చిత్రం: వ్యూహం
విడుదల తేది: మార్చి 2, 2024
నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు
నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్‌
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
రచన-దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
సంగీతం: ఆనంద్
సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్

పొలిటిక‌ల్ సినిమా అంటేనే హాట్ టాపిక్. సంచ‌ల‌న రాజ‌కీయ అంశాలు న‌మోదు చేసుకోవ‌డంతో ప్ర‌జ‌లు ఇలాంటి సినిమాల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తి చూపిస్తుంటారు. అలాంటి కోవ‌లో తాజాగా వ‌చ్చిన చిత్రం ‘వ్యూహం’. గ‌తంలోయాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రెండు నెలల క్రితమే విడుద‌ల కావాల్సిన ఈ సినిమాను నారా లోకేష్ చ‌ట్ట‌ప‌రంగా అడ్డుకోవ‌డంతో, ఆ చిక్కులన్ని దాటుకోని తాజాగా(మార్చి 2) విడుదలైంది. మ‌రి వర్మ వ్యూహం ఎలా ఉందో ఇవాల్టి రివ్యూ రిపోర్టులో చూద్దాం.

కథ‌:
వైఎస్ఆర్ మరణించిన స‌న్నివేశంతో వ్యూహం సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టుకుని తెరకెక్కించాడు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని వీర శేఖర్‌ రెడ్డి అని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మదన్‌ రెడ్డి అని ప్రేక్షకులకు వర్మ పరిచయం చేశాడు. వీఎస్సార్‌ మరణానికి ముందు జగన్‌ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు.. తండ్రి అడుగుజాడల్లో నడవాలని రాజకీయాల్లో ఆయన తొలి అడుగు పడి కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్‌ ప్రమాదంలో వీఎస్పార్‌ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఏపీ సీఎం ఎవరంటూ ప్రశ్నలు రావడం జరుగుతుండగా.. మదన్‌(అజ్మల్‌ అమీర్‌) ముఖ్యమంత్రిగా కావాలని 150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతుతో ఒక లేఖ భారత్‌ పార్టీ (కాంగ్రెస్‌) అధినేత్రి అయిన మేడం (సోనియా) వద్దకు చేరుతుంది. అదే సమయంలో మదన్‌ ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిల్లో కాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్‌ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? మేడంను దిక్కరించిన జగన్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? 2009లో జగన్‌ సీఎం కాకుండా చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్‌ కళ్యాణ్‌..2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పోటీ పెట్టుకోలేదు? శ్రవణ్‌ కల్యాణ్‌ పన్నిన వ్యూహం ఏంటి? అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రతి పక్షాల కుట్రలను మదన్‌ ఎలా ప్రజానాయ‌కుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ.

న‌టీన‌టుల ప‌నితీరు:
వ్యూహం సినిమాలో కథ మొత్తం వైఎస్‌ జగన్‌, చంద్రబాబు పాత్రల చూట్టే ఎక్కువగా జరుగుతుంది. తర్వాత పవన్‌ కల్యాణ్‌ పాత్రకు కాస్త ఎక్కువగానే ప్రయారిటీ ఉంటుంది. వైఎస్‌ జగన్‌ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు అని చెప్పవచ్చు.. జగన్‌ గారిలో ఉన్న మ్యానరిజాన్ని పర్‌ఫెక్ట్‌గా అజ్మల్‌ చూపించాడు.. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ఓదార్పు యాత్ర సమయంలో ఆయన కనిపించిన తీరుతో పాటు ప్రత్యేక హోదా కోసం ఆయన చేపట్టిన దీక్షకు సంబంధించిన సీన్స్‌లలో జగన్‌ గారికి దగ్గరగా కనిపిస్తాడు.

వ్యూహం సినిమాలో వైఎస్‌ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్‌ అయ్యారు. సినిమాలో ఆమె కనిపించిన ప్రతిసారి అచ్చం భారతిలాగే ఉన్నారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే అందరికీ సుపరిచయమే.. ఆయన నటనతో దుమ్మురేపాడు అని చెప్పవచ్చు.. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యారు. వ్యూహం సినిమాలో నటించిన అందరిలో దాగి ఉన్న టాలెంట్‌ను వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమా బాగుంది.

విశ్లేష‌ణ‌:
వైఎస్సార్‌ మరణం తర్వాత ఆంధ్రప్ర‌దేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదుర్కొని జగన్ ఎలా నిలబడ్డారు. అనే అంశాల‌ను వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం జగన్‌ పోరాటం.. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్‌ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. దాంతో కేంద్రం నుంచి జగన్‌ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు.. అప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్‌ను ప్రత్యర్థులంతా ఏకమై ఎదురుదాడి చేస్తున్నప్పటికి ఎలాంటి బెరుకు లేకుండా ప్రజలను మాత్రమే నమ్ముకుని అసలు సిసలైన ప్రజా నాయకుడిగా ఎలా నిల‌బ‌డ్డారు అనే విషయాన్ని వ్యూహంలో వర్మ చక్కగా చూపించాడు.

ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే రాజ‌కీయ నాయ‌కులు తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో తను అనుకున్న రీతిలో చాలా స‌హ‌జంగా చూపించారు వర్మ.. అందుకే వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి.. అప్పుడు ఆయన ఎలా రియాక్ట్‌ అయి ఉంటాడు అనేది చూపించారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది.. ఆ సమయంలో వారి బాధ ఎలా ఉంటుంది అనేది వర్మ బయటకు తీశాడు.. కష్ట సమయంలో వైఎస్‌ జగన్‌ కి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుంది.

కేంద్రాన్ని దిక్కారించడం వల్ల జగన్‌ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్‌ భారతి(సినిమాలో మాలతి) గారు ఎలా ధైర్యంగా ముందు అడుగు వెశారో వర్మ తనదైన స్టైల్లో చూపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్‌గానే జగన్‌ బరిలోకి దిగితే… ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధమౌతాడు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన (జనసేన) అధినేత అయిన శ్రవణ్‌ కల్యాణ్‌ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వెశాడో చూస్తే అందరినీ నవ్వు తెప్పిస్తాయి.

మళ్లీ 2019 నాటికి పవన్‌తో మళ్లీ బాబు టచ్‌లోకి వెళ్లడం వంటి సీన్స్‌ వస్తున్న సమయంలో ఏం వ్యూహం బాబుగారు అంటూ పొగడ్తలతో ప్రేక్షకులు కూడా ముంచెత్తుతారు. సినిమా జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు ముకేష్‌ (లోకేష్‌) పాత్ర కనిపించి కనిపించక ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లు ఉంది అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ముకేష్‌ నుంచి వచ్చే డైలాగ్స్‌ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర గురించి చెప్పడం కంటే సినిమాకు వెళ్లి చూస్తేనే బాగుంటుందని అభిప్రాయం.

వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన పాట అందరినీ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ సంగీత నేపథ్యం ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. వైఎస్‌ జగన్‌ జీవితంలోని కీలకమైన సంఘటనలను మాత్రమే తీసుకుని ఎడిటింగ్‌ చేసిన తీరు పర్వాలేద‌ని చెప్పొచ్చు. రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉన్న ప్ర‌తి ఒక్క‌రు వ్యూహం సినిమాను చూడొచ్చు. వైఎస్‌ జగన్‌ అభిమానుల‌కు మాత్రం ఈ సినిమా పండ‌గే!

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin