హైద‌రాబాద్‌: రాజ్యాంగ దినోత్సవం సంద‌ర్భంగా బంజారాహిల్స్,తాజ్ కృష్ణ హోటల్ హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ సివిల్ సొసైటీ ఆర్గనైజషన్స్ (ప్రజాసంఘాల) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ అమలు, ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 18% కి పెంచడం, అంబేద్కర్ అభయహస్తం, ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకం వంటి హామీలు పొందుపర్చినందుకు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అధికారంలోకి వ‌చ్చిన‌ వెంటనే ఎస్సీ వర్గీకరణలో ఎస్సీ ఉపకులాలను A కేటగిరిలో చేర్చాలని, 2వేల కోట్లతో తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఉపకులాలందరికి కులధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని, ఎస్సీ కులగనన చేపట్టాలని, రాజ్యాంగ బద్ద పదవులతో పాటు అన్ని పథకాలలో ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత నివ్వాలని డిమాండ్ చేస్తూ మల్లికార్జున ఖర్గేకి బైరి వెంకటేశం వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు రాయిల లక్ష్మినర్సయ్య చిందు, చంద్రగిరి సత్యనారాయణ సమగర, ఎత్తపు కేశవులు బ్యాగర, సిరిపాటి వేణు బేడ బుడ్గ జంగం, గడ్డం యాదగిరి చిందు, ఔషదం రవీందర్ గోసంగి, బలరాం సమగర తదితరులు పాల్గొన్నారు.

 

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin