తెలంగాణ అమెరికా తెలుగు సంఘం – టీటీఏ.. ఆధ్వర్యంలో మెగా కన్వెన్షన్ 2022 ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు న్యూజెర్సీలో నిర్వహించనున్నారు టీటీఏ నిర్వహకులు. ఈ సందర్భంగా ఏప్రిల్ 30న రాయల్ అల్బర్ట్ ఫ్యాలెస్‌లో టీటీఏ ప్రీ కన్వెన్షన్ కమ్యూనిటీ డిన్నర్ కార్యక్రమం జరిగింది.
అమెరికాలోని ఆటా, తానా, నాటా.. వంటి అన్నిసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా తర్వాత ఈ మెగా కన్వెన్షన్ భారీగా నిర్వహించబోతున్నట్టు టీటీఏ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి పటలొల్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా అతిరథ మహరథులు పాల్గొనబోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు చాలా శ్రమించామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ మెగా కన్వెన్షన్ 2022 ఉత్సవాల్లో తెలంగాణ సంప్రదాయలు, వైభవం చాటి చెప్పే విధంగా ఉంటాయని టీటీఏ కన్వీనర్ శ్రీనివాస్ గనగోని చెప్పారు. పొలికల్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించామని చెప్పారు. ఈ మెగా కన్వెన్షన్ కోసం 30 కమిటీలు పని చేశాయని, పనుల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ఈ డిన్నర్ కార్యక్రమంకు ఆహ్వానించామని తెలిపారు. ఈ మెగా కన్వెన్షన్‌ను సక్సెస్ చేయాలని కోరారు.