-బీఎస్ రాములు,
బీసీ కమిషన్ మాజీ చైర్మన్BSRAMULU philosophy
పాలకులుగా ప్రజా ప్రతినిధులుగా ఎదగాలని కుంటున్న బీసీల్లారా! మహిళల్లారా! యువకుల్లారా!
మీరు నిన్నటిదాకా ఉన్నభావాల్లోనే , అదే విధానం ఆచరణలోనే ఉంటే మీరు నిన్న ఉన్నట్టే ఇవాళ ఉంటారు రేపు ఉంటారు.
మీరు ఇప్పుడున్న స్థితి నుంచి ఎదగడం సాధ్యం కాదు. మీరు ఎదగాలి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనలు జీవితం అధ్యయనం చేయండి. భారత రాజ్యాంగాన్ని విశ్లేషణ వ్యాఖానాలతో అధ్యయనం చేయండి. బీసీ రిజర్వేషన్లు ప్రతిపాదించిన బి పి మండల్ కమిషన్ నివేదికను అధ్యయనం చేయండి. మీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి కులంలో పదిమందితో కమిటీని వేయండి. అన్ని కుల కమిటీలకు మూడు నెలలకోసారి బీసీల చరిత్ర రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ఇంజనీరింగ్, నినాదాలు, ఆయా ఉద్యోగుల , కూలీల , కార్మికుల సంఘాలను కలవండి వారిలో మీ తరఫున కమిటీని వేయండి. మీ నిర్మాణం అందరికి తెలియనీయ వద్దు. . ఎక్కువ నిర్మాణం, అతి తక్కువ ప్రచారం పద్దతిలో నడవండి. ఊరేగింపులు వద్దు.. ధర్నాలు వద్దు.
సమాచార హక్కు చట్టం కింద అన్ని విషయాలు తెలుసుకొండి. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు రాత పూర్వకంగా దరఖాస్తు చేయండి. సిటిజన్ చార్టర్ ప్రకారంవాటిని ఫాలో అప్ చేయండి. వార్తల్లోకి ఎక్కువ రావద్దు. పత్రికా ప్రకటన లు ఇవ్వకండి. మీ పనులే వార్తలు కావాలి. వార్తలు రాకపోతేనే మంచిది. అరిచే కుక్క కరవదు. కరిచే కుక్క మొరగదు అని గుర్తుంచుకొండి. సభలు సదస్సులు పెట్టండి. బీసీ శిక్షణా తరగతులు ప్రతి మూడు నెలలకు మూడురోజులు నిర్వహించండి. విరాళాల కు పీడించకండి. బెదిరించకండి. బ్లాక్ మేల్ చేయకండి. ఉద్యోగులు , టీచర్లు, వంటివారిని విరాళాలు అడగకండి! స్వయంగా ఇచ్చే స్పూర్తి కలిగించండి. ప్రసంగంలో ప్రతి వాక్యం మంచి విశ్లేషణ ఉండాలి. అందుకు పుస్తకాలు కొనండి చదవండి. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, పెరియార్, లోహియా కాన్సీరాం రచనలు చదవండి.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews