● గల్ఫ్ కుటుంబాల కోపానికి ముగ్గురు సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీలు ఓడిపోయారు
● గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించాలి
● గల్ఫ్ లోని ఇండియన్ ఎంబసీలకు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వాలి
● ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించినందున గల్ఫ్ కార్మిక కుటుంబాలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా భారీగా నష్టపోయిందని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి అన్నారు. గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికుల రక్షణ అనే అంశంపై ఢిల్లీలో మంగళ, బుధ రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో మంద భీంరెడ్డి మాట్లాడారు. 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్ సభ నియోజవర్గాలలో ముగ్గురు సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీలు ఓడిపోవడానికి కోపంతో ఉన్న గల్ఫ్ కార్మిక కుటుంబాలు కూడా ఒక కారణం అని ఆయన అన్నారు.

ఈ సమావేశాన్ని బ్రిటన్ కు చెందిన ఫెయిర్ స్క్వేర్ అనే సంస్థ, ఢిల్లీలోని సిఈసి అనే సంస్థతో కలిసి నిర్వహించింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని మంద భీంరెడ్డి కోరారు. గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీలు, కాన్సులేట్ లలో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అనే అత్యవసర నిధి ఉన్నది. కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకోవడానికి ఈ నిధిని భారత రాయబారులు ఉపయోగిస్తుంటారు. నిధుల కొరత వలన అవసరమైన పేద వలస కూలీలకు సరైన సహాయం అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో గల్ఫ్ దేశాలలోని ఎంబసీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన కోరారు.

గల్ఫ్ దేశాలకు వలస కార్మికుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ (రిక్రూట్మెంట్) దాని చట్టపరమైన నియంత్రణ, నియంత్రణ సడలింపు అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో మంద భీంరెడ్డి ప్యానలిస్ట్ గా పాల్గొన్నారు. ఈ చర్చ కు సెంటర్ ఫర్ ఎజుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రతినిధి జె. జాన్ అధ్యక్షత వహించారు. ఈక్విడెమ్ సంస్థ ప్రతినిధి నిఖిల్ ఈపెన్ లు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్ ప్రతినిధి న్యాయవాది క్రాంతి ఎల్సీ ముంబయి నుండి జూమ్ ద్వారా చర్చలో పాల్గొన్నారు.

లక్షలాది మంది పేద భారతీయ కార్మికులు గల్ఫ్ దేశాలలో తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. సరైన నియంత్రణ లేని రిక్రూటింగ్ ఏజెంట్ల దోపిడీ పద్ధతుల వలన ఉద్యోగార్థులు నష్టపోతున్నారు. అధిక రిక్రూట్‌మెంట్ ఫీజులు, లోపభూయిష్ట సమాచారం, మోసం, ఉద్యోగ ఒప్పంద ఉల్లంఘన లాంటివి జరుగుతున్నాయనే ప్రశ్నకు మంద భీంరెడ్డి సమాధానం ఇస్తూ గల్ఫ్ దేశాలకు కొత్తగా ఉద్యోగానికి వెళ్లేవారు గమ్కా మెడికల్ డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. చెస్ట్ ఎక్స్ రే బాగాలేదని అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న విషయాలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు.

రూ.10ల క్షల విలువైన ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే ప్రమాద బీమా కేవలం ఈసీఆర్ పాస్ పోర్ట్ వారికి మాత్రమే ఇస్తున్నారు. ఈసీఎన్నార్ పాస్ పోర్ట్ కలిగినవారికి కూడా ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులో ఉంచాలని భీంరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చెందారు. ఈ పాలసీలో సహజ మరణాన్నిచేర్చాలనికోరారు. విజిట్ వీసా, ఎంప్లాయిమెంట్ తో సహా అన్నిరకాల వీసాలపై భారత్ నుండి గల్ఫ్ కు వెళ్లే ప్రతి ఒక్కరి సమాచారాన్ని ప్రభుత్వం సేకటించి డేటాను తయారు చేయాలని ఆయన కోరారు.

కొత్త ఎమిగ్రేషన్ బిల్లు లోని లోపాలను నిఖిల్ విశ్లేషించారు. ఫెయిర్ స్క్వేర్ సంస్థ ప్రతినిధులు  ఉస్మాన్ జావేద్, నికోలస్ మెగియన్, తెలంగాణకు చెందిన సిస్టర్ లిసీ, సుహృద తదితరులు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

 

Hystar APP
HYSTAR – TALENT HUB

🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు. ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది. అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar

ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం
24 క్రాప్టులకు ఒకే APP
HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి.
సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే!

for android users
HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

 


 

 

By admin