హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేతలు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. క‌న‌క‌మామిడి స్వామిగౌడ్ కమలానికి కటీఫ్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు స్వామి గౌడ్ తన రాజీనామా లేఖను కూడా పంపించారు. తెలంగాణ పట్ల బీజేపీ తీరు బాధ కలిగించిందని స్వామిగౌడ్ తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ గౌరవించలేదని.. బీసీల పట్ల బీజేపీ తీరు ఆక్షేపణీయమన్నారు.

అయితే.. స్వామి గౌడ్ తిరిగి గులాబీ గూటికే చేరనున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన స్వామిగౌడ్.. పలు అంశాలపై చర్చించారు. ఇక ఉదయం బీజేపేకీ రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌తో పాటు స్వామి గౌడ్ కూడా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే.. టీఆర్‌పార్టీ కీలక నేతగా ఉన్న స్వామిగౌడ్.. తెలంగాణ ఏర్పడ్డాక తొలి శాసన మండలి ఛైర్మన్‌గా వ్యవహరించారు. అయితే.. కౌన్సిల్ ఛైర్మెన్‌గా తన పదవి కాలం ముగిసిన తర్వాత టీఆర్ఎస్‌.. పెద్దలపై అసంతృప్తి ఆయ‌న వ్యక్తం చేశారు. అధిష్ఠానం తనను పట్టించుకోవట్లేదని సన్నిహితులతో వాపోయినట్టు వార్తలు కూడా వినిపించాయి.

Swamy goud resign letter
స్వామి గౌడ్ రాజీనామా లేఖ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *