స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. అయితే సినిమా విడుదలకు ముందే ‘రౌడీ’ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. దుబాయ్‌లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికే ఆయన చాలా తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ‘లైగర్’కి కూడా రివ్యూ ఇచ్చేశాడు. ‘లైగర్’ ఫస్ట్ రివ్యూను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. ఆయన సమీక్ష ప్రకారం.. చిత్రం పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. సినిమా మొత్తానికి విజయ్ దేవరకొండ పెర్ఫామెన్సే హైలైట్ గా నిలవనుంది. అన్ని రకాలుగా విజయ్ తన నటనతో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం ఖాయం. అద్భుతంగా నటించాడు. మరోవైపు పూరీ జగన్నాథ్ కూడా డైరెక్షన్ తో తన మార్క్ చూపించాడు. సినిమాలో అదిరిపోయే యాక్షన్ స్టంట్స్, డైరెక్షన్, డైలాగ్స్ ఉన్నాయి. రమ్యక్రిష్ణ సర్ ప్రైజ్ ప్యాకేజీగా నిలవనుంది. కథ, స్క్రీన్ ప్లే రోటీన్ గా ఉన్నా.. పలు సీన్లు మాత్రం విజిల్స్ వేయించేలా ఉన్నాయని’ ట్వీట్ ద్వారా తెలిపాడు.
ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గురువారం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. గతంలోనే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కు ఆడియెన్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను అందించాారు. అలాగే చిత్ర ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ ఒక రేంజ్ లో నిర్వహించడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. తెలుగు, హిందీలో రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేశారు.