హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ప్ర‌తిభ ఉన్న చిన్నారుల‌కు ప్రొత్సాహం అందిస్తే వారు ఎంతో ఉన్న‌తంగా ఎదుగుతారు అనే మాట న‌మ్ముతూ ‘మనం’ ఫౌండేషన్ అలాంటి వారికి చేయుత‌గా నిలుస్తోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోని బోయిన్ ప‌ల్లిలో గవర్నమెంట్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న మోతిలాల్ అండ్ టీం జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపిక ఐన సందర్బంగా, మోతిలాల్ కోరిక మేరకు పల్లవి, శ్రీని కుమారుడు సుచిత్ పుట్టినరోజు సందర్బంగా ‘మనం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి కబడ్డీ కిట్స్‌ అందించడం జరిగింది. వీరికి భవిష్యత్తులోనూ స‌హాయంగా, అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇస్తూ ఆత్మీయ ఆతిధ్యం అందించారు ‘మనం’ ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు శ్రీ‌ల‌త‌-కుమార్. లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని చేధించాలనే వాళ్లకు చేయూత అందించే అవకాశం రావటం త‌మ‌ అదృష్ట‌మ‌ని కుమార్ అన్నారు.

ఈ సంద‌ర్భంగా హాస్టల్ లోని పిల్లలు, మనం ఫౌండేషన్ తరుపున సుచిత్ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పల్లవి, శ్రీని, సుప్రీత, కాసర్ల కుటుంబ‌ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ‘మనం’ ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు శ్రీ‌ల‌త‌-కుమార్.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

By admin