✍🏻– డా. పసునూరి రవీందర్
కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కార గ్రహీత

తొమ్మిది దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో బయోపిక్ల సంఖ్య వేళ్ల మీదికే పరిమితం. అవి కూడా సినిమా వాళ్ల బయోపిక్ల నుండి మొదలుపెట్టి ఇటీవల విభిన్న రంగాలకు చెందిన వ్యక్తుల మీద కూడా బయోపిక్లు వచ్చాయి. అసలు బయోపిక్ తీయడానికి ఆ వ్యక్తి చేసిన సేవనో, ఆ వ్యక్తి ఈ సమాజానికి అందించిన స్ఫూర్తినో ఆధారం కావాలి. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల విడుదలైన సినిమా ప్రవీణ్ ఐపీఎస్. ఈ సినిమా డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అసాధారణంగా ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపించారు. ప్రవీణ్ కుమార్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను కేంద్రంగా చేసుకొని కథ అల్లుకొచ్చి, చివరలో ఒక సందేశంతో సినిమాను ముగించారు.

ఈ సినిమా చూసిన వారికి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కొత్తగా కనిపిస్తారు. అందుకు కారణం ఇప్పటిదాకా ఆర్ఎస్పీ అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా గుర్తుకు వచ్చారు. చాలామందికి ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా గుర్తుకొస్తే, లక్షలాది కుటుంబాలకు ఆయన గురుకులాల సెక్రటరీగా గుర్తుకొస్తారు. ఇక ప్రస్తుతం ఆయన బహుజన ఉద్యమానికి నాయకుడిగా కూడా గుర్తుకు వస్తారు. ఇన్ని పార్శాల ప్రయాణం వెనక దాగిన మలుపులు అందరికీ తెలిసే అవకాశం లేదు. ఈ కష్టతరమైన ప్రయాణాన్ని, త్యాగాలతో కూడుకున్న ప్రస్థానాన్ని కళ్లకు కట్టిన సినిమే ‘ప్రవీణ్ ఐపీఎస్’. ఐపీఎస్ అంటే ఈ సినిమాలో కొత్త నిర్వచనాన్ని ట్యాగ్ లైన్గా చేర్చాడు దర్శకుడు. ఐ అంటే ఇక, పీ అంటే ప్రజా, ఎస్ అంటే సేవలో. అట్లా ‘ప్రవీణ్ ఇక ప్రజాసేవ’లో అని క్రియేటీవ్గా పెట్టారు.

వాస్తవ జీవితాన్ని తెర మీదికి ఎక్కించేటపుడు ఏ సినిమా దర్శకుడైనా చాలా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. అట్లా చూసినపుడు ప్రవీణ్ కుమార్ జీవితాన్ని సినిమాటిక్ డ్రమెటైజేషన్ చేయడంలో ఈ సినిమా దర్శకుడు దుర్గాదేవ్ నాయుడు సక్సెస్ అయ్యాడు. సినిమా అంటే కేవలం సందేశాలు, సలహాలు మాత్రమే కాదు. అందులో ట్వంటీఫోర్ క్రాఫ్ట్స్ పండాలి. ముఖ్యంగా రెండున్నర గంటలపాటు ప్రేక్షకుణ్ణి అలరించాలి, ఆలోచింపజేయాలి, ఆకట్టుకోవాలి. ఒక బయోపిక్కు ఇవ్వన్నీ కుదరాలంటే అది కత్తిమీద సామే. అలాంటి సాహసానికి సిద్ధమయ్యాడు దర్శకుడు. అట్లా కథను చాలా నీట్గా నడిపించాడు.

ముఖ్యంగా ఆర్ఎస్పీ జీవితంలోని సంక్లిష్ట సందర్భాల సంఘర్షణను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు. ఒక్కో నిర్ణయం తీసుకునేటపుడు ఆయన పడిన తపను రియాలిటీకి దగ్గరగా చూపించాడు. కీలక ఘట్టాలను తనదైన నైపుణ్యంతో మెప్పించాడు. ఈ సినిమాకు ఉన్న పరిమితులను దృష్టిలో పెట్టుకొని తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేయడం మరో విశేషమనే చెప్పాలి. అలాగే తక్కువ బడ్జెట్లో ఇంత చక్కగా ఆర్ఎస్పీ జీవితాన్ని తెర మీదకి ఎక్కించడంలో కూడా డైరక్టర్ అండ్ టీమ్ సక్సెస్ అయ్యింది. ఇక నటీనటులు ఆయా సందర్భాల్లో ఎమోషన్స్ను పండించడంలో ఎవరికి వారుగా సక్సెస్ అయ్యారు. ఆర్ఎస్పీ పాత్రలో దుర్గానాయుడు, నందకిషోర్లు ఔరా అనిపించారు. అలాగే ఆర్ఎస్పీ సతీమణి లక్ష్మీబాయిగారి పాత్రలో రోజా సహజంగా ఒదిగారు. సంగీతపరంగా ఎన్.ఎస్.ప్రసూ చక్కని బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించాడు. పాటలు కూడా కథకు తగ్గట్టుగా బాగున్నాయి.

ఆకలి, అవమానాల విలువ తెలిసినవాడిలో జీవితాన్ని గెలవాలనే కసి ఎంతగా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. డా.ఆర్ఎస్పీ ఈ స్థాయికి ఎదగడం వెనకాల ఎన్ని అవమానాలు మౌనంగా భరించాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో తెలిసి వస్తుంది. ముఖ్యంగా అవమానించిన సమాజం చేతే సన్మానించే దశకు ఎదగి పదిమందికి స్ఫూర్తిగా నిలిచేందుకు చదువే మార్గమనే చక్కని సందేశాన్ని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. చదువుతో పాటుగా ఈ సమాజాన్ని మార్చాలంటే అధికారం సరైన నాయకుల చేతిలో ఉండాలి. అందుకే అత్యున్నత ఐపీఎస్ కొలువును వదిలి సామాన్య ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన తీరును ఈ సినిమా ఎలుగెత్తి చాటింది.

అంతేకాదు బయోపిక్లంటే బలాదూర్గా తిరిగే రౌడీల మీద కాదు తీయాల్సింది, ఇలాంటి ప్రజల కోసం జీవించే స్ఫూర్తిప్రదాతల మీద తీయాలనే విషయాన్ని కూడా ఈ సినిమా చెప్పకనే చెప్పింది. టాలీవుడ్సినిమా వందలకోట్లే పరమావధిగా విలువల్ని వదిలేసి కమర్షియల్ దాహంలో మునిగిన తరుణంలో, గొప్ప సందేశాన్ని అందించే ఈ సినిమాను ఊరూర సామాన్యులకు చేర్చాలి. తద్వారా మరింతమంది స్ఫూర్తిని పొందుతారు. అగ్రవర్ణ రాజకీయ కుట్రలను అర్థం చేసుకోగలుగుతారు. తమ బిడ్డలను కూడా ఉన్నత చదువులు చదివించడానికి కావాల్సిన స్ఫూర్తిని పొందుతారు.

ఈ సినిమా అందించే సందేశం ఈ దేశపు పీడితులందరికీ చేరాల్సి ఉంది. ఆ దిశగా ప్రయత్నం ప్రతీ ఒక్కరూ చేయాలి. ఎందుకంటే భావితరాన్ని తయారు చేసే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. అందుకు ఆధారంగా నిలిచిన డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్గారు ధన్యులు. ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చిన మామిడాల నీలగారికి ధన్యవాదాలు. ఇది ఆదరించాల్సిన సినిమా. ఇది అందరి సినిమా…

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin