మిషన్‌ 90- ఆపరేషన్‌ 2023.. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసింది. ఇందుకోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కొంత మంది నేతలు విస్తృతంగా పర్యటనలు చేస్తూ కాషాయ జెండాను గ్రామగ్రామాన తీసుకెళ్తున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పేరిట ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీలోనూ కొందరు సీనియర్ నాయకులు పలు కార్యక్రమాల్లో కనిపించడం లేదు. వారంతా కలిసి వచ్చి ఎన్నికల్లో పనిచేస్తే అధికారంలోకి రావడం పెద్ద విషయం కాదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ బన్సల్ మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. ఆయన ప్రస్తుతం తెలంగాణలో తిష్ట వేయడంతో మరెవరిని కలుస్తారోనని చర్చ పెట్టుకుంటున్నారు.

ఓ వైపు స్ట్రీట్ కార్నర్ పేరుతో బీజేపీ నాయకులు శరవేగంగా ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రజల నుంచి మద్దతు వస్తున్నా.. పార్టీలో అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే పార్టీ ప్రతిష్టత పెరుగుతుందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న అసంతృప్తులను సీనియర్ నేతలను సునీల్ కలుస్తూ వస్తున్నారు. బీజేపీలో వేళ్లూనుకొని ఉన్న నాయకులు ఎందరో ఉన్నారు.

అయితే కొందరు బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన వారు లేకపోలేదు. గతంలో ఉత్తర తెలంగాణకు చెందిన కొందరు నాయకులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అసంతృప్తి బయటపెట్టిన విషయం తెలిసిందే. వీరి విషయంలో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు వారిని అశ్రద్ద చూడడంతో వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్న చర్చ సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఉంటే పార్టీకి తీవ్ర నష్టం కలిగే ఆస్కారం ఉందని ఆ పార్టీ అధిష్టానం గ్రహించింది. అందువల్ల అందరినీ కలుపుకోవడానికి పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ బన్సాల్ సంప్రదింపులు చేస్తున్నారు. అయితే ఆయన కలిసే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. సైలెంట్ గా ఒక్కొక్కరిని ప్రత్యేకంగా కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహిచ్ విద్యాసాగర్ రావును కలిశారు.

ఇలాగే మరికొందరిని కలిసి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే తామంతా కలిసి ఉన్నామని చెప్పడానికి నేతలంగా పలు సభలు సమావేశాల్లో పాల్గొనాలని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా వారితో సంబంధం ఉన్న ఇతర పార్టీల్లోని నేతలను చేర్చుకోవడానికి ప్లాన్ వేస్తున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పలు వ్యూహాలను రచిస్తోంది.


తెలంగాణ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ 

రాబోయే పది నెలలకు.. అంటే ఎన్నికలు అయ్యే వరకు ఏం చేయాలి, ఎలా గెలవాలన్న దానిపై రాష్ట్ర నేతలకు డైరెక్షన్స్ ఇస్తున్నారు అమిత్ షా.. మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, వివేక్‌, జితేందర్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మిషన్ 90, తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రణాళిక పై చర్చ జరగిన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రణాళికలను రచించింది. మిషన్‌ 90 పేరుతో 10 నెలలకు కావాల్సిన రోడ్‌మ్యాప్‌, నియోజకవర్గాల వారీగా సమావేశాల గురించి పలు సూచనలు చేసింది. ఈ యాక్షన్‌ ప్లాన్‌ అమలు తీరుతో పాటు.. అమిత్ పలు కీలక అంశాలను చర్చించి తెలంగాణ నాయకత్వానికి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.

కాగా, అధిష్టానం నుంచి పిలుపు రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ సహా కీలక నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ విస్తరణ, నేతల మధ్య ఏకాభిప్రాయం సహా పలు అంశాల గురించి చర్చించనునున్నారు.

BREAKINGNEWS TV & APP

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

By admin