సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పోరుబాట
– ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి
హైదరాబాద్ (Media Boss Network):
తెలంగాణలో పోరుబాటకు సిద్ధమయ్యాయి దళిత ఉపకులాలు. భారీ బహిరంగ సభకు సన్నద్దమవుతున్నాయి. తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వచ్చే సెప్టెంబర్‌లో లక్షమందితో ‘ఆత్మగౌరవ సభ’ నిర్వహించబోతున్నట్టు ‘ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించే ఈ బహిరంగ సభలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న దళిత ఉపకులాల ప్రజలు పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘దళిత ఉపకులాలు – సామాజిక -రాజకీయ చైతన్యం’ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో మేధవులు, సామాజిక సంఘాల నాయకులు, దళిత ఉప కులాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. అట్టడుగున ఉన్న దళిత ఉప కులాల నాయకులు రాజకీయంగా అడుగు ముందుకేయాలని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ చెప్పినట్టు పోరాటం చేయవలసిన అవసరం ఉందని దళిత ఉద్యమ సీనియర్ నాయకులు జేబీ రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్నేహ టీవీ చైర్మన్ శివ భాగ్యరావు మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ 57 కులాలు ప్రతినిధులకు సూచిస్తూ అవగాహన కల్పించారు. భారత్ బచావో నాయకులు గోపినాథ్, బీడీఎఫ్ నాయకులు పి. శంకర్ తదితరులు ప్రసంగించారు.
దళితులలో మాల, మాదిగ కులాలు కాకుండా మిగిలిన అత్యంత వెనుకబడిన 57 ఉప కులాలు అట్టడుగుస్థాయిలో అభివృద్ధికి, అధికారానికి దూరమై ఎలా కొట్టుమిట్టాడుతున్నాయో బైరి వెంకటేశం వివరించారు. అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలంటూ ఎస్సీ ఉప కులాల సంక్షేమం కోసం పలు డిమాండ్లు పెట్టారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎస్సీ ఉపకులాలకు దళితబంధు అందలేదని, దళితబంధులో ఉప కులాలకు 40 శాతం కేటాయించాలని, ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి వెంటనే రూ. 2 వేల కోట్ల నిధులను కేటాయించాలని, నామినేటెడ్ పదవుల్లో రెండు ఎమ్మెల్సీ, ఒకక రాజ్యసభ స్థానాన్ని ప్రకటించాలని, వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ తమ సామాజిక వర్గాలకు 6 స్థానాలు కేటాయించి న్యాయం చేయాలని, తమ కుల ధృవీవరణ పత్రాలు ఆర్డీవో ద్వారా కాకుండా ఎమ్మార్వో ద్వారా కేటాయించాలని బైరి వెంకటేశం డిమాండ్ చేశారు.
తెలంగాణలో 22 లక్షల జనాభా కలిగి, దళితులలో 34 శాతం ఉన్న దళిత ఉపకులాలు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలలోనూ అత్యంత వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంచార జీవనానికి, కళారూపాల ప్రదర్శనకు, చేతివృత్తులతో పూట గడవడమే గగనం అన్నట్టు జీవిస్తున్నారని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత వెనుకబడి ఉండి, కనీస గుర్తింపుకు నోచుకోవడం లేదన్నారు. ఇప్పటికీ కుల ధృవీకరణ పత్రాలు సకాలంలో అందుకోలేని పరిస్థితి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి నాయకులు నిరగొండ బుచ్చన్న గోసంగి, రాయల లక్ష్మినారాయణ చిందు, తులసిదాస్ గైక్వాడ్ మాంగ్ , బ్యాగర కేశవులు, కర్నే రామారావు డక్కలి, మల్లెల సాయి చరణ్ గోసంగి, దొంబర దివాకర్, టీఎన్ స్వామి మిత అయ్యాల్వర్ , ధర్మయ్య మాష్టిన్, శ్రీనివాసరావు మాల దాసరి, గడ్డం సమ్మయ్య చిందు,మల్లికార్జున్ మాలజంగం, బీరయ్య మాదాసి కురువ, కొండయ్య హోళియదాసరి, కాంబ్లే శంకర్ మాంగ్, రాజారామ్ డక్కలి, గడ్డం చిరంజీవి, పోలేంటి సాగర్, పులి కల్పన తదితరులు పాల్గొన్నారు.
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews