▪️ ఎస్సీ కులాల జనగనన నిస్పక్షపాతంగా చేపట్టి అన్ని రంగాలలో ఎస్సీ ఉప కులాల వాటా ఎంతో స్పష్టం చెయ్యాలి
▪️ ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కులాల జనగనన నిస్పక్షపాతంగా చేపట్టి ఉపకులాల వాటా ఎంతో తేల్చాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. కులగనన ద్వారా ఎస్సీ వర్గీకరణకు కూడా పరిష్కారం లభిస్తుందని అన్నారు. కులధ్రువీకరణ పత్రాలను మాల మాదిగ కులాలకు తహసీల్దార్ ద్వారా మిగతా ఉపకులాలకు ఆర్డీవో ద్వారా కాకుండా షెడ్యూల్డ్ కులాలందరికి తహసీల్దార్ ద్వారానే ఇవ్వాలని అన్నారు. గతంలో అధికారులు వేలాది మంది ఉపకులాల వారికి మాల, మాదిగ పేరుతో తప్పుడు కులపత్రాలు ఇచ్చారని వారందరికీ జీవో నం.58/1997 ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ని ఏర్పాటు చేసి వారి సొంత కుల పత్రాలు ఇవ్వాలని ఆ తర్వాతనే ఎస్సీ కులగనన చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు.
ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీం కోర్టు లో న్యాయ పోరాటం చేస్తున్న పంజాబ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొందరు ముప్పై ఏళ్లుగా ఉపకులాల కోసం పోరాటం చేస్తున్నామని ప్రగల్బాలు పలికే నాయకులకు ఇన్నేళ్లుగా ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాలు కళ్ళకు కనిపించలేదా అని ప్రశ్నించారు. గతంలో అమలుజరిగిన ఎస్సీ వర్గీకరణ వల్ల ఉపకులాలకు ఎంత మేలుజరిగిందో, ఎంతమంది ఎమ్మెల్యే ఎంపీలు అయ్యారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వాలు నియమించిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, జస్టిస్ ఉషా మెహ్ర కమిషన్ లు మాల,మాదిగ కులాలు తమ జనాభా నిష్పత్తి కంటే అధికశాతం లబ్ధి పొందారని మిగతా 57 ఉపకులాలు అన్యాయానికి గురయ్యాయని వీరి అభివృద్ధి కోసమే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నివేదించిన విషయం వాస్తవం కాదా అన్నారు. ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నవ్యక్తి నిధులన్నీ మాదిగలకు దోచిపెట్టాడు, ఇప్పుడు మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కావాలంటున్నారు వీళ్ళు దళితులందరికి న్యాయం జరగడం కోసం పదవుల్లో ఉంటున్నారా లేక ఒక కులం కోసమే రాజ్యాంగ బద్ద పదవులు అనుభవిస్తున్నారా అని ప్రశ్నించారు. తాము అంబేద్కర్ ఆశయాలకోసమే పోరాడుతున్నామని చెబుతూ ఉపకులాల హక్కులను అనగదొక్కుతున్నారని ఉపకులాలకు ద్రోహం చేయాలని చూస్తే అంబేద్కర్ ఆశయ స్పూర్తితో ఎదురిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించే అవకాశం ఉంది కావున మాల మాదిగలతో ఎలాంటి పొత్తు లేకుండా మా వాటా మాకు కావాల్సిందే అని 57 ఉపకులాల వారందరిని A వర్గంలో చేర్చి జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని కేటాయించాలని డిమాండ్ చేసారు. గతంలో మా ఉపకులాలకు రాజకీయ చైతన్యం లేక మాల మాదిగ ఉద్యమాల్లో పాల్గొన్నామని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని మా వాటకోసం మేమే పోరాడతామన్నారు. మాదిగలు గర్జనల పేరుతో ఉపకులాలపై దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ ను మూడుగా విభజించి ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 750కోట్లు కేటాయిస్తామని మేనిఫెస్టో లో హామీ ఇవ్వడం శుభపరిణామమని కానీ మొన్నటి బడ్జెట్ లో దాని ఊసేలేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి గారు ఉన్నంతవర్గాలతో పాటు ఎస్సీ ఉపకులాలకు తమ సమస్యలు చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని, వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తీగల అశోక్ కుమార్, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు టి ఎన్ స్వామి,చంద్రగిరి సత్యనారాయణ, కర్నె రామారావు, మటపతి నాగయ్య, రాములు, రాజారామ్, రవీందర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r