సికింద్రాబాద్: నిరుపేదల ఆకలి తీర్చడమే తమ లక్ష్యంగా రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ తమ సేవ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఎంతోమంది అనాధలు, మతిస్థిమితం లేని అభాగ్యులు, మానసిక వికలాంగులు మన చుట్టూనే ఉన్నా చూసి చూడనట్టు, పట్టీ పట్టనట్టు, మనకెందుకులే అని వ్యవహరించే మనుషులు ఉన్న నేటి సమాజంలో మానవతా దృక్పధంతో కొన్ని వందల మంది అనాధలను, అభాగ్యులను, మానసిక వికలాంగులను చేరదీసి, వారికి ఆశ్రయం కల్పిస్తూ, వారికి సరైన వైద్యంతో పాటు మూడు పూటలా పౌష్టికాహారన్నందిస్తున్న రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్‌ను వారి టీమ్‌ను అభినందించారు. తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరుస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న ఓల్డ్ ఏజ్ హోమ్ మన రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ టీమ్‌ను ఈ సందర్బంగా సత్కరించారు.
ఈ సందర్బంగా రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్ గౌడ్ మాట్లాడారు. పేదలకు సేవ చేయాలనే ఈ రెడి టూ సర్వ్ ఫౌండేషన్ ముఖ్య ఉదేశ్యమన్నారు. సాయం చేయాలనుకున్న దాతలేవరైనా మానవతా దృక్పథంతో స్పందించి మన రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ లో 25 మంది అభాగ్యులు అనాధలకు నిత్యవసర సరుకులు గానీ, కూరగాయలు గానీ, మీకు తోచినంతలో మా ఓల్డ్ ఏజ్ హోమ్‌కు సహాయం చేసి నిరుపేదలకు సేవలు అందించడంలో తోడ్పాటు అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, చైర్మన్ పెద్ది శంకర్, కో ఆర్డినేటర్ ప్రకాష్, లక్ష్మణ్, తిరుమల నాయుడు, నవీన్, నితిన్, మణి కుమార్, నాధ్ నరేష్ శివ నేత తదితరులు పాల్గొన్నారు.
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
BREAKINGNEWS TV
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews