• రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
  • మండేపల్లిలో యాంటీ డ్రగ్స్ క్రికెట్ టోర్నమెంట్
  • విజేతలకు బహుమతులు అందజేత.
  • డ్రగ్స్ మహమ్మారి పెనుభూతమై తెలంగాణ పట్టణాల్ని, పల్లెల్ని కబలిస్తున్నది. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం.. అంటూ పిలుపు.

సిరిసిల్ల: తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం డ్రగ్స్ మహమ్మారిపై పోరుకు సిద్ధమైంది. అందులో భాగంగా టీఎస్ నాబ్ తో కలిసి TDF డ్రగ్స్ పై పోరాటం చేస్తుంది.

తెలంగాణ యువతి యువకుల్ని డ్రగ్స్ కు దూరంగా.. సెల్ఫోన్ వ్యసనం వీడేలా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు TDF నడిపిస్తోంది. TDF ఇండియా, టీడిఎఫ్ కెనడా సంయుక్తంగా డ్రగ్స్ అవేర్నెస్ కోసం యువతకు క్రికెట్ పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చే TDF యజ్ఞంలో భాగంగా యువ‌త‌లో డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) ఆధ్వర్యంలో గ్రామీణ యువతలో అవగాహన కోసం యాంటీ-డ్రగ్స్ “యాంటీ-డ్రగ్స్ అవగాహన క్రికెట్ టోర్నమెంట్”ను Tdf india ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించింది.

క్రీడల ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా, గ్రామీణ యువతలో మాదకద్రవ్యాల ప్రమాదాల గురించి అవగాహన పెంచడం, క్రీడలు, కళలు, సంస్కృతి వంటి సానుకూల కార్యకలాపాలలో పాల్గొనేలా వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ క్రికెట్ లీగ్ ను సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో టీడీఎఫ్ కెనడా సభ్యుడు విక్రమ్, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.

కాగా శనివారం టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్ను ట్రైనీ Ips రాహుల్ రెడ్డి ప్రారంభించగా ఫైనల్ మ్యాచ్ లో సిరిసిల్ల అర్మెడ్ రిజర్వ్ పోలీస్ టీమ్, అంకుశాపుర్ క్రికెట్ టీమ్ లు పోటీ పడగా ఆర్ముడ్ రిజర్వ్ టీమ్ విన్నర్ గా, అంకుశపూర్ రన్నర్ గా నిలిచారు.

గెలిచిన వారికి సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ నగదు బహుమతి తోపాటు క్రికెట్ కప్ బహూకరించారు.

ఈ సందర్భంగా SP అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మూలంగా సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను వివరిస్తూ వాటిపై అవగాహన కల్పించారు. “యాంటి డ్రగ్ సోల్జర్” App ను పోలీస్ శాఖ విడుదల చేసిన QR కోడ్ ద్వారా download చేసుకోవాలని సూచించారు. యువత తాము డ్రగ్స్ తీసుకోవద్దని ఎవరైనా తీసుకున్నట్లు తెలిస్తే యాప్ ద్వారా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆటగాళ్లకు ఎస్పీ సర్టిఫికేట్‌లను అందజేశారు. యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ సంబందించిన సమాచారాన్ని 8712671111 ఫోన్ ద్వారా తెలియజేయాలని కోరారు.

అనంతరం TDF ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రికెట్ టోర్నమెంట్ TDF “ఆరోగ్యసేవ” ఆరోగ్య సేవా ప్రాజెక్ట్‌లో భాగం, ఇది మాదకద్రవ్యాల రహిత తెలంగాణను రూపొందించడానికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర యువతకు మరిన్ని క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

TDF కెనడాకు ప్రాతినిధ్యం వహిస్తున్న విక్రమ్, క్రికెట్ క్రీడాకారులతో సంభాషించారు. తెలంగాణ అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో, రాష్ట్రంలో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో TDF కెనడా పాత్రను హైలైట్ చేశారు. TDF కెనడాకు చెందిన పవన్ కొండం కూడా ఈవెంట్‌ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారాని ఆయన ప్రయత్నాలను విక్రమ్ అభినందించారు.

TDF ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి మాట్లడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు సంస్థ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు వంటి ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మక కార్యకలాపాలలో యువత నిమగ్నం చేయడం ద్వారా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. TS-NAB డైరెక్టర్ సందీప్ శాండిల్య, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవను ప్ర‌శంసించారు. భవిష్యత్తులో అవసరమైన సహాయాన్ని అందిస్తానని మాట ఇచ్చారు.

15 రోజుల పాటు జరిగిన క్రికెట్ టోర్నీలో వివిధ గ్రామాల నుంచి 40 జట్లు పాల్గోన్నాయని టోర్నమెంట్ మేనేజర్లు చందు, చింటు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ రాహుల్ రెడ్డి, డీఎస్పీ, రూరల్ సిఐ సదన్ కుమార్, ఎస్సై సుధాకర్, tdf usa పాస్ట్ ప్రెసిడెంట్ మురళి చింతల్పని, tdf usa board members శ్రీనివాస్ గిలిపిల్లి, tdf ఇండియా జనరల్ సెక్రెటరీ వినీల్, ప్రతినిధులు చందు, చింటు, జిల్లాలోని వివిధ గ్రామాల క్రీడాకారులు, యువత పాల్గొన్నారు.

———

 

By admin