హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతో 60 మందితో ప్రయాణిస్తున్న బోటు సాగర్ మధ్య లో ఆకస్మాత్తుగా ఆగిపోయింది. నిన్న జరిగిన ఈ ఘటనపై ఓ టూరిస్ట్ ట్వీ ట్ చేయడంతో తాజాగా వెలుగుచూసింది. ‘60 మంది సందర్శకులతో నిన్న ఓ బోటు హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్దకు వెళ్లిం ది. తిరిగి వెనక్కి వస్తున్న సమయంలో గాలుల తీవ్రతతో ఇంజిన్ ఆగిపోయింది. దీంతో టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. స్టీమర్ బోట్ల సహాయంతో పెద్ద బోటును ఒడ్డుకు చేర్చా రు’ అని ఆనంద్ ట్వీట్ చేశారు. దీనిపై టూరిజం ఎం డీ మనోహర్ స్పందించారు. గాలుల తీవ్రత ఎక్కువైనప్పు డు ఒడ్డుకు వచ్చే సమయంలో బోటు ఇంజిన్ స్లో చేస్తామని, అవసరమైతే స్టీమర్ బోట్లతో ఒడ్డుకు చేరుస్తామని చెప్పా రు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లో టూరిస్ట్ బోటును తిప్పడం లేదని వెల్లడించారు. అయితే తుఫాన్ లాంటి స‌మ‌యాల్లో టూరిజం శాఖ‌ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సాంకేతిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్కారించాల్సి ఉంటుంది. నిర్ల‌క్ష్యం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డిన‌ట్ట‌యింది.

https://twitter.com/HiHyderabad/status/1547476568443740160/photo/1

By admin