టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో తెలంగాణ నేప‌థ్య చిత్రాల హవా కొన‌సాగుతోంది. ఇటీవ‌ల చిన్న సినిమాగా వ‌చ్చిన‌ “బ‌ల‌గం” సూప‌ర్ హిట్ కొట్టింది. ఇదే క్ర‌మంలో తెలంగాణ నేప‌థ్యంలో మ‌రో సినిమా రాబోతోంది. తెలంగాణ యాస-బాస, కట్టూ-బొట్టూ, ఆచారాలు-సంప్రదాయాలు, స్వార్ధాలు-త్యాగాలు, ద్వేషాలు-ప్రేమలు.. ఇలా అన్ని సమపాళ్ళలో కలిపి తెలంగాణా పల్లెటూరి నేపథ్యంతో తెర‌కెక్కిన చిత్రం ‘భీమ‌దేవ‌ర‌ప‌ల్లి బ్రాంచీ’.

విడుద‌ల‌కు ముస్త‌బ‌వుతోన్న ఈ చిత్రం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘భీమ‌దేవ‌ర‌ప‌ల్లి బ్రాంచీ’ టీజ‌ర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించింది. టీజ‌ర్ విడుద‌లైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 27 ల‌క్ష‌ల వ్యూస్ సాధించి భారీ బ‌డ్జెట్ సినిమాలకు ధీటుగా నిల‌బ‌డింది. టీజ‌ర్‌తోనే ఈ రేంజ్‌లో వ్యూస్ రావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. స్వ‌చ్ఛంగా సాగుతోన్న ఓ తెలంగాణ గ్రామంలోకి కుట్ర‌లు చొర‌బ‌డితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. న‌వ్విస్తూ, ఆలోచింప‌జేస్తూ, భావోద్వేగానికి గురి చేస్తూ, ఆందోళ‌న ప‌రుస్తూ.. చివ‌రికి మ‌న‌సునే తేలిక‌ప‌స్తుంది. కళ్ళు చెమ్మగిల్లేలా, గుండె తడి అద్దిన ఇలాంటి సినిమా ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతుంద‌ని ఇప్ప‌టికే ప్రివ్యూ చూసిన వారు చెబుతున్నారు. సెన్సార్ పూర్తి అయ్యాక సినిమా విడుద‌ల తేదీ ప్ర‌క‌టించ‌నున్నారు చిత్ర‌యూనిట్.

ఏబి సినిమాస్‌, నిహాల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై అంజి వల్గుమాన్‌, రాజవ్వ, సుధాకర్‌ రెడ్డి, కీర్తిలత గౌడ్‌, అభిరామ్‌, రూప శ్రీనివాస్‌, సాయి ప్రసన్న, బుర్ర శ్రీ‌నివాస్ నటీనటులుగా రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో రూపొందింది. బత్తిని కీర్తిలత గౌడ్ – రాజా నరేందర్‌ చెట్లపెల్లి సంయుక్తంగా నిర్మించారు.

గుండె గుండెను తాకే సిన్మా.. ‘భీమదేవరపల్లి బ్రాంచీ’

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php 

By admin