జగిత్యాల (mediaboss network):

వరదల కవరేజీకి వెళ్లి గల్లంతైన జర్నలిస్ట్ కథ విషాదాంతమైంది. జగిత్యాల జిల్లాలో వరదల కవరేజీ చేయడానికి వెళ్లి వాహనంతో పాటు గల్లంతైన రిపోర్టర్ జమీర్ మృతదేహం లభించింది. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామోజీ పేట వాగు వద్ద Ntv ఛానల్‌‌లో రిపోర్టర్ పని చేస్తున్న జమీర్ తన కారుతో సహా మూడు రోజుల కిందట గల్లంతయ్యాడు. భారీ వర్షాల కారణంగా సహాయ చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

టీమ్ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన క్రేన్ తో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు గాలింపు జరిపినప్పటికీ వరద ఉధృతి కారణంగా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. నేటి ఉదయం తిరిగి గాలింపులు జరపగా జమీర్ కి చెందిన షిఫ్ట్ కార్ వరద నీటిలో మునిగిపోయి కనిపించింంది. వెంటనే వాహనాన్ని బయటకు తీసి పరిశీలించగా అందులో జమీర్ కి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. చివరకు గజ ఈతగాళ్లు సాయంతో మరింత దూరం వరకు గాలించగా పొదలలో చిక్కుకున్న రిపోర్టర్ జమీర్ మృతదేహం లభించింది.

అసలేం జరిగిందంటే.. 

రాయికల్ మండలం లోని బోరున పల్లి గ్రామ శివారులో గోదావరి నది సమీపంలో మూడు రోజుల కిందట వరద నీటిలో కొందరు కూలీలు చిక్కుకుపోయారు. తొమ్మిది మంది వరద నీటిలో చిక్కుకుపోగా అందుకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. దీంతో వార్త కవరేజ్ తీసుకుని జర్నలిస్టు జమీర్ తన వాహనంలో తిరుగుప్రయాణం అయ్యాడు. ఇంటి వద్ద నుండి ఫోన్ రావడంతో తిరుగు ప్రయాణమైన జమీర్.. త్వరగా ఇంటికి చేరుకోవాలని తన సెల్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని కార్లో బయల్దేరాడు. అయితే రామోజీ పేట మీదుగా వెళ్తుండగా వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొద్ది సేపు అక్కడే వెయిట్ చేశారు. ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అవుతూ ఉండడం… అక్కడ తన కూతురు అనారోగ్యంగా ఉందని ఆలోచనతో ధైర్యం చేసి నీటిలోకి దిగిన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

బెడిసికొట్టిన ప్రయత్నం..

నెమ్మదిగా వెళ్దామని, ఫస్ట్ గేర్‌లో వెళ్తే ఏమీ కాదని అక్కడే ఉన్న కొందరు అనడంతో రిపోర్టర్ మరో ఆలోచన లేకుండా అక్కడి నుంచి ముందుకు కదిలారు. అయితే వరదనీటిలో మధ్య వరకూ వెళ్లిన తర్వాత ఆకస్మికంగా ఇంజన్ పని చేయలేదు. నీరు నిండిపోయి పూర్తిగా ఇంజన్ ఆఫ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. తన స్నేహితుడితో తనకు ఏమైనా అయితే కుటుంబం పరిస్థితి ఏంటి అంటూ చివరి నిమిషంలో భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కార్ నుండి బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ వరద అధికం కావడంతో ఒక్కసారిగా కొట్టుకుపోయినట్లు తోటి మిత్రుడు తెలిపారు.

ఈత కొట్టి తప్పించుకుని..

వరద నీటిలో కొట్టుకుపోతున్నప్పటికీ ఈతకొట్టిన ఇర్షాద్ చాకచక్యంగా బయటపడి ఒడ్డుకు చేరాడు. వెంటనే పోలీసులకు, అధికారులకు జమీర్ గురించి సమాచారం అందించాడు. దీంతో విషయం తెలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ రవి, ఎస్పి సింధు శర్మ సహాయక చర్య లు ప్రారంభించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అప్పటి నుండి మూడు రోజులపాటు అసలు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో అందరూ ఉండిపోయారు.ఇది జమీర్ కూడా సురక్షితంగా ఎక్కడో బయటపడి ఉంటాడని కుటుంబసభ్యులు ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు కార్ కూడా లభించకపోవడంతో ఆందోళన చెందారు. మరికొద్ది దూరంలో జర్నలిస్ట్ జమీర్ మృతదేహం లభించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

అసలేం జరిగిందంటే..

రాయికల్ మండలం లోని బోరున పల్లి గ్రామ శివారులో గోదావరి నది సమీపంలో మూడు రోజుల కిందట వరద నీటిలో కొందరు కూలీలు చిక్కుకుపోయారు. తొమ్మిది మంది వరద నీటిలో చిక్కుకుపోగా అందుకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. దీంతో వార్త కవరేజ్ తీసుకుని జర్నలిస్టు జమీర్ తన వాహనంలో తిరుగుప్రయాణం అయ్యాడు. ఇంటి వద్ద నుండి ఫోన్ రావడంతో తిరుగు ప్రయాణమైన జమీర్.. త్వరగా ఇంటికి చేరుకోవాలని తన సెల్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని కార్లో బయల్దేరాడు. అయితే రామోజీ పేట మీదుగా వెళ్తుండగా వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొద్ది సేపు అక్కడే వెయిట్ చేశారు. ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అవుతూ ఉండడం… అక్కడ తన కూతురు అనారోగ్యంగా ఉందని ఆలోచనతో ధైర్యం చేసి నీటిలోకి దిగిన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

బెడిసికొట్టిన ప్రయత్నం..

నెమ్మదిగా వెళ్దామని, ఫస్ట్ గేర్‌లో వెళ్తే ఏమీ కాదని అక్కడే ఉన్న కొందరు అనడంతో రిపోర్టర్ మరో ఆలోచన లేకుండా అక్కడి నుంచి ముందుకు కదిలారు. అయితే వరదనీటిలో మధ్య వరకూ వెళ్లిన తర్వాత ఆకస్మికంగా ఇంజన్ పని చేయలేదు. నీరు నిండిపోయి పూర్తిగా ఇంజన్ ఆఫ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. తన స్నేహితుడితో తనకు ఏమైనా అయితే కుటుంబం పరిస్థితి ఏంటి అంటూ చివరి నిమిషంలో భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కార్ నుండి బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ వరద అధికం కావడంతో ఒక్కసారిగా కొట్టుకుపోయినట్లు తోటి మిత్రుడు తెలిపారు.

ఈత కొట్టి తప్పించుకుని..

వరద నీటిలో కొట్టుకుపోతున్నప్పటికీ ఈతకొట్టిన ఇర్షాద్ చాకచక్యంగా బయటపడి ఒడ్డుకు చేరాడు. వెంటనే పోలీసులకు, అధికారులకు జమీర్ గురించి సమాచారం అందించాడు. దీంతో విషయం తెలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ రవి, ఎస్పి సింధు శర్మ సహాయక చర్య లు ప్రారంభించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అప్పటి నుండి మూడు రోజులపాటు అసలు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో అందరూ ఉండిపోయారు. ఇది జమీర్ కూడా సురక్షితంగా ఎక్కడో బయటపడి ఉంటాడని కుటుంబసభ్యులు ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు కార్ కూడా లభించకపోవడంతో ఆందోళన చెందారు. మరికొద్ది దూరంలో జర్నలిస్ట్ జమీర్ మృతదేహం లభించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

By admin