ఉమ్మడి వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక వ్యాసం

హోరాహోరీగా జరిగిన పార్లమెంటు ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఇదే మాసంలో మే 27న మరో ఎన్నిక ఉమ్మడి వరంగల్ -నల్గొండ -ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరగనున్నాయి . ప్రధాన రాజకీయ పక్షాలు ఈ ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ బలమైన నాయకులను బరిలో నిలిపాయి వీరితోపాటు స్వతంత్ర్య అభ్యర్థులతో కలిపితే చివరగా 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు . చట్టసభలలో కొన్ని వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తమగళాన్ని తామే వినిపించే అవకాశాన్ని భారత రాజ్యాంగం శాసన వ్యవస్థ ద్వారా కల్పించింది. ఇందులో ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రతినిధులు, శాసనసభ్యులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు తమ ప్రతినిధులను పెద్దలసభకు పంపించేందుకు ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. రాష్ట్ర గవర్నర్ ద్వారా కూడా వివిధ రంగాల్లో కృషిచేసిన నిష్ణాతులైన వారిని శాసనమండలికి నామినేట్ చేయడం జరుగుతుంది. వీరంతా తమ వర్గాల సమస్యలను నేరుగా చట్టసభల్లో ప్రస్తావించడంతోపాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు పలు సాహెతుకమైన సూచనలు చేసే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి 2021 సంవత్సరంలో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలవడం వల్ల ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ప్రస్తుతం ఇక్కడ గెలిచేవారికి 2027 వరకు అంటే ఇంకా మూడు సంవత్సరాల పదవి కాలం మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఉమ్మడి వరంగల్- నల్గొండ -ఖమ్మం జిల్లాలలో మొత్తం 12 జిల్లాలు,34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పట్టభద్రుల నియోజకవర్గo విస్తరించి ఉంటుంది. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఆయా నియోజకవర్గం లోని పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తారు. అనగా పోలైన మొత్తం ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత వచ్చిన అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ రాకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత 2015 లో ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కపిలవాయి దిలీప్ కుమార్ విజయం సాధించగా 2021 లో జరిగిన ఎన్నికల్లో అప్పటి టిఆర్ఎస్ పార్టీ తరపున కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,61,811 ఓట్లు సాధించి తన సమీప స్వతంత్ర్య అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై విజయం సాధించగా ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న 1,49,005 ఓట్లు సాధించి స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచారు . తెలంగాణ జేఏసీ చైర్మన్ తెలంగాణ ఉద్యమాన్ని భుజనా వేసుకున్న ప్రొఫెసర్ కోదండరాం తన సొంత పార్టీ తెలంగాన జన సమితి (టీజేఎస్) నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలవడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది.

ప్రస్థుత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న బరిలోఉండగా , బిఆర్ఎస్ పార్టీ తరపున ఏనుగుల రాకేశ్ రెడ్డి , బిజెపి తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి లతోపాటు బక్క జడ్సన్ , ప్రొఫెసర్ అశోక్ లాంటి బలమైన స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు .
ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 2015లో జరిగిన ఎన్నికల్లో 2.81 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోగా, 2021 లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 5,05,565 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. కానీ ఇందులో 3,74,117 మంది పట్టభద్రులు మాత్రమే తమ ఓటును సరైన విధానంలో వినియోగించుకున్నారు మిగతా ఓట్లు చెల్లకుండ పోయాయి . కాగా ప్రస్తుత 2024 లో జరిగే ఈ ఎన్నికల్లో గతం కంటే తక్కువగా అంటే 4,61,806 మంది మాత్రమే తమ ఓట్లను నమోదు చేసుకోగా ఇందులో పురుషులు 2,87,007, స్త్రీలు 1,74,794 ఉన్నారు. కాగా ఈ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో 80,559 మంది, సూర్యాపేటలో 51,293, భువనగిరిలో 33,926, ఖమ్మంలో 83,606, భద్రాద్రికొత్తగూడెంలో 39,898, భూపాలపల్లిలో 12,460, ములుగు 10,237, మహబూబాబాద్ 34,759, వరంగల్ 43,594, హనుమకొండ 43,483, జనగామ 23,320, సిద్దిపేటలో 4,671 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వీరిలో సగానికి పైగా నిరుద్యోగులే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి వూపిరిగా నిలిచిన ఉస్మానియా , కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు మరియు ఉద్యోగ , ఉపాద్యాయులు ఈ ఎన్నికపై ప్రభావం చూపబోతున్నారని స్పస్టమవుతుంది .

నిరుద్యోగ సమస్యే ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండా కాబోతుందా?

నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు లక్ష్యాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు గడుస్తున్నతరుణంలోకూడా ఇంకా నియామకాల అంశం పైనే పోరాటాలు జరుగుతుండడం అనేది గత ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎత్తి చూపుతుంది . ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకున్నగత పాలకులు నిరుద్యోగులను పట్టించుకోవడం మానేశారు. చదువుకుని కార్మిక బలగంలో చేరాల్సిన యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. గత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో నిరుద్యోగ సగటు 2.2 శాతం పెరిగింది. గత ఏడాది జనవరి నాటికి 7.7 శాతంగా ఉన్న నిరుద్యోగం డిసెంబరు నాటికి 9.9 శాతంగా నమోదైంది. జాతీయస్థాయిలో నిరుద్యోగ సగటు 7.2 శాతం కన్నా ఇది 2.7 శాతం అధికం.

బన్సల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షా 92 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 35 వేల ఉద్యోగాలు మాత్రమే నింపి చేతులు దులుపుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో టిఎస్పిఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్1, ఏఈ, ఏఈఈ పరీక్షల పేపర్లు లీకేజి వ్యవహారంలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నఈ అంశంపై విచారణ ఇంకా కొనసాగుతున్నప్పటికి సంభందిత అధికారులపై ఈనాటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్థుత ప్రభుత్వంపై కూడా నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో విశ్వాసం కలగడం లేదు కాబట్టి నిరుద్యోగం, నియామకాల అంశం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువతను ఆకట్టుకునే పనిలో ఎవరు చాంపియన్ అవుతారనేది కీలకం కాబోతోందని అంటున్నారు.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE), బాంబే స్టాక్ ఎక్స్‌చేంజీ తరఫున 2019లో జరిపిన సర్వే ప్రకారం 20 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తెలంగాణలో ఉన్నట్లు అంచనా వేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 25లక్షలకు చేరిందని రాజకీయ పార్టీలు వేసుకుంటున్న అంచనా. వీరితోపాటు ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ దశలో మరో 5లక్షల మంది ఉంటారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలమంది నీరుద్యోగులున్నారు, వీరిలో చాలా మంది కొత్తగా నమోదైన ఓటర్లే ఉంటారు. కనుక వారి ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీలు నిరుద్యోగుల అంశాన్ని ఎత్తుకున్నాయనే అంశంపై చర్చనడుస్తోంది.

ఎన్నికల్లో ప్రభావం చూపనున్న G.O.No. 46, G.O.No. 317 బాధిత ఉద్యోగ, నిరుద్యోగులు ?

గత ప్రభుత్వ హయంలో జరిగిన TSSP కానిస్టేబుల్ ఉద్యోగాల నియమకాలలో గతంలో 1956 నుండి స్టేట్ లెవెల్ పోస్ట్ గా ఉన్నఉద్యోగాలను 2019 లో జి.ఓ.నం 46 ని తీసుకువచ్చి వాటిని జిల్లా స్థాయి పోస్టులుగా మార్చారు. దీంతో రాష్ట్ర స్థాయిలో మెరిట్ పై ఉద్యోగాలు దక్కాల్సిన అభ్యర్థులు ఈ జి.ఓ వల్ల తీవ్రంగా నష్టపోయారు, ఈ జి.ఓ ను రద్దుచేసి మా సమస్యను పరిష్కరించాలని వేలాదిమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గతప్రభుత్వ హయాంలోనే తెచ్చిన 317 జి.ఓ వల్ల ఉద్యోగాలు చేస్తున్న భార్యా భర్తలు వేరువేరు జిల్లాలకు కేటాయించడంవల్ల వారి పిల్లలు కుటుంబాలు చిన్నాభిన్నంగా అయ్యారు. వీరందరి సమస్యలు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చిందని, సుమారు లక్ష ఓట్లపై మా ప్రభావం ఉంటుందని మా సమస్యలను పరిష్కరించేవారికే ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తామని బాదిత ఉద్యోగ , నిరుద్యోగులు అంటున్నారు .

రాజకీయ పార్టీల హామీలను పట్టభద్రులు విశ్వసిస్తారా ?

గత కొంత కాలం క్రితం యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో “యువ సంఘర్షణ సభ” నిర్వహించింది. దీనికి పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ హాజరై పలు హమిలిచ్చారు. అందులో ముఖ్యంగా
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబరు 17లోపు నియామకాలు పూర్తి చేయడం, సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజస్ర్టేషన్ పోర్టల్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75శాతం ఉద్యోగాలు.. ఇలా వివిధ అంశాలతో డిక్లరేషన్ ప్రకటించింది.
బిఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వ హయంలో సుమారు రెండు లక్షల ప్రైవేట్ ప్రభుత్వ,రంగాలలో ఉద్యోగాలు కల్పించామని పట్టభద్రులు మాసిట్టింగ్ స్థానoలో మాకే పట్టం కడతారని ప్రచారం చేస్తున్నారు .
ఇక భారతీయ జనతాపార్టీ మోడి గ్యారంటీ వికసిత్ భారత్ – 2047 పేరుతో ప్రచారం చేస్తున్నారు .

పట్ట భద్రులు ఎవరికి పట్టం కడతారో..? గెలుపుపై ఎవరి ధీమా వారిదే !

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా, ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న ఇప్పటికే ప్రచారాలు మొదలుపెట్టారు. జిల్లాల వారీగా టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ గ్రాడ్యుయేట్ల ఓపీనియన్స్ తెలుసుకుంటున్నారు. వారితో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.గత ఎన్నికల్లో పోటీ చేసిన టిజెఎస్ పార్టీ అద్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి కూడా తనవంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయనకు కొంత పట్టు ఉండగా ఎక్కువ ఓటర్లున్న ఖమ్మం, నల్గొండ జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఇంకా ప్రచారం మొదలు పెట్టలేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనైనా గెలిచి ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుండగా బీజేపీలో కూడా అదే భావన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో కొంత జోష్ కనిపిస్తుండగా పట్టభద్రులు ఎటువైపు మొగ్గుచూపుతారో జూన్ 5 వరకు వేచి చూడాల్సిందే .

వ్యాసకర్త :
బైరి వెంకటేశం
జాతీయ అద్యక్షులు
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి
9491994090

 

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin