రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఘనంగా సత్కరించిన రామ‌చంద్రు తెజావ‌త్ 

ఢిల్లీ: నూత‌న రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముని ఘనంగా సత్కరించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ ఢిల్లీ తెలంగాణ ప్ర‌భుత్వ ప్రతినిధి రామ‌చంద్రు తెజావత్ నాయ‌క్. భార‌త 15వ రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన అనంత‌రం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ద్రౌపది ముర్మును కలిసి శాలువాతో సత్కరిస్తూ, పూలమాల అందించారు. గతంలో ఒడిస్సా ప్ర‌భుత్వ‌ సీఎస్‌గా పనిచేసిన సందర్భంలో అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ద్రౌపదితో అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నాయి.

దేశానికి ఒక గిరిజన మహిళను ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నుకున్నందున బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతదేశంలో తొలి ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ గా త‌న‌కున్న రాజకీయ సత్సంబంధాల‌తో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యాన‌ని, కానీ ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అధినేత మద్దతు తెలుపనందుకే మానసిక ఆవేదనకు గురై ఒక గిరిజన బిడ్డగా త‌న‌ పదవికి రాజీనామా చేశాన‌ని తెలిపారు.

ఢిల్లీ తెలంగాణ ప్ర‌భుత్వ ప్రతినిధిగా కొన‌సాగుతున్న రామ‌చంద్రు తెజావత్ టీఆర్ఎస్ పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రామ‌చంద్రు త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ స‌ర్కార్ ఆయ‌న‌కు ఓ కీల‌క ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌బోతున్న‌ట్టు కూడా ఢిల్లీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి రామ‌చంద్రు తెజావ‌త్ రాజీనామా

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఢిల్లీ తెలంగాణ ప్ర‌భుత్వ ప్రతినిధిగా కొన‌సాగుతున్న రామ‌చంద్రు తెజావత్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను ఆయ‌న టీఆర్ఎస్ అధిష్ఠానానికి పంపడంతో పాటుగా మీడియాకూ విడుద‌ల చేశారు. టీఆర్ఎస్‌కు తాను ఎందుకు రాజీనామా చేస్తున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌లో ప్ర‌స్తావించారు.

రామ‌చంద్రు తెజావత్ టీఆర్ఎస్‌కి రాజీనామా చేయ‌డంతో హాట్ టాపిక్ మొద‌లైంది. రామ‌చంద్రు త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ స‌ర్కార్ ఆయ‌న‌కు ఓ కీల‌క ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌బోతున్న‌ట్టు కూడా ఢిల్లీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ప్ర‌శంసించిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మాత్రం రామ‌చంద్రుడు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వైనాన్ని ప్రశంసించారు. ఇప్ప‌టికైనా టీఆర్ఎస్‌, కేసీఆర్ నిజ‌స్వ‌రూపాన్ని తెలుసుకుని సంకెళ్లు తెంచుకుని రామ‌చంద్రుడు బ‌య‌ట‌ప‌డ్డార‌ని ఆయ‌న తెలిపారు. ఆత్మ గౌర‌వానికి మించిన ఆభ‌ర‌ణం లేద‌ని సూచించిన ప్ర‌వీణ్‌ టీఆర్ఎస్ వ‌ద్ద ద‌గాప‌డ్డ నాయ‌కులంతా ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని, దొర‌ల పోక‌డ‌ల‌పై పోరాడాల‌ని పిలుపునిచ్చారు.

 

By admin