HYDERABAD (MediaBoss Network): హైదరాబాద్ నగరానికి చెందిన కళాశాల యువత కోసం తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF – USA) “యూత్ ఫోర్స్” ఆర్గనైజేషన్ మద్దతుతో “యూత్ ఫోర్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్”ని నిర్వహించింది. “నో టు డ్రగ్స్” ప్రధాన లక్ష్యంగా ఆరోగ్యసేవా ప్రాజెక్టును టీడీఎఫ్ కొనసాగిస్తోంది.
తెలంగాణ యువతకు మరిన్ని క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడమే టీడీఎఫ్ ఆరోగ్యసేవా ప్రాజెక్టు అని టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని వివిధ ఇంజినీరింగ్, డిగ్రీ, మెడికల్ కాలేజీల నుంచి మొత్తం 20 టీమ్‌లు పాల్గొన్నాయి. ఇందులో 450 మంది యువత యూత్ ఫోర్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించిన వివిధ క్రీడలలో పాల్గొన్నారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రధాన పోస్టర్‌ను TSNAB (యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ సందీప్ శాండిల్య విడుదల చేశారు. మార్చ్ 17కి Q -సిటీ లో “చర్చ విత్ రియల్ హీరో” అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని వినీల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సందీప్ శాండిల్య ముఖ్య అతిథిగా వస్తున్నట్టు తెలిపారు.
డ్రగ్స్ పట్ల యువత ఆకర్షితులు కాకుండా ప్రత్యేకించి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో యువతను నిమగ్నం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని యూత్ ఫోర్స్ చైర్మన్ ఎ.వినీల్ తెలిపారు.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews