Hyderabad (mediaboss network):
ప్రపంచంలోని ప్రవాసులకు సేవలు అందించేందుకు ఏర్పాటైన ‘స్వదేశం’ ఇప్పుడు విశ్వవేదికపై సగర్వంగా వెలుగుతోంది. ‘గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్’ ఆవిర్భవ వేదికపైన స్వదేశం www.swadesam.com పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ డ్రీమ్వాలే రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమంలో జీటీఏ నాయకులు, పలు దేశాలకు చెందిన ఎన్నారైలు పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో 3 కోట్ల 20 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారని, ఏటా దేశం నుంచి 25 లక్షల మందికి పైగా విదేశాలకు వలస పోతున్నారని వారందరికి అవసరమైన సేవలను అందించేందుకు ‘స్వదేశం’ సిద్దంగా ఉందని మీడియాబాస్ సీఈవో స్వామి ముద్దం చెప్పారు. ఎన్నారైలకు ఎలాంటి సర్వీసులు కావాలన్నా వెబ్సైట్లోని ఫామ్లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో GTA ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ కల్వల, వ్యవస్థాపక సభ్యుడు శ్రవణ్, వ్యవస్థాపక సభ్యుడు శశి, ఎన్నారై వేణు.. తదితరులు పాల్గొన్నారు.