Washington, D.C. (MediaBoss Network):
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాబోయే అధ్యక్షుడు జయంత్ చల్లాకు వాషింగ్టన్‌లో ఘనస్వాగతం లభించింది. వర్జీనియాకు చెందిన పలువురు ఆటా సభ్యులు వాషింగ్టన్ డల్లెస్ విమానాశ్రయంలో జయంత్ చల్లాకు స్వాగతం పలికి పుష్ఫగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకుని సెలబ్రెట్ చేసుకున్నారు.
కవిత చల్లా, రవి చల్లా, రామ్‌మోహన్ సురినేని, వేణు నక్షత్రం, జీనత్ కుందూరు, మల్లారెడ్డి, మల్లా కల్వ, ముత్యం పెంటల, మనసారెడ్డి, జీనత్ కుందూరు, ఈశ్వర్ బండా, నవీన్ చల్లా, నరేందర్ చల్లా, అవంతిక నక్షత్రం.. తదితరులు జయంత్ చల్లాకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్‌వేగాస్‌లోని ది మిరాగ్‌లో శనివారం జరిగిన ఆటా బోర్డు మీటింగ్‌లో ప్రస్తుత అధ్యక్షుడు భువనేశ్ భూజల నూతన అధ్యక్షురాలికి బాధ్యతలు అప్పగించారు. సమావేశానికి యూఎస్‌లోని ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews