#globaltimestelugu
వేములవాడ/హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడ ఇద్దరు ముఖ్య నేతలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు రేసులో ఉన్నారు. మరోవైపు మాజీ జడ్పీ చైర్మన్ పర్సన్ తుల ఉమా కూడా ఇదే సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా వేములవాడ కుర్చీలో కర్చీఫ్ గట్టిగా వేయడంతో అభ్యర్థిని ఎంపిక చేయడం బీజేపీ హైకమాండ్‌కు కష్టంగా మారింది.
ఈ క్రమంలో మీడియాబాస్ నెట్‌వర్క్‌కు చెందిన మరో మీడియా సంస్థ ”గ్లోబల్ టైమ్స్” ఆన్‌లైన్ వేదికగా ఓ పోల్ నిర్వహించింది. ”వేములవాడ బీజేపీ టికెట్ ఎవరికి ఇస్తే గెలుపు ఛాన్స్ ఉంటుంది?” అన్న ప్రశ్నను సంధించగా అత్యధికంగా సీహెచ్ వికాస్‌కు 65 శాతం ఓట్లు పడ్డాయి. తుల ఉమకు 35 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ పోల్ ప్రకారం వికాస్‌కే ప్రజల మద్దతు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే వికాస్ వేములవాడ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బీజేపీ ఆశావహ అభ్యర్థిగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న తుల ఉమ ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లోకి దిగిపోయారు. మొదటి మూడు జాబితాల్లో వేములవాడ టికెట్‌ను బీజేపీ ఖరారు చేయలేదు. ఇక వికాస్ రావు కు బండి సంజయ్ మద్దతు ఇస్తుంటే.. తుల ఉమకు ఈటల రాజేందర్ మద్దతు ఇస్తున్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r