-‘ఆది’ప‌ర్వం

భావ‌జాలానికి కూడా
ఒక దృష్టి కోణం ఉంటుంది
ఒక దుష్ట కోణం ఉంటుంది

ఈ ఇజిక్వ‌ల్టూ ఎంసీ స్క్వ‌యిర్ అన్న‌ట్టు
ఈళ్ల ఈళ్ల ఇజిక్వ‌ల్టూల్లో మ‌తం కులం అనేవి స్ప‌ష్టంగా దాగి ఉంటాయ్
ఇందులోంచి కూడా
ఒక దుష్ట‌శ‌క్తి సూత్రం వెలుగులోకి వ‌స్తుంటుంది..
ఈ శ‌క్తిని ఎక్క‌డెలా వాడాలో అలా వాడ్డం క్లియ‌ర్ క‌ట్ గా క‌నిపిస్తుంది

వీళ్ల‌కు సాధువులు చ‌నిపోతే ఒక‌లా
ఇమామ్, ఫాద‌ర్ చ‌నిపోతే మ‌రొక‌లా రంగు మార్చేస్తున్నారు
రోహిత్ వేముల చ‌నిపోయిన‌పుడు
అత‌డు ద‌ళితుడా కాడా అన్న చ‌ర్చ ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం
ఎక్క‌డి నుంచో రాహుల్ వ‌చ్చి వాలిపోయి..
రాజ‌కీయాలు మొద‌లు పెట్టేస్తాడు

అత‌డు ద‌ళితుడు కాక‌పోయి ఉంటే
ఆ ప్రాణానికి పెద్ద విలువ లేద‌న్న‌ట్టుగా ఈ స‌మాజం
ఈ సోష‌ల్ మీడియా స‌మాజం.. ఈ వామ‌ప‌క్ష భావ‌జాలం
త‌యారు కావ‌డం ఒక దుర‌దృష్ట‌క‌ర ప‌రిణామం

అప్పుడెప్పుడో
ఈ సోష‌ల్ కుష‌న్ ఉందేమో తెలీదు కానీ
ఇప్పుడు అగ్ర‌ద‌ళిత ఎవ్వ‌డైనా ఒక్క‌టే
రామ్ నాథ్ కోవింద్ కోసం..
ఆ పార్టీకే మూల‌స్థంభ‌మైన‌ అద్వానీ
క‌నుమ‌రుగ‌యి పోయాడు
ఇలాంటి ఎన్నో త్యాగాలు జ్ఞ‌ప్తికి రావు

స‌రే వ‌దిలెయ్యండి
ఒక‌రికి న్యాయం చేయ‌డం కోసం
మ‌రొక‌రికి అన్యాయం చేస్తూ పోవ‌డం ఎంత వ‌ర‌కూ క‌రెక్టు?
ఇప్ప‌టికీ అర్ధం కానిది ఏంటంటే
అక్బ‌రుద్దీన్ వాఖ్య‌ల‌కు ఒక‌లా స్పందిస్తారు
నుపూర్ శ‌ర్మ కామెంట్ల‌కు మ‌రొక‌లా స్పందిస్తారు

అత‌డు అనుచిత వ్యాఖ్య‌లు చేసినా అవి ఉచితాలై పోతాయి
ఇక్క‌డీమె ఉచితాల‌ను చెప్పినా అనుచితాలై పోయాయి
ఆమె డీపీ పెట్టుకున్న సాధార‌ణ బ‌డుగు బ‌ల‌హీన ద‌ర్జీని
నిలువునా హ‌త్య చేస్తే.. ఈ నోళ్లు పెగ‌ల‌వ్
నుపూర్ ని హ‌త‌మార్చ‌డానికి పాకిస్థాన్ బోర్డర్ దాటి వ‌స్తే
వీడికిక్క‌డ అక్ష‌రం క‌ద‌ల‌దు

అదేమంటే..
మేమెంతో లాస‌య్యాం అంటారు
మ‌రి ఇక్క‌డ ప్రాణాల మీద‌కు వ‌స్తుంటే
వారి ప్రాణాపాయం ప‌రిస్థితేమిటి?
అయినా కానీ ఏం పెద్ద ఫ‌ర‌క్ ప‌డ‌దు
ఆసిఫా చ‌నిపోతే ఒక‌లాగ‌
గీత మ‌ర‌ణిస్తే మ‌రొక‌లాగ స్పందిస్తారు

ఇప్ప‌టికీ అర్ధంకానివేంటంటే
కులానికీ మ‌తానికీ ఒక‌ర‌కంగా
వారి వారి ప్రాణాల‌కు విలువ ఉంటుందా?

ఇదెక్క‌డి అభ్యుద‌యం?
ఇదెక్క‌డి భావ‌జాలం??
ఇప్ప‌టికీ అర్ధం కాని విష‌య‌మేంటంటే..
మ‌నం ఎన్నో సామాజిక స‌నాత‌న దురాచారాల‌ను
తుద‌ముట్టించ‌డంలో భాగంగానే క‌దా ఇంత వ‌ర‌కూ వ‌చ్చాం
ఎన్నో అట్రాసిటీల‌ను వ‌ద్ద‌నుకునే క‌దా ఇంత వ‌ర‌కూ చొచ్చొకొచ్చాం

ఇప్పుడెంత దుస్థితికి వ‌చ్చేశామంటే
మోడ్ర‌న్ సొసైటీ ప్రాడ‌క్ట్ అయిన వాట్స‌ప్ కు కూడా
అంట‌రాని త‌నం అంట‌గ‌ట్టేసిన అధ‌మాధ‌మ స్థితికి చేరిపోయాం

ఇప్పుడు చూడండీ..
ప్రీతి అనే అమ్మాయి చ‌నిపోవ‌డానికి సైఫ్ అనే వాడు కార‌ణ‌మ‌ని తెలిసినా
ఈ సోష‌ల్ మీడియా కిక్కుర‌మ‌న‌దు

ఎందుకీ వివ‌క్ష‌
ఈ భావ‌జాలంతో మ‌న‌మెలా ముందుకెళ్ల‌గ‌లం?
ఇలాంటి ఎన్ని వ్య‌త్యాసాలు చూపిస్తున్నాం
ఎవ‌రో విశ్వ‌నాథ్ చ‌నిపోతే..
సంబ‌రాలు చేసుకోవ‌డ‌మేంటి?
అత‌డికి రావ‌ణాసురుడు న‌ర‌కాసురుడితో పోల్చ‌డం
వింత వాద‌న‌లు తెర‌పైకి తేవ‌డం ఎక్క‌డిది?

ఎక్క‌డికెళ్తున్నాం మ‌నం….
ఒక‌ర‌క‌మైన సోషియాట్రిక్ సైకిక్ క‌మ్
పేనిక్ సిట్యువేష‌న్ని క్రియేట్ చేస్తున్నాం ఎందుక‌ని?

బ్యాలెన్స్ చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది
చాద‌స్తాల‌ను పార‌దోలాల‌ని చొచ్చుకొచ్చిన
ఈ స‌రికొత్త చాద‌స్తాల‌ను కూడా చెద‌లు ప‌ట్టేస్తున్నాయ్

వీటిని కూడా విదిల్చి కొట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది
ఈ మెద‌ళ్ల‌కు కూడా నాడు ప‌ట్టిన తుప్పే ప‌ట్టింది
దాన్ని కూడా పార‌దోలాల్సిన వాతావ‌ర‌ణం ఏర్ప‌డిపోయింది
దాన్ని కూడా తుద‌ముట్టించాల్సిన అవ‌స‌ర‌మొచ్చేసింది..
కులం మ‌తం ప్రాంతం వ‌ర్గం ప్ర‌కారం
మంచి చెడుల బేరీజుల కాలం మారాలి

వారైతే ఒక‌లా వీరైతే మ‌రొక‌లా
మైక్ ఆన్ ఆఫ్ ల క‌ల్చ‌ర్ ను కూడా కంట్రోల్ చేయాల్సిన టైం ద‌గ్గ‌ర్లో ప‌డింది
వాళ్ల‌కూ వీళ్ల‌కూ ఒక్కోలాంటి స్పంద‌న‌ల‌ను
మ‌న గుండెల‌కు అల‌వాటు చేయ‌డాన్ని పూర్తిగా స‌రిచేయాల్సి ఉంది..
ఇదే న‌వీన్ హ‌త్య కేసులో
హ‌ర‌హ‌ర‌కృష్ణ తండ్రి ప‌డ్డ ప‌శ్చాత్తాపానికి కూడా విలువ‌నియ్యాల్సిన త‌రుణ‌మిది

మ‌న‌వాళ్ల‌కొక ముసుగు
ప‌రాయివాళ్ల‌కొక ముసుగుల‌ను తొల‌గించాల్సిన అత్య‌యిక ప‌రిస్థితి ఆస‌న్న‌మైంది..
ఇలాంటివెన్నో పైకి చెప్పాల‌ని ఉన్నా
చెప్ప‌లేని వారికి నాదొక గొంతుక‌నిస్తున్నా
నాదొక అక్ష‌ర‌మందిస్తున్నా
నాదొక రాయినందిస్తున్నా
ఈ నిశ్శ‌బ్ధాన్ని చేధిద్దాం రా!

అస‌మాన‌త‌ల్లేని స‌మాజాన్ని నిర్మిద్దాం ప‌ట్టు
ఇక్క‌డ పౌర స‌మాజం, సంస్కృతీ, మ‌తం, ప్ర‌భుత్వాలు, వివ‌క్ష‌తో కూడిన‌వి..
మొత్తం చెడిపోయాయ‌ని ఎలుగెత్తే మ‌నం
అమెరికాలో జ‌రిగితే తెలివిగా మిన‌హాయింపు ఇచ్చేస్తాం
అమెరికా గురించి కాదు
మ‌న‌లోని అమెరికా గురించి ఆలోచించాలి
మ‌న‌లోని అమెరిక‌నైజేష‌న్ గురించి థింక్ చేయాలి

త‌ప్ప‌కుండా చేయాలి
భావ‌జాలాల‌ను కూడా కీలుబొమ్మ‌లుగా మార్చేస్తున్న‌
దుర్మార్గ ప‌రిస్థితుల‌ను కూడా త‌ప్పు ప‌ట్టాల్సిందే!

 

By admin