మెట్‌పల్లి (మీడియాబాస్ నెట్‌వర్క్): జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విద్యార్ధుల ఇబ్బందులు తీర్చాలంటూ ధర్నా తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. కోరుట్ల (అయిలాపూర్)లోని మహాత్మజ్యోతిబాపులే గురుకుల పాఠశాలను అన్నివసతులున్న భవనంలోకి మార్చాలంటూ మెట్‌పల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా చేశారు. ఆర్డీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అయిలాపూర్ భవనంలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఎంతోకాలంగా అధికారుల దృష్టికి తీసుకువస్తున్నా స్పందన లేదంటూ పేరెంట్స్ నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ భవనాన్ని గుర్తించమని ఆర్డీవో, ఇతర అధికారులను ఆదేశించినట్టు జగిత్యాల కలెక్టర్ వివరణ ఇచ్చారు. అయితే అధికారులెవరూ స్పందించడం లేదని, మూడేళ్లుగా తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.