చిత్రం: రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి
బ్యానర్ : వెంకట శివ సాయి ఫిల్మ్స్
నటీ నటులు:ఆర్టిస్ట్స్ : హీరో – రవితేజ నున్న
హీరోయిన్ – నేహా జురెల్,
జబర్దస్త్ బాబీ,
జబర్దస్త్ అశోక్,
అడబాల దుర్గాజీ.

సంగీత దర్శకుడు: రోషన్ సాలుర్
సినిమాటోగ్రాఫర్: మురళీకృష్ణ వర్మన్
ఎడిటర్ : కిషోర్ తిరుమల
రచన: సత్య రాజ్ కుంపట్ల
నిర్మాత : ముత్యాల రామదాసు
దర్శకత్వం: సత్య రాజ్ కుంపట్ల

టాలీవుడ్‌లో రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్లకు మంచి ఆదరణ దక్కుతున్నది. ఇప్పటికే అలాంటి చిత్రాలు భారీ విజయాలను అందుకొన్నాయి. అదే కోవలో రొమాన్స్, క్రైమ్ కథతో వచ్చిన‌ పక్కా గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రం రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. తన్విక & మోక్షిక క్రియేషన్స్ బానర్ పై రాజేష్ గురజావోలు నిర్మించిన ఈ చిత్రం.. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో చూద్దాం.

కథ:
ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే కథ ఇది. కర్ణ(రవితేజ నున్న) ఊరిలో ఆవ‌రాగా తిరిగే కుర్రాడు. ఊర్లో పేరు ప్రఖ్యాతలు ఉన్న నాయుడు గారి అబ్బాయి. అదే ఊర్లో రాజు గారి అమ్మాయి అను(నేహా జురెల్). అనుకోని సందర్భంలో అనుని చూసి కర్ణ ఇష్టపడతాడు. ఇద్దరి మధ్య మంచి సంబంధం బలపడుతున్న సందర్భంలో హీరోయిన్ తో హీరో ఫిజికల్ గా దగ్గర అవ్వాలి అనుకుంటాడు. దానికి అను తిరస్కరిస్తుంది. వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాతి రోజు అను శవమై కనిపిస్తుంది. ఈ మర్డర్ కర్ణ మీదకు వస్తుంది. కర్ణ తండ్రి నాగినీడు పరపతితో బయటకు వచ్చి మర్డర్ మిస్టరీని ఇన్వెస్ట్ గేట్ చేస్తాడు. అనును చంపింది ఎవరు? తన మరణానికి కర్ణ స్నేహితులకు ఏంటి సంబంధం? కర్ణ తండ్రి నాగినీడు పాత్ర ఏంటి? ఇంతకీ అను చనిపోయిందా లేదా చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమా చూడాల్సిందే.

నటీనటులు ప్ర‌తిభ‌:
హీరోగా చేసిన‌ రవితేజ నున్న అద్భుతమైన యాక్టింగ్ చేశాడ‌ని చెప్పొచ్చు. పక్కింటి కుర్రాడులా తన నటనతో ప్రేక్షకులని మెప్పించాడు. హీరోయిన్‌ నేహా జురెల్ గ్లామ‌ర్ ఆండ్ యాక్టింగ్‌తో క‌ట్టిప‌డేసింది. తాను నటించిన అన్ని సీన్ల‌లో ప్రేక్షకుడి చూపు తన నుంచి తిప్పుకోకుండా న‌టించింది. ఇక ఇత‌ర పాత్ర‌ల్లో చేసిన‌ నాగినీడు, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ అశోక్, ప్రమోదిని తమ పాత్రల మేర న‌టించి మెప్పించారు.

టెక్నిక‌ల్ పాయింట్స్:
దర్శకుడు సత్యం రాజ్ కుంపట్ల తాను అనుకున్న స‌బ్జెక్టును తెర‌పై చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. ఒక మంచి కథతో, ఊహించ‌ని మలుపులతో చిత్రాన్ని ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా కొన‌సాగించాడు. థ్రిల్లర్ పాయింట్ తో చివరి వరకు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టిన ప్రతిభ డైరెక్టర్ ది. ఈ సినిమాతో అద్భుతమైన విజన్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందారు. కచ్చితంగా సత్యం రాజ్ కుంపట్ల నుంచి అప్‌క‌మింగ్ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రంగా ఎదురుచూసేలా ఆయన టేకింగ్ ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక డిఓపి మురళీకృష్ణ వర్మన్ తన ప్రతిభతో ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. సంగీత దర్శకుడు రోషన్ సాలూరు ప్రాణం పెట్టే పని చేశారు సినిమాకు సంగీతం వెన్నుముకగా నిలిచింది అంటే దానికి కారణం రోషన్ సాలూరి ప్రతిభ. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్రతి సన్నివేశాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు.

విశ్లేషణ:
రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. సినిమా ఫస్టాఫ్ కర్ణ అను మధ్య స్నేహం ప్రేమ అనే రిలేషన్స్ తో ఆధ్యాంతం ఆహ్లాదకరంగా సాగుతోంది. ఎప్పుడైతే అను విగతజీవిగా లభ్యమవుతుందో సినిమాలో అసలైన ప్లాట్ మొదలవుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాగా కథ సాగుతోంది. ప్రేక్షకుడిని కట్టుపడేసేలా ప్రతి సీన్ అద్భుతంగా రాసుకున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఊహించని రహస్యాలు, మలుపులు ప్రేక్షకుడిని కట్టి పడేసేలా ఉన్నాయి. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం లాంటిది. ఈ సినిమాలో బీజిఎం అద్భుతంగా వ‌చ్చింది. సినిమా చివరి మినిట్ వరకు ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఉంది. ఫ‌స్ట్ హాఫ్‌లోని కొన్ని లవ్ సీన్స్ రొటీన్ గా అనిపించినా.. సెకండాఫ్‌ మొత్తం అత్యంత ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దారు. యాక్ష‌న్ థ్రిల్లర్ డ్రామాలు కోరుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

రేటింగ్: 3.5/5

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin