విరాట‌ప‌ర్వం సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న్ ప‌ర్వం మొద‌లైంది. అయితే, విరాటపర్వం సినిమా నుంచి టీజర్‌ వచ్చి ఏడాదవుతుంది. అన్ని సినిమాలు అప్‌డేట్స్‌ ఇచ్చుకుంటూ పోయినా ఈ మూవీ మాత్రం అదేమీ పట్టనట్టుగా ఉండిపోయింది. ఏడాది నుంచి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా అభిమానుల సహనానికి అన్నిరకాలుగా పరీక్ష పెట్టింది. కానీ ఇప్పుడిప్పుడే విరాటపర్వంలోనూ కదలిక మొదలైంది. డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల తెర‌కెక్కించిన ఈ సినిమాను జూన్‌ 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ కూడా వెల్లడించారు. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఓ వీడియో వదిలారు. ఇందులో ప్రమోషన్స్‌ ఏవి?, సాయిపల్లవిని చూడటానికి వెయిటింగ్‌ అని హీరోయిన్‌ అభిమాని రానాను నిలదీశాడు.

దానికి హీరో స్పందిస్తూ.. ‘నేను కూడా సాయిపల్లవి అభిమానినే.. సాయిపల్లవి కోసమే ఈ సినిమా తీశాం.. ఆమె ఫ్యాన్స్‌ కోసం కర్నూలులో జూన్‌ 5న ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై సాయిపల్లవి స్పందిస్తూ.. ‘ఇక్కడ అంత సీన్‌ లేదండి. ప్రజల ప్రేమను పొందుతున్న నేనే చాలా అదృష్టవంతురాలిని. కర్నూలులో వారందరినీ చూసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా’ అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. కాగా రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్‌ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ మూవీలో ప్రియమణి, నవీన్‌ చంద్ర ముఖ్య పాత్రలు పోషించారు.

By admin