(రంగారెడ్డి జిల్లా మంచాల్ మండ‌లంలోని లింగంపల్లి గ్రామం నుంచి న్యూస్ క‌వ‌రేజీ)

పుట్టిన గ‌డ్డపై సేవ కార్య‌క్ర‌మాలు చేస్తూ జ‌న్మ‌భూమి రుణం తీర్చుకుంటోంది తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం – యూఎస్ఏ. ఈ సేవ కార్య‌క్ర‌మాల్లో భాగంగా మహిళా దినోత్సవ నెలలో TDF USA నుంచి మహిళా సాధికారత ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచాల్ మండ‌లంలోని లింగంపల్లి గ్రామంలో మ‌హిళ‌ల ఉపాధి కోసం అధునాత‌న కంప్యూట‌రైజ్డ్ ఎంట్రాయిడ‌రీ మిష‌న్ ప్రారంభించారు. 15 మందికిపైగా మహిళా బృందానికి ఉపాధి కల్పించడానికి రూ. 5 లక్షలకుపైగా విలువైన కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ను స్పాన్సర్ చేశారు.

లింగంపల్లి గ్రామానికి చెందిన TDF – USA ప్రెసిడెంట్ డాక్టర్ దివేష్ అనిరెడ్డి ఆధ్వ‌ర్యంలో మహిళా సాధికారత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. హెడ్ మాస్టర్ ఇమ్మడి సత్యనారాయణ, ప్రగతి NGO ప్రెసిడెంట్ లక్ష్మణ్ సహాయ సహకారాలతో స్థానిక సహకారంతో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. TDF మహిళా సాధికారత ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలకు ఉపాధి కల్పించే కస్టమైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్ ను ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మంలో TDF USA మాజీ అధ్యక్షురాలు కవితా చల్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

TDF USA ప్రెసిడెంట్ డాక్టర్ దివేష్ అనిరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, స్పాన్సర్ చేయడం అభినందనీయమ‌న్నారు కవిత చల్లా, TDF -IND కార్యదర్శి రాజేష్ మట్టా. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల కోసం దివేష్ తన నాయకత్వంలో అమలు చేసిన అన్ని గొప్ప పనులను ఈ సంద‌ర్భంగా వారు అభినందించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ZPTC నిత్యా నిరంజన్ రెడ్డి త‌న ప్ర‌సంగంలో చక్కని సందేశంతో మహిళలను ప్రోత్సహించారు. కార్యక్రమంలో సర్పంచ్ వినోద మూర్తి, గ్రామ కార్యదర్శి శిరీష పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కవితా చల్లా కృతజ్ఞతలు తెలిపారు. లింగంపల్లి గ్రామ అవసరాల కోసం మహిళలకు మరింత స‌పోర్టుగా ఉంటామ‌ని ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న మహిళా దినోత్సవం సందర్భంగా TDF – USA నుండి TDF మహిళా సాధికారత కోసం చొరవ చూపుతూ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను జరుపుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో TDF USA అధ్య‌క్షుడు డాక్టర్ దివేష్, TDF USA పూర్వ అధ్య‌క్షురాలు క‌విత చ‌ల్లా, లింగంపల్లి హైస్కూల్ హెడ్ మాస్టర్ ఇమ్మడి సత్యనారాయణ, ZPTC నిత్యా నిరంజన్ రెడ్డి, సర్పంచ్ వినోద మూర్తి, పంచాయితీ సెక్ర‌ట‌రీ ఎన్. శిరీష, ప్రగతి NGO ప్రెసిడెంట్ లక్ష్మణ్ & టీమ్, ప్రగతి NGO ట్రీజ‌ర‌ర్ యోర మ‌హేంద‌ర్, ప్రగతి NGO జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ పి.శ్రీ‌నివాస్, ప్రగతి NGO వైస్ ప్రెసిడెంట్ పెర‌క ముర్తి, గ్రామ‌ వార్డు మెంబ‌ర్‌లు బెరుగు ఎల్ల‌య్య, క‌రుణాక‌ర్ రెడ్డి, డాక్రాగ్రూప్ మండ‌ల్ కో-ఆర్టినేట‌ర్ సంతోష్, TDF ఇండియా టీమ్ రాజేశ్వర్ మట్ట, TDF ఇండియా చైర్ అనుపమ బొందుగుళ్ల పాల్గొన్నారు.

***

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin