శంకర్‌పల్లి: తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (TDF) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు శంకర్‌పల్లి మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామ శివారులో వనిత చేయూత మహిళ విభాగం సౌజన్యంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా T-PCC స్పోక్స్ పర్సన్ భవాని రెడ్డి హాజరై బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. మోకిలలోని మహిళలు అధిక సంఖ్యలో హాజరై బతుకమ్మ, దాండియా కార్యక్రమంలో నృత్యాలు చేశారు. బెస్ట్ ట్రెడిషనల్ బతుకమ్మ చేసిన మహిళకు మొదటి బహుమతి, మోస్ట్ క్రియేటివ్ బతుకమ్మ చేసిన మహిళకు రెండవ బహుమతి, బతుకమ్మ బుట్ట బొమ్మగా రెడీ అయిన మహిళకు మూడవ బహుమతిగా టిడిఎఫ్ ప్రకటించి వారికి మొక్కలను ప్రధానం చేశారు.

అనంతరం టిడిఎఫ్ – ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలలో బతుకమ్మ పండుగను నిర్వహించడం తెలంగాణకు గర్వ కారణమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ విశ్వవ్యాపితం అయిందన్నారు. 9 రోజుల పాటు బతుకమ్మకు నిత్యం ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. సుభిషి చైర్మన్ సతీమణి వాణి తిమ్మయ్య గారి మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు.

తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందని ఆమె తెలియజేశారు. నిజామాబాద్ జానపద బృందం వారిచే ఆలపించిన పాటలు అందరినీ ఉత్సాహపరిచాయి. బతుకమ్మ కార్యక్రమానికి శారద శారీస్, సుభిషి, విజేత సూపర్ మార్కెట్, నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్మెంట్, ప్రాజన క్రియేషన్స్, రుచికరం, క్రిస్టల్ స్టింగ్స్ వాటర్ వంటి వారు స్పాన్సర్ చేశారు. బతుకమ్మ సంబరాలకు స్పాన్సర్ చేసిన వారిని వాణి వేణుగోపాల్ రెడ్డి అభినందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా వాణి తిమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *