విదేశాల పత్రికలు, ఆన్‌లైన్ గ్రంథాల్లో అందుబాటులో ఉన్న లక్షల పుటల సమాచారాన్ని సంగ్రహించగలదు. మన ప్రశ్నలకు సమాధానాలను క్షణాల్లో అందిస్తుంది. సమస్త అంశాలతో మనుషులతో మాటామంతీ జరపగలదు. వికీపీడియా, దేశ దేశాల పత్రికలు, ఆన్‌లైన్ గ్రంథాల్లో అందుబాటులో ఉన్న లక్షల పుటల సమాచారాన్ని సంగ్రహిస్తూ.. మన ప్రశ్నలకు సమాధానాలను అపార విజ్ఞాన భాండాగారం నుంచి క్షణాల్లో సేకరించి రాతపూర్వకంగా అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వెబ్ డేటాను కేవలం కాపీ కొట్టడానికి మాత్రమే అది పరిమితం కాదు. మానవ మేధలా తనకు అందుబాటులోని డేటాల మధ్య సంబంధాన్ని గుర్తించి, వాటి మధ్య ఉన్న భేదాలను సమన్వయపరిచి జవాబులిస్తుంది. అందుకే ఇది మనుషులనే మించిపోతుందేమోననే చ‌ర్చ కూడా జోరుగా సాగుతోందిప్పుడు.

చాట్‌జీపీటీ – బార్డ్ మ‌ధ్య వ్య‌త్యాసం ఏంటంటే..

రెండింటి ల‌క్ష్యం నెటిజ‌న్‌ల సందేహాలు తీర్చ‌డ‌మే. అప్ప‌టికే స్టోర్ చేసిన స‌మాచారాన్ని అవ‌స‌ర‌మైన రీతిలో రూపొందించి చాట్ జీపీటీ అందిస్తుంది. ‘బార్డ్’ మాత్రం వెబ్‌ నుంచి సమాచారాన్ని అందుకుంటుంది. సాధ్యమైనంత ఖచ్చితమైన సమాచారాన్ని సేక‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. వెబ్‌ నుంచి అధిక నాణ్యత కలిగిన సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా బార్డ్‌ను డిజైన్ చేసినట్టు సుందర్ పిచాయ్ చెబుతున్నారు. పిల్లలు సైన్స్‌కు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలను కూడా దీని ద్వారా సులభంగా నేర్చుకోవచ్చునని చెప్పారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్ వరకు ఎవరైనా తెలుసుకోవచ్చని వివరించారు.

వాస్తవానికి ఇప్పుడు ఉన్న చాట్‌ బాట్‌కు మరింత మెరుగైన రూపం చాట్‌ జీపీటి(జనరేటివ్‌ ప్రీ ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌). పర్యవేక్షణకుతోడు రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్‌తో ఇది పని చేస్తుంది. రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్‌ అంటే మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నిక్‌ ఉపయోగించి ఫీడ్‌బ్యాక్‌ పొందుతారు. అంతే కాదు, దాంతోటే ఏజెంట్‌ లెర్నింగ్‌ – యాక్షన్‌ అంతా కలగలిసి ఉంటుంది. గూగుల్‌తో పోల్చుకున్నప్పుడు ప్రశ్నకు జవాబు, పలు సమాధానాలు ఉన్న లింకుల రూపంగా ఇది ఉండదు. నిజానికి గూగుల్‌లో ప్రశ్నిస్తే అదిచ్చే లింకుల నుంచి సరైన సమాధానం కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. అదే చాట్‌ జీపీటీ విషయానికి వస్తే, సంబంధిత సమాచారం ఫీడ్‌ అయి ఉంటే చాలు ఎలాంటి శషబిషలు లేకుండా నేరుగా ప్రత్యక్షమవుతుంది. భారత దేశ రాజధాని ఏమిటి అని అడిగితే న్యూఢిల్లీ అన్నంత సింపుల్‌గా, సూటిగా సమాధానం ఇస్తుంది.

ఆందోళనలు, భయాలు..
చాట్‌బాట్ కొన్నిసార్లు అభ్యంతరకరమైన, తప్పుడు సమాచారాన్ని ఇస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒక విష‌యాన్ని నిజాన్ని త‌ప్పుగా మార్చి కొంద‌రు చాట్‌బాట్‌కు చెబుతూ వెళితే అదే నిజ‌మనుకుని, స్టోర్ చేసుకుని ఇత‌రుల‌కు అదే త‌ప్పుడు స‌మాధాన‌మిచ్చే అవ‌కాశం ఉంటుంద‌నే చ‌ర్చ కూడా ఉంది. త‌ప్పును ఒప్పు అని చాట్‌బాట్‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌మాదం కూడా ఉంటుందన్న‌ది కొంద‌రి టెక్ విశ్లేష‌కుల మాట‌.

కృత్రిమమేధ‌లో జ‌రిగే పొర‌పాట్లు ఇవే..

కృత్రిమమేధ‌లో స‌మ‌స్య ఏంటంటే.. ఏదీ త‌ప్పు ఏదీ ఒప్పు అని దానికి తెలియ‌దు. చాట్‌జీపీటీ విష‌యానికి వ‌స్తే, 8 బిలియ‌న్ డాక్యుమెంట్స్‌ను సిద్ధం చేశారు. యూజ‌ర్ ఏదైనా ప్ర‌శ్న అడిన‌ప్పుడు ఈ డేటాబేస్‌లోని డేటాపాయింట్స్ ఆధారంగా అన్ని పదాల‌ను సాలేగూడులాగా లింకు చేసుకుంటుంది. యూజ‌ర్ కీవ‌ర్డు టైప్ చేసిన‌ ప‌దాల ఆధారంగా త‌న కంటెంట్ క్రియేట్ చేసి చూపుతుంది. 7+5 ఎంత అని మ‌నం ప్ర‌శ్నించిన‌ప్పుడు స‌మాధానంగా 12 అని వ‌స్తుంది. కానీ నువ్వు చెప్పింది త‌ప్పు.. సమాధానం 10 అని మ‌నం చెప్పామ‌నుకొండి.. కాదు స‌మాధానం 12 అని మ‌ళ్లీ వ‌స్తుంది. మ‌ళ్లీ నువ్వు చెప్పింది త‌ప్పు అని రెండోసారి కూడా మ‌నం చెప్పామ‌నుకొండి, సారీ దానిని స‌రి చేసే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని స‌మాధానం ఇస్తుంది. అయితే అప్ప‌టికే అయిపోదు. 7+5 = 10 అని మ‌నం ఒక‌రిద్ద‌ర‌మో కాకుండా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల‌మంది యూజ‌ర్స్ ఇలాగే త‌ప్పుడు అన్స‌ర్ ఇస్తూ వెళితే గ‌న‌క ప‌రిస్థితి మ‌రొలా ఉంటుంది. మెజారిటీ యూజ‌ర్స్ ఎవైతే సిగ్న‌ల్స్ ఇచ్చి ఉన్నారో దానినే ప్రామాణికంగా తీసుకుని ఆ త‌ప్పుడు స‌మాధానాన్ని త‌న డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటుంది. దీంతో మిగతా యూజ‌ర్స్‌కు ప‌క్క‌దారి ప‌ట్టించే త‌ప్పుడు స‌మాధానాలు వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. ఇలా చాలా సబ్జెక్టుల్లో ఇలాంటి త‌ప్పుడు మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉంటుంది.  ఇక కంపెనీ నిర్వ‌హ‌కుడు త‌న‌కు ప్రాజెక్టు ప‌నులు చేయ‌డానికి ఇలా ఒక డేటాబేస్ త‌యారు చేసుకుంటే గ‌న‌క ఉద్యోగాలు కోల్పోయే ప్ర‌మాదం కూడా ఉంటుంది. అలా జ‌రిగితే మిష‌న్స్ రాజ్య‌మేలే అవ‌కాశం కూడా ఉంది. మ‌న మేధ‌స్సుకు సంబంధించిన విష‌యానికి వ‌స్తే.. మ‌నిషి బ్రెయిన్ వాడ‌కుండా పూర్తిగా ఇలాంటి చాట్‌బాట్‌పైనే ఆధార‌ప‌డితే ప్ర‌మాద‌మే. చాట్‌బాట్ క‌విత‌లు, క‌థ‌లు, సందేశాలులు రాస్తుంద‌ని, దానిపైనే ఆధార‌ప‌డితే మ‌న‌ మ‌న మెద‌డుకు ఆలోచ‌న శ‌క్తి క‌లిగించ‌లేము. ఫ‌లితంగా మ‌న‌ లాజిక‌ల్ బ్రెయిన్ న‌రాలు చురుకుద‌నం కోల్పోతుంది. సొంత ఆలోచ‌న శ‌క్తి కోల్పోతాము. మెమోరీ కూడా త‌గ్గిపోతుంది. దాంతో త‌న మేధ‌స్సు వాడ‌టం త‌గ్గించి పూర్తిగా మిష‌న్ మీదే ఆధార‌ప‌డే ప్ర‌మాదం ఉంటుంది. అయితే నాలాంటి వారికి నాలెడ్జీ కోస‌మైతే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పొచ్చు. నాకు అవ‌స‌ర‌మ‌య్యే క్వాంటీ ఫిజిక్స్ గురించి చాట్‌జీపీటీ నుంచి తీసుకోగ‌లుగుతాను.

– శ్రీ‌ధ‌ర్ న‌ల్ల‌మోతు,  
ప్ర‌ముఖ‌ టెక్నాల‌జీ నిపుణుడు

చాట్‌బాట్ సాయంతో వ్యాసాలు రాయించుకుని స్కూళ్లు, కాలేజీల్లో సమర్పించే విద్యార్థులూ ఉన్నారు. దాని పనిని తమ ఘనతగా చెప్పుకొనే ప‌రిస్థితులూ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటిగా చెప్పే ‘యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామ్‌ అండ్‌ ద బార్‌’ వంటివాటిలో చాట్‌జీపీటీ ఈజీగా పాస్‌ అయ్యిందంటే దాని శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చాట్‌ బాట్ల హవా ఇలాగే కొనసాగితే క్రమంగా మనుషుల ఆలోచనా ధోరణి, ఇతర నైపుణ్యాలు తగ్గిపోయి అన్నింటికీ మెషీన్లపై ఆధారపడి బతికే ప్రమాదం ముంచుకొస్తుంది. విద్యార్థుల విషయంలో చాట్ జీపీటీ పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్ల హోం వర్కును ఈ చాట్ జీపీటీ సులభంగా చేసేస్తోంది. ఏదైనా ప్రశ్న ఎంటర్ చేస్తే చాలు మొత్తం సమాధానాన్ని వివరంగా ఇచ్చేస్తోంది. ఉదాహరణకు.. ఏదైనా మ్యాథమ్యాటిక్స్ ప్రశ్నను ఎంటర్ చేస్తే.. సొల్యూషన్‍ను పూర్తిగా స్టెప్ బై స్టెప్ చూపిస్తోంది. ఇసే రైటింగ్, గ్రామర్ తప్పులను కూడా ఇది పూర్తిగా సరిదిద్దేస్తుంది. సైన్స్ థియరీలు, హిస్టరీ ఇలా అన్ని ప్రశ్నలకు చాట్ జీపీటీ సమాధానాలు ఇస్తుంది. దీనివల్ల విద్యార్థుల ఆలోచన శక్తిని చాట్ జీపీటీ తగ్గించేస్తుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అలాగే పరీక్షల్లో చీట్ చేసేందుకు కూడా చాట్ జీపీటీ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళనలు ఉన్నాయి. విద్యార్థుల మేథోశక్తిని ఇది తగ్గించేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా న్యూయార్క్ లోని స్కూళ్లలో ఈ చాట్‍జీపీటీ టూల్ వాడకాన్ని నిషేధించారు కూడా. సరైన పద్ధతిలో వినియోగిస్తే విద్యారంగానికి చాట్ జీపీటీ ఉపయోగపడుతుంద‌నే చ‌ర్చ కూడా ఉంది. పిల్లలు విషయాలను సమగ్రంగా సులభంగా తెలుసుకోవ‌చ్చు. మంచి ఎడ్యుకేషన్ టూల్‍గా మారుతుంది. అయితే చాట్ జీపీటీ దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా లేక‌పోలేదు. ఒక పాజిటివ్ కోణం ఉంటే రెండు నెగిటివ్ కోణాలు ఉంటే మాత్రం ఈ చాట్‌బాట్‌లు స‌మాజానికి న‌ష్టాన్నే క‌లిగిస్తాయి. ప్ర‌స్తుతం చాట్‌బాట్‌లు పూర్తి స్థాయిలో రూపొందించాల్సి ఉంటుంది.

నేను ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్నాను. చాట్ జీపీటీ నా చ‌దువుకు సంబంధించి ఎన్నో సందేహాలు తీరుస్తుంది. నాకైతే సీ ప్రొగ్రామ్ జావాకు సంబంధించిన కోడింగ్ ఎర్ర‌ర్స్ గుర్తించ‌డానికి ఉప‌యోగ‌డుతోంది. ఎగ్జామ్స్ ప్రిఫేర్ అయ్యే స‌మ‌యంలో కూడా అనుమానాల‌ను నివృత్తం చేస్తుంది.

– అజ‌య్ కుమార్,
స్టూడెంట్, హైద‌రాబాద్

సైబర్ దాడులకు..
సైబర్ దాడులు చేసే కేటుగాళ్లకు చాట్‍జీపీటీ ఆయుధంగా మారిందనే భ‌యాలు కూడా ఉన్నాయి. సైబర్ దాడులు చేసేందుకు నేరస్థులు కోడింగ్‍ను చాట్ జీపీటీ ద్వారా సులభంగా పొందుతున్నారని, దీంతో సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతుందని కొన్ని టెక్నికల్ రీసెర్చ్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నకిలీ వెబ్‍సైట్లు, ఫేక్ ఈ-మెయిల్స్ అధికమవుతాయని హెచ్చరిస్తున్నాయి. అయితే చాట్ జీపీటీకి ఓపెన్ ఏఐ క్రమంగా కొన్ని మార్పులను చేస్తోంది. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానాలను నిరాకరించే విధంగా డెవలప్ చేస్తోంది.

చాలా వ‌ర‌కు టెక్నాల‌జీలు రెండు వైపుల ప‌దునైన క‌త్తిలా క‌నిపిస్తాయి. అయితే పాజిటివ్ కోణంలో ఉప‌యోగ‌ప‌డేలా చేయాలి. ఆ కోణంలోనే వాడుకోవాలి. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టే మార్పులను ఆహ్వానించాల్సిందే. పాత‌కు పాత‌రేసే ఆవిష్క‌ర‌ణ‌లు జ‌ర‌గాల్సిందే. మాన‌వ పురోగ‌తి క్ర‌మం అదే. సవాళ్లను, స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాలి. ఏదీఏమైనా టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ, బార్డ్ సంచ‌ల‌న‌ ఆవిష్కరణలుగా నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు.

– స్వామి ముద్దం,
mns@journalist.com

ChatGPT తో ఇంట‌ర్వ్యూ – ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానాలు!

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin