హైద‌రాబాద్ః అంతర్జాతీయ మాతృ దినోత్సవం సంద‌ర్భంగా అక్షరయాన్ ఆధ్వర్యంలో ‘బహు భాషా విద్య – విద్యను మార్చవలసిన విధానం’ అనే అంశంపై హైద‌రాబాద్ హోటల్ హరిత ప్లాజాలో కార్య‌క్ర‌మం జరిగింది. ముఖ్య అతిథి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, విశిష్ట అతిధి మహారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, గౌరవ అతిథిగా అడిషనల్ చీఫ్ సెక్రటరి చెల్లప్ప, ఆత్మీయ అతిథులు పద్మశ్రీ పురస్కార గ్రహితలు ఆచార్య కూటికుప్పల సూర్యారావు, డా. పద్మజా రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంపకవి పురస్కారాన్ని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అందించారు. స్వర్ణ కంకణంతో ఘనంగా సత్కరించారు. తన పాటలతోనూ, చక్కని ప్రసంగంతో అందరినీ అలరించారు. అక్షరయాన్ తరపున పంపకవి పురస్కారాన్ని అందుకోవటం సంతోషంగా ఉందన్నారు. తర్వాత జరిగిన పుస్తక ఆవిష్కరణలు కనుల పండుగగా జరిగాయి.

మాతృభాషను గౌరవించడం అంటే మాతృభూమిని సత్కరించటమే అంటూ వక్తలంతా ప్రసంగించారు. పంపకవి పురస్కారంతోపాటు పలు పుస్తకాల ఆవిష్కరణలు కూడా జరిగాయి. ప్రార్థన గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలనానంతరం అక్షరయాన్ వ్యవస్థాపకురాలు అయినంపూడి అక్షరయాన్ చేస్తున్న పలు సాహిత్య కార్యక్రమాల గురించి వివరించారు. అందరి శుభాశీస్సులతో అక్షరయాన్ మరిన్ని విజయాలను సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin