ఇటీవ‌ల రిలీజైన‌ సినిమాలేవీ పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో జనం కన్ను థియేటర్ వైపు పడటం లేదు. బడా హీరోల సినిమాలు సైతం థియేటర్స్ లో చతికిలపడుతున్నాయి. ఈ పరిస్థితుల నడుమ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన వివరణ సంచలనంగా మారింది. టెక్నాలజీ ఊపందుకోవడంతో సౌకర్యవంతంగా, పైసా ఖర్చు లేకుండా ఎంట‌ర్‌టైన్మెంట్ అందుకునే దిశగా అడుగులేస్తున్నారు ఆడియన్స్. ఈ క్రమంలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ట్రెండ్ ఎక్కువైంది. ఇంట్లోనే కూర్చొని హోమ్ థియేటర్ లో సినిమా చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. దీంతో థియేటర్స్ వెలవెలబోతున్నాయి. జనం థియేటర్స్‌కు రాకపోవడానికి ఓటీటీ ముఖ్య కారణం అనే కోణంలో నిర్మాతలు కొన్ని కండీషన్స్ పెట్టుకున్నారు. ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు గిల్డ్ ప్రొడ్యూసర్స్ మెంబర్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్స్‌కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. సమ్మె బాట పట్టారు.

ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. జనం థియేటర్లకు రాకపోవడానికి ఓటీటీలు ప్రధాన కారణం కాదని, అసలు శత్రువు రాజమౌళి అని ఆయన చెప్పడం హాట్ ఇష్యూగా మారింది. జానానికి చిత్ర పరిశ్రమలలో నిర్మాతలు ఎందుకు ఇలా సమ్మె బాట పడుతున్నారో అర్థం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆర్జీవీ. ఎవ్వరైనా కూడా బిజినెస్ చేసుకోవాలనే ఆలోచనతోనే సినిమాలను తెరపైకి తీసుకు వస్తారు.. అంతేకానీ అందరినీ ఇండస్ట్రీతో ఏకం చేయడం వాళ్ళ టార్గెట్ అనేది బూటకం అవుతుందని వర్మ అన్నారు. ముఖ్యంగా రాజమౌళి లాంటి భూతం ప్రేక్షకుల ఆలోచనలను మార్చేసిందని వర్మ చెప్పడం హాట్ టాపిక్ అయింది. పెద్ద సినిమా అంటే RRR, KGF కంటే ఎక్కువ రేంజ్ లోనే ఉంటేనే చూడాలని ప్రేక్షకులు భావించే రోజులు వచ్చాయని ఆర్జీవీ అన్నారు. దీనంతటీకి కారణం రాజమౌళి మాత్రమే అన్నట్లుగా ఆయన కామెంట్ చేశారు.

రాజమౌళి రెండు మూడేళ్లకు ఒక సినిమా తీస్తూ ఉంటారు. కానీ నిత్యం సినిమా ఇండస్ట్రీపై ఆ ప్రభావం పడుతూ వస్తోంది. ఇలా టాలీవుడ్ భూతం రాజమౌళి అయ్యారని వర్మ కామెంట్ చేయ‌డం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా రానురాను జనాల్లో చాలా మార్పు వస్తోందని వర్మ అన్నారు. ఓ సినిమాను చాలాసేపు చూడడానికి జనం ఇష్టపడే పరిస్థితుల్లో లేరని వర్మ అన్నారు. అందుకే యూట్యూబ్ ద్వారా జనం ఎక్కువ సేపు వినోదం పొందుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కూడా ప్రభావం చూపుతోందని అన్నారు. జనానికి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అక్కడ కూడా దొరుకుతోందని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. వీటన్నింటి ప్రభావం థియేటర్ల మీద పడుతోందన్నాడు. ఏదేమైనా తెలుగు చిత్రసీమలో ఎన్నడూ లేనివిధంగా నెలకొన్న ఈ సంక్షోభం జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది.

By admin