(స్వాతి – అమెరికా నుంచి):
భారత ప్రభుత్వం బాస్మతీయేత బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో అమెరికాలో ఎన్నారైలకు కష్టాలు మొదలయ్యాయి. బియ్యం కొరత ఏర్పడుతుందని భావించి ముందుగానే కొందామని వెళ్తున్న ప్రవాస భారతీయులకు సూపర్ మార్కెట్లు షాక్ ఇస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన సూపర్ మార్కెట్లు ఎన్నారైల నుంచి వస్తున్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకుంటూ బియ్యం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. ఇప్పటివరకు 10 కిలోల బియ్యం ధర 18 డాలర్లు ఉండగా.. ప్రస్తుతం వాటిని 50 డాలర్ల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే రైస్ బ్యాగ్‌పై భారీగా ధరలు పెంచారు. అంతేకాకుండా ఒక్కరికి ఒక్కటి రెండు బ్యాగులు మాత్రమే విక్రయిస్తున్నారు. ఎన్నారైలు అత్యధికంగా బియ్యం కొంటారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండటంతో మున్ముందు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థంకాకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు చాలా ఆలస్యంగా ప్రవేశించాయి. ఈ కారణంగా వరి పంట ఆలస్యమైంది. దీనికి తోడు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన అకాల వర్షాలతో చాలా రాష్ట్రాల్లో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. దేశంలో బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఇటీవల నిషేధం విధించింది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గురువారం రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే అమెరికాలో ఈ పరిస్థితి ఏర్పడింది.
అమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా. ఇందులో 90 శాతం మంది బియ్యాన్ని వినియోగిస్తున్నారు. ఏటా దాదాపు 7 బిలియన్ డాలర్ల విలువ గల 1.25 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత్ ఎగుమతి చేస్తుంది. అంతర్జాతీయంగా బియ్యం ఎగుమతుల్లో 40 శాతం వాటా భారత్‌దే ఉంటుంది. ముఖ్యంగా థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికా, కెనడా దేశాలకు భారత్ బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. బియ్యం ఎగుమతుల్లో భారత్ కంటే ముందుస్థానంలో చైనా ఉంది.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews