హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
సీల్‌వేల్ సంస్థల అధినేత, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు బండారు సుబ్బారావు జన్మదినం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ విభాగం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద వెయ్యి మంది రోగులకు, వారి సహాయకులకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా సహపంక్తి భోజన వసతి అందించారు. బండారు సుబ్బారావు జన్మదినం సందర్భంగా సేవను ధ్యేయంగా తీసుకొని, సమాజంలో చైతన్యం నింపడమే లక్ష్యంగా కౌటికె విఠల్ ఈ మహత్తర సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు
ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. భోజనం అందిన లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం, హృదయాలను హత్తుకుంది. సుదీర్ఘ ప్రయత్నాలతో ఏర్పాటుచేసిన సహపంక్తి భోజన వసతిలో విభిన్న రుచులు, పోషక విలువలు కలిగిన భోజనాలను కౌటికె విఠల్ అందించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్వ సుజాత మాట్లాడుతూ.. బండారు సుబ్బారావు గారు సేవా ధర్మానికి ప్రతీక. 365 రోజుల పాటు ఆయన చేసే దానధర్మాలు ఎవరికైనా ఆదర్శం. ఆయన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా, అన్నార్తులకు భోజన వసతి అందిస్తూ జరుపుకోవడం గొప్పదనం. ఇలాంటి కార్యక్రమం నిర్వహణకు కౌటికె విఠల్ గారు ఎంతో శ్రమించారు, ఇది ప్రశంసనీయమైందన్నారు.
మరొక ముఖ్య అతిథి పబ్బతి వెంకట రవి కుమార్ మాట్లాడుతూ.. కౌటికె విఠల్ ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా అది ఎంతో పద్ధతిగా ఉంటుంది. ఈ రోజు అందించిన భోజనాల విశిష్టత అతని సేవా తత్పరతకు నిదర్శనం. ఈ కార్యక్రమం అనేక మంది హృదయాలను కదిలించిందన్నారు.
ఈ కార్యక్రమ నిర్వహకులు కౌటికె విఠల్ మాట్లాడుతూ.. అన్నార్తులకు అన్నం అందించడం భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మహాసభ నాయకుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరం. బండారు సుబ్బారావు గారి జన్మదిన వేడుకను సేవా కార్యక్రమంగా జరపడం మనసుకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ ప్రయత్నం ద్వారా సమాజానికి కొంత మేర సేవ చేయగలిగామని అనుకోవడం గర్వకారణంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి అల్లాడి శ్రీనివాస్, నీల శ్రీధర్, డాక్టర్ ఏ.ఆర్. రాజయ్య గుప్త, అడ్వకేట్ మడుపల్లి రవి గుప్త, పివి రమణయ్య గుప్త, ఎల్.వి. కుమార్, పసుమర్తి మల్లికార్జున్, నటుకుల గురు ప్రసాద్, గూడచారి పత్రిక అధిపతి భూపతి రాజు, వైశ్య శంఖారావం పత్రిక అధిపతి కోటగిరి చంద్రశేఖర్, జర్మనీ శాస్త్రవేత్త ధారా సర్వేశ్వర గుప్త, నార్ల దీపక్ తదితరులు హాజరయ్యారు.
ఈ మహోన్నత సేవా కార్యక్రమం విశేష ప్రశంసలు అందుకోవడమే కాకుండా, సమాజానికి స్ఫూర్తినిచ్చే సంఘటనగా నిలిచింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని పలువురు ఆకాంక్షించారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/