(న్యూజెర్సీ – స్వాతి దేవినేని):
పేద విద్యార్థుల చదువు ఆగిపోకూడదని, వారి కలలను సాకారం చేసి సమాజ అభ్యున్నతికి తోడ్పాటును అందించడమే తమ లక్ష్య సాధన అని తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ నిరూపిస్తోంది. ప్రవాసుల నుంచి విరాళాలు సేకరించి భారత్‌ని పేద విద్యార్థుల చదువు కోసం ఈ సంస్థ ఆర్థిక సాయం చేస్తోంది. న్యూజెర్సీలోని రాయల్ అల్భర్ట్స్ ప్యాలెస్‌లో ఈ సంస్థ 15వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సంస్థ నిర్వాహకులు పలువురి నుంచి విరాళాలు సేకరించారు. ఈ విరాళాలను పేద విద్యార్థుల చదువుకోసం వినియోగించనున్నట్లు తెలిపారు.
తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఇప్పటికే 402 మంది విద్యార్థులకు స్కాలర్షిప్‌లు అందించింది. 55 ప్రాజెక్టులను పూర్తి చేసింది. గడిచిన 15 ఏళ్లలో భారత్‌ని పేద విద్యార్థులకు రూ. 3.5 కోట్లకుపైగా పంపిణీ చేసింది. వందలాది మంది పేద విద్యా ర్థుల చదువుకోసం తాము చేయుత అందించామని, మున్ముందు కూడా కొనసాగిస్తామని తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త తెలిపారు. సుమారు వెయ్యి మంది హాజరైన ఈ కార్యక్రమంలో లక్షా మూడు వేల డాలర్ల విరాళాలు సేకరించినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త, ఫండ్ రైజింగ్ డైరక్టర్ ప్రవీణ్ గూడూరు, వార్షికోత్సవ కార్యక్రమ కన్వీనర్ బోయపాటి అరవింద బాబు తెలిపారు.
ఫౌండేషన్ అధ్యక్షులు కృష్ణ కొత్త సంస్థ కార్యక్రమాలను వివరించారు. ఈ ఏడాది 76 మందిని స్పాన్సర్ చేయగా అందులో 13 మంది డాక్టర్లు కాబోతున్నారని తెలిపారు. ఒక వైద్య విద్యార్థి తండ్రి ఓ ఆసుపత్రి ముందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఒక గిరిజన విద్యార్థి లాయరు కాబోతున్నాడు. తమ సామాజిక వర్గంపై జరుగుతున్న అణచివేతను ఎదుర్కోవడమే తన ధ్యేయం. ”తలదించుకొని చదువుకొండి.. సమాజంలో రేపటి రోజున తలెత్తుకుని జీవించండి” అంటూ ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు హితబోధ చేశారు. తాము విద్యా ర్థుల కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్, కంప్యూటర్ అప్లికేషన్‌లో మాస్టర్స్, సీఏ వంటి ఉన్నత విద్యకు సహాయం చేస్తున్నామన్నారు. తాము ఇప్పటివరకు స్పాన్సర్ చేసిన 402 మంది విద్యార్థులలో 155 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారు ఉన్నట్లు తెలిపారు. 30 మంది ఐఐటీ, సెంట్రల్ యూనివర్శిటీలు, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్నారని తెలిపారు. తాము ఆర్థికంగా, నైతికంగా ఇచ్చే మద్దతుతో విద్యార్థులు తమ చదువులో లక్ష్యాలు సాధిస్తున్నారని అధ్యక్షుడు వివరించారు.
ఈ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సింగర్‌లు సుమంగళి, సుందరి ములకలూరి, ప్రసాద్ సింహాద్రీ, అర్జున్ ఆడపల్లి పాటలు పాడి శ్రోతలను ఉర్రూతలూగించి విరాళాలకు సహకరించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్ తన ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తూ, అద్భుతమైన సేవ చేస్తున్న సంస్థను అభినందించారు. శ్రీలక్ష్మి కుల్కర్ణి యాంకరింగ్‌తో కార్యక్రమాలను ఆహ్లాదంగా నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగువారి కమ్మని భోజనాలను తెలుగు పీపుల్ సభ్యులు, తెలుగు ఎన్నారైలు ఆరగించారు.
ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ, చుట్టుపక్కల ప్రాంతాల తెలుగు ప్రజలు, తానా, నాటా, మాటా, నాట్స్, టీఫాస్, ఎన్ జె టి ఎ, ఆటా, టిటిఎ, ఎన్నారైవిఏ, ఆటీ తదితర తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరై సహకారం అందించారు.
న్యూజెర్సీ అసెంబ్లీకి పలు పర్యాయాలు ఎన్నికైన ఉపేంద్ర చివుకుల, తెలుగు ప్రముఖులు దాము గేదెల, ప్రదీప్ సువర్ణ, రవి ధనపునేని, నాట్స్ చైర్ పర్సన్ అరుణ గంటి, ఎన్ జెటిఎ వ్యవస్థాపకురాలు మంజుభార్గవ, నాటా డైరక్టర్ ఉషా చింతా, మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, తానా నాయకులు రామకృష్ణ వాసిరెడ్డి, ఎన్నారైవిఎ నాయకులు వెంకట శ్రీరాం, టీటీఎ నుంచి సుధాకర్ ఉప్పల, ఆటా నుంచి కిషోర్ లింగమల్లు, కుమారరాజా సదరం తదితరులు హాజరయ్యారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews